Vizianagaram

News March 22, 2024

VZM: భార్యపై కత్తితో దాడిచేసిన భర్త

image

భర్త భార్యను హతమార్చిన ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..
జియ్యమ్మవలస మండలం సింగనాపురం గ్రామానికి చెందిన గంటా ముసలి నాయుడు భార్య అప్పలనరసమ్మపై కత్తితో దాడిచేయగా, ఆమె కడుపులో కత్తి దిగింది. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకున్నారు. ముసలి నాయుడు పరారిలో ఉండడంతో కేసు నమోదుచేసి, గాలింపు చర్యలు చేపట్టారు.

News March 22, 2024

టీడీపీ మూడో జాబితా.. ఎస్.కోట అభ్యర్థిగా లలిత!

image

టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి మూడో జాబితాలో ఎస్.కోట నుంచి కోళ్ల లలిత కుమారికి స్థానం దక్కింది. ఆమె 2009,14లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో కడుబండి శ్రీనివాసరావుపై ఓడిపోయారు. వైసీపీ నుంచి ఈసారి కూడా శ్రీనివాసరావు బరిలో ఉన్నారు. ఇప్పటికే 2014, 2019లో తలపడిన వీరి మధ్య మరోసారి పోటీ నెలకొంది. ఈసారి ఎవరు పైచేయి సాధిస్తారని మీరు భావిస్తున్నారు. కామెంట్ చేయండి.

News March 22, 2024

పార్వతీపురం: ఇంటర్ విద్యార్థి సూసైడ్

image

ఇంటర్ పరీక్షలు బాగా రాయలేదని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన పార్వతీపురంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పార్వతీపురానికి చెందిన ఓ విద్యార్థి ఇంటర్ పరీక్షలు బాగా రాయలేదని దిగాలుగా ఉండడంతో, గమనించిన తల్లిదండ్రులు ఆరా తీయగా విషయం తెలిపాడు. బెటర్ మెంట్‌లో మార్కులు తెచ్చుకోవచ్చని వారు సర్ది చెప్పినా, మనస్తాపం చెందిన విద్యార్థి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

News March 22, 2024

VZM: వెబ్‌సైట్‌లో ప్రొవిజనల్ మెరిట్ జాబితా

image

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మిషన్ వాత్సల్యలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ జాబితాను https://vizianagaram.ap.gov.in/ వెబ్‌సైట్‌లో పొందుపరిచామని ఐసీడీఎస్ పీడీ బి. శాంతకుమారి తెలిపారు. వీటిపై అభ్యంతరాలుంటే శుక్రవారం సాయంత్రంలోగా లిఖిత పూర్వకంగా తెలియజేయాలని కోరారు.

News March 22, 2024

కూనేరు చెక్ పోస్టు వద్ద ఒడిశా మద్యం స్వాధీనం

image

కొమరాడ మండలం కూనేరు చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒడిశా మద్యం పట్టుబడినట్లు ఎస్సై నీలకంఠం తెలిపారు. గురువారం రాయగడ నుంచి పార్వతీపురం వైపు వస్తున్న కారులో ఒడిశాకి చెందిన 1లిక్కర్ బాటిల్, 24 బీరు బాటిల్స్ తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. మద్యంను స్వాధీనం చేసుకుని బాధ్యుడిపై కేసు నమోదు చేశామన్నారు. రిమాండ్‌కి తరలించినట్లు వెల్లడించారు.

News March 21, 2024

సోషల్ మీడియాలో పోస్టు.. కురుపాం ఎంఎన్ఓ సస్పెన్షన్

image

కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఎంఎన్ఓగా విధులు నిర్వహిస్తున్న సిహెచ్ కిరణ్ కుమార్‌ను సస్పెండ్ చేసినట్లు ఇన్‌ఛార్జ్ డీఆర్‌ఓ జి.కేశవ నాయుడు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాజకీయ పార్టీలకు సంబంధించిన పోస్టులను సామాజిక మాధ్యమాలలో పోస్టు చేసినందుకు గాను కిరణ్ కుమార్‌ను సస్పెండ్ చేశామన్నారు. ఈ మేరకు కలెక్టర్& జిల్లా ఎన్నికల అధికారి ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు.

News March 21, 2024

విజయనగరం: నీళ్ల ట్యాంకులో పడి బాలుడు మృతి

image

తోటి పిల్లలతో కలిసి సరదాగా ఆడుకోడానికి వెళ్లిన దాసరి సిద్దు(7) అనే బాలుడు ప్రమాదవశాత్తు స్నానాలు చేసే నీళ్ల ట్యాంకులో పడి మృతి చెందిన సంఘటన భోగాపురం మండలం దెబ్బలపాలెంలో చోటుచేసుకుంది. బొబ్బిలికి చెందిన దాసరి నరసింహారావు భార్యాబిడ్డలతో కూలి పనుల కోసం భోగాపురం వచ్చారు. వారు పనులు చేస్తుండగా కుమారుడు ఆడుకోవడానికి వెళ్లి ట్యాంక్‌లో పడి చనిపోయాడని వారు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 21, 2024

ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలి: మన్యం కలెక్టర్

image

సి.విజల్ యాప్‌లో వచ్చే ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టరు, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై రిటర్నింగ్ అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పౌరులు కోడ్ ఉల్లంఘన సంబంధించి చర్యలు గుర్తించిన వెంటనే సి.విజల్ యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. నమోదు చేసిన 100 నిమిషాల్లో స్పందించాలనిక సిబ్బందికి సూచించారు.

News March 21, 2024

పాచిపెంట మండలంలో 11 మంది వాలంటీర్లు తొలగింపు

image

పాచిపెంట మండలం పాంచాలి సచివాలయం పరిధిలో పని చేస్తున్న 11 మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఎంపీడీఓ ఉన్నం లక్ష్మి కాంత్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఈనెల 19న రాజకీయ పార్టీలు కార్యకలాపాలలో పాల్గొన్నట్లు గుర్తించి.. సాలూరు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆదేశాలు మేరకు వారిని విధుల నుంచి తొలగించామన్నారు.

News March 21, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్‌కి షాక్

image

విశాఖ ఉక్కును విద్యుత్ బిల్లుల గండం మరింత భయపెడుతోంది. బాయిలర్ బొగ్గు కొరతతో ప్లాంట్‌లోని 315 మెగావాట్ల సొంత థర్మల్ విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా పడిపోయింది. ఈపీడీసీఎల్ నుంచి విద్యుత్‌ని ఉపయోగించుకుంటున్నారు. ప్రస్తుతం చెల్లించాల్సిన బకాయిలు రూ.60 కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం. ఇవి చెల్లించకపోతే సరఫరా నిలిపివేస్తామంటూ ఈపీడీసీఎల్ హెచ్చరిస్తూ నోటీసులిచ్చినట్లు తెలుస్తోంది.