Vizianagaram

News March 21, 2024

VZM: లవ్ ఫెయిల్యూర్‌తో సూసైడ్

image

తను ప్రేమించిన అమ్మాయి దక్కలేదని యువకుడు ఆత్మహత్య చేసుకొన్న ఘటన సాలూరు మండలంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెలగవలస గ్రామానికి చెందిన జన్ని రమేష్(21) తను ప్రేమించిన యువతి దక్కలేదని, పొలంలో పురుగుల మందు తాగి తన అన్నకు ఫోన్ చేసాడు. కొన ఊపిరితో ఉన్న రమేశ్‌ను ఆస్పత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 21, 2024

విజయనగరంలో గంజాయితో వ్యక్తి అరెస్టు 

image

విజయనగరం రైల్వే స్టేషన్ పక్కన గల ఓల్డ్ రైల్వే క్వార్టర్స్ వద్ద అనుమానాస్పదంగా గంజాయితో తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొన్నామని వన్ టౌన్ సీఐ బి.వెంకటరావు తెలిపారు. అతని వద్ద నుంచి 9 కిలోల గంజాయి, రూ.1070 నగదు, ఒక మొబైల్ ఫోను స్వాధీనం చేసుకున్నామన్నారు. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కి తరలించామని పేర్కొన్నారు.

News March 20, 2024

రామభద్రపురం: అత్యాచారం కేసులో జైలు శిక్ష

image

రామభద్రపురం మండలం రొంపిల్లికి చెందిన ఓ యువతిపై ముదిలి కృష్ణ అనే వ్యక్తి 2017లో అత్యాచారం కేసు నమోదయ్యింది. 11 ఏళ్ల జైలు శిక్ష, రూ.5వేలు జరిమానా విధిస్తూ విజయనగరం మహిళా సెషన్ కోర్టు న్యాయమూర్తి పద్మావతి బుధవారం తీర్పు వెలువరించినట్లు స్థానిక ఎస్ఐ జ్ఞాన ప్రసాద్ తెలిపారు. 2017లో స్థానిక పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. వాదనలు పూర్తైన పిదప న్యాయమూర్తి బుధవారం తుది తీర్పు వెల్లడించారు.

News March 20, 2024

మన్యం: ప్రశాంతంగా ఇంగ్లీష్ పరీక్ష

image

పార్వతీపురం మన్యం జిల్లాలో 66 కేంద్రాలలో నేడు నిర్వహించిన పదవ తరగతి మూడవ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని జిల్లా విద్యాధికారి జి.పగడాలమ్మ తెలిపారు. జిల్లాలో 10,554 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 10,470 మంది హాజరు అయ్యారని, 84 మంది గైర్హాజరు అయ్యారని ఆమె అన్నారు. జిల్లాలో 24 కేంద్రాలలో స్క్యాడ్లు, డీఈఓ 6 పరీక్ష కేంద్రాలలో తనిఖీలు చేశారు. జిల్లాలో 99.20 శాతం హాజరు నమోదయింది.

News March 20, 2024

పార్వతీపురంలో బీటెక్ విద్యార్థి సూసైడ్

image

పార్వతీపురం పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. కుసుమగుడి వీధికి చెందిన కల్లూరి తారకేశ్వరరావు(20) బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. చదువులో రాణించలేకపోతున్నా అనే కారణంతో మనస్థాపం చెంది బుధవారం ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయాడన్నారు. ఈ మేరకు పట్టణ ఎస్సై సంతోషి కుమారి వివరాలను నమోదు చేసుకుని.. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

News March 20, 2024

నియమావళిని ఉల్లఘిస్తే చర్యలు తప్పవు: కలెక్టర్ 

image

ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని ఉల్లంఘిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి స్ప‌ష్టంచేశారు. ప్ర‌తీ ఒక్క‌రూ త‌ప్ప‌నిస‌రిగా నియ‌మావ‌ళిని పాటించాల‌ని, ఎన్నిక‌ల క‌మిష‌న్ నిర్ధేశించిన‌ అనుమ‌తులు తీసుకోవాల‌న్నారు. రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల‌తో బుధ‌వారం స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ కార్యక్రమంలో జేసీ కార్తీక్, అసిస్టెంట్ కలెక్టర్ వెంకట త్రివినాగ్, ఆర్వోలు, తాశీల్దార్లు పాల్గొన్నారు.

News March 20, 2024

తెర్లాంలో పిడుగు పడి గొర్రెలు మృతి

image

తెర్లాం మండలం చిన్నయ్య పేటకు చెందిన గొర్రెలు, మేకల మందపై పిడుగు పడి పది మేకలు మృతి చెందాయి. మంగళవారం నుంచి కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. సుమారుగా 25గొర్రెలు మృతి చెందినట్లు తెలుస్తుంది. అధిక సంఖ్యలో మూగజీవాలు మృతి చెందటంతో గొర్రెల కాపరులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పడుతున్న సమయంలో పొలాల్లో ఉన్నవారు ఇండ్లకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

News March 20, 2024

విశాఖకు చేరుకున్న ఐపీఎల్ జట్ల ప్రతినిధులు

image

విశాఖ వైఎస్సార్‌ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ఈ నెల 31న జరగనున్న ఐపీఎల్‌ మ్యాచ్‌కు జట్ల ప్రతినిధులు విశాఖకు చేరుకున్నారు. మంగళవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సౌరభ్‌ గంగూలీ, డేవిడ్‌ వార్నర్, షఫాలీ వర్మ విశాఖ విమానాశ్రయానికి వచ్చారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన రాడిసన్‌ బ్లూ హోటల్‌కు వెళ్లారు. సాయంత్రం ఏసీఏ ప్రతినిధులతో సమావేశమయ్యారు.

News March 20, 2024

డెంకాడ: మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

image

చదువులో ఫెయిల్ అవడంతో మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకొన్న ఘటన డెంకాడ మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై కృష్ణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం మండలానికి సమీపంలో ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ చదువుతున్న షేక్ లాల్ మాజక్  (21) కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. వాళ్ల నాన్నతో ఫోన్‌లో మాట్లాడి, అనంతరం జొన్నడ సమీపంలో ఉరి వేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

News March 19, 2024

భీమిలిలో చెడ్డీ గ్యాంగ్ ఫొటోలు విడుదల

image

భీమిలి పరిధిలో చెడ్డీ గ్యాంగ్ ముఠా తిరుగుతున్నారని పోలీసులు ఫొటోలు విడుదల చేశారు. ఈ మేరకు చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. రాత్రి పూట గ్రామాలలో తిరుగుతున్నారని, అనుమానం రాకుండా ప్రజల మధ్యలో ఉంటున్నారు.. కావున ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసు స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.