Vizianagaram

News March 18, 2024

సింహాచలం ఆలయంలో ఎన్నికల కోడ్ అమలు

image

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన సింహాచలం ఆలయంలో ఎన్నికల కోడ్ అమలు చేస్తున్నారు. ఇక నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు వీఐపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు ప్రోటోకాల్ దర్శనాలు, అతిథి మర్యాదలు ఉండవు. ఎంతటి వారైనా సాధారణ భక్తులు లాగే స్వామివారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. అలాగే సిఫార్సు లేఖలూ చెల్లవని స్పష్టం చేశారు.

News March 18, 2024

VZM: సచివాలయ ఉద్యోగి మృతి

image

విజయనగరం జిల్లా వేపాడ(M) కుంపల్లికి చెందిన వ్యక్తి కరెంట్ షాక్‌తో చనిపోయాడు. డెక్క చిరంజీవి(32) అనకాపల్లి జిల్లా దేవరాపల్లి(M) కొత్తపెంట సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిన్న ములకలాపల్లి పాలకేంద్రం వద్ద స్తంభానికి కట్టిన పోస్టర్‌ తొలగిస్తుండగా కరెంట్ షాక్‌ తగిలి మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. SI డి.నాగేంద్ర ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.

News March 18, 2024

విజయనగరం : కలెక్టరేట్‌లో ఎన్నికల కంట్రోల్ రూమ్

image

ఎన్నికల కంట్రోల్ రూమ్‌ నుంచి పంపవలసిన నివేదికలను ఎప్పటికప్పుడు వేగంగా పంపాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. ఆదివారం కంట్రోల్ రూమ్‌ను కలెక్టర్ తనిఖీ చేశారు. కంట్రోల్ రూమ్‌లో ఏర్పాటు చేసిన ఎలెక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా, సోషల్ మీడియా సెల్, 24/7 కాల్ సెంటర్, కంప్లైంట్లో మానిటరింగ్ సెల్, రిపోర్ట్ మెనేజ్మెంట్ సిస్టం విభాగాలు ఎలా పని చేస్తున్నాయని వివరాలు అడిగారు.

News March 17, 2024

గుర్ల: గుర్తు తెలియని మృతదేహం కలకలం

image

మండలంలోని జమ్ము గ్రామంలో రైలు పట్టాలపై గుర్తుతెలియని మృత దేహం లభ్యమయిందని రైల్వే హెచ్సీ చక్రధర్ ఆదివారం తెలిపారు. మృతుడి వయసు 50ఏళ్లు ఉంటుందన్నారు. జేబులో హౌరా నుంచి విజయవాడకు వెళ్తున్నట్లు టికెట్ ఉందన్నారు. బహుశా ట్రైన్ నుంచి జారి పడి 3రోజుల కిందట మరణించి ఉండవచ్చని భావిస్తున్నామన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చీపురుపల్లి పీహెచ్సీకి తరలించామని తెలియజేశారు.

News March 17, 2024

ఎన్నికలు పూర్తయ్యే వరకు స్పందన రద్దు: విజయనగరం కలెక్టర్

image

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున ప్రతి సోమవారం విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరగాల్సిన స్పందన కార్యక్రమం రద్దు చేస్తున్నామని కలెక్టర్ నాగలక్ష్మి శనివారం తెలిపారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు ఆమె స్పష్టం చేశారు. జిల్లా పరిధిలో ఉన్న ప్రజలు, అర్జీ దారులు గమనించాలని కోరారు.

News March 17, 2024

VZM: బాక్సింగ్‌లో బంగారు పథకం సాధించిన సచిన్

image

విశాఖపట్నంలో జరిగిన మూడవ రాష్ట్ర సబ్ జూనియర్ బాక్సింగ్ పోటీల్లో విజయనగరం క్రీడాకారుడు బి. సచిన్‌ బంగారు పతాకం సాధించాడు. మార్చి 18 నుంచి 25 వరకు ఉత్తర ప్రదేశ్‌లో జరగబోయే జాతీయస్థాయి పోటీలలో ఆంధ్రప్రదేశ్ తరుఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ మేరకు ఆదివారం అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డోల మన్మథకుమార్ ఆయనకు అభినందనలు తెలిపారు. జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలని ఆకాక్షించారు.

News March 17, 2024

బొబ్బిలిలో ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి

image

ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన బొబ్బిలిలో చోటు చేసుకుంది. బొబ్బిలి గొల్లవీధికి చెందిన పార్వతి ఆదివారం ఉదయం పూల్ బాగ్ వద్ద రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీ కొనటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలు కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 17, 2024

మన్యంలో ఎన్నికల కంట్రోల్ రూం ఏర్పాటు

image

సాధారణ ఎన్నికల దృష్ట్యా కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలోను, సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ కార్యాలయంలోను కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశామన్నారు. మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజలు సంబంధిత పిర్యాదులు, సమాచారం అందించవచ్చని ఆయన వివరించారు.

News March 17, 2024

విజయనగరం: అత్యాచారం కేసులో నిందితుడికి జైలు శిక్ష

image

అత్యాచారం కేసులో నిందితుడికి జిల్లా 5వ అదనపు జడ్జి మూడున్నరేళ్ల జైలు శిక్ష, రూ.5వేలు జరిమాన విధించినట్లు దిశ ఇన్‌ఛార్జ్ డీఎస్పీ డి.విశ్వనాథ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. భోగాపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళపై అదే గ్రామానికి చెందిన సీహెచ్ ఈశ్వరరావు 2022 ఏప్రిల్ 29న అత్యాచారానికి పాల్పడ్డాడని మహిళ ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన కోర్టు పై విధంగా శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

News March 17, 2024

విజయనగరం: ఏడు చోట్ల ప్రత్యర్థులు ఫిక్స్..!

image

విజయనగరం: అదితి గజపతిరాజు(TDP), కోలగట్ల వీరభద్రస్వామి (YCP)
నెల్లిమర్ల: లోకం మాధవి(జనసేన), బడ్డుకొండ అప్పలనాయుడు(YCP)
గజపతినగరం: కొండపల్లి శ్రీనివాస్(TDP), బొత్స అప్పలనరసయ్య(YCP)
బొబ్బిలి: బేబి నాయన(TDP), శంబంగి చిన అప్పలనాయుడు(YCP)
పార్వతీపురం: బోనెల విజయచంద్ర(TDP), అలజంగి జోగారావు(YCP)
సాలూరు: గుమ్మడి సంధ్యారాణి(TDP), పీడిక రాజన్నదొర(YCP)
కురుపాం: తోయక జగదీశ్వరి(TDP), పాముల పుష్ప శ్రీవాణి(YCP)