India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి విజయనగరం జిల్లాలో టమాటా ధర జనాలను ఠారెత్తిస్తోంది. ప్రస్తుత బహిరంగ మార్కెట్‌లో కిలో టమాటా రూ.80 వరకు పలుకుతోంది. వారం రోజుల వరకు రూ.40 ధర ఉండేది. స్థానికంగా టమాటా పంట లేకపోవడంతో ఇతర ప్రదేశాల నుంచి దిగుమతి చేసుకోవలసిన పరిస్థితి నెలకొంది. దీనికి తోడు రవాణా ఛార్జీల భారం పడుతుందని వ్యాపారులు చెబుతున్నారు. ధరల నియంత్రణ పై చర్య చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ఆషాఢ పౌర్ణమి పురస్కరించుకొని ఈనెల 20,21 తేదీల్లో సింహాచలంలో జరిగే సుప్రభాత సేవ, ఆరాధన, నిత్య కళ్యాణం, అష్టోత్తరం, సహస్రనామార్చన వంటి ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నారు. ఈ తేదీలలో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి దర్శనానికి తరలి రానున్న నేపథ్యంలో నీలాద్రి ద్వారం నుంచి మాత్రమే దర్శనాలకు అనుమతిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఉమ్మడి విజయనగరం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు పట్టణ, పల్లె ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. వసతిగృహాల నుంచి బాధితులు అధికంగా ఆసుపత్రుల బాటపడుతున్నారు. పాచిపెంట, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, సీతంపేట, పార్వతీపురం, మక్కువ, తదితర ప్రాంతాలలో జ్వర వ్యాప్తి ఎక్కువగా ఉంది. పార్వతీపురం జిల్లాలో 20 మంది చిన్నారులు మలేరియా, వైరల్ టైఫాయిడ్‌తో ఆసుపత్రిలో చేరారు.
విజయనగరం జిల్లాలోని సీడీపీవో విభాగంలో 23 ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల అయింది. ఆ ఉద్యోగాలు ఇప్పిస్తామని రాజ్ కుమార్ అనే వ్యక్తి మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థులను డబ్బులు అడుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఐసీడీఎస్ పీఓ బి.శాంత కుమారి తెలిపారు. అటువంటి వ్యక్తులను నమ్మవద్దని సూచించారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.
గుర్ల మండలం పున్నపురెడ్డిపేటకి చెందిన పున్నపురెడ్డి కనక నాయుడు అనే వ్యక్తి తేలు కాటుకు గురై మృతి చెందాడు. పొలంలో పని చేస్తుండగా తేలు కరిచిందని విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మూడు గంటల తరువాత చికిత్స పొందుతూ చనిపోయాడని గ్రామస్థులు తెలిపారు. ఇదిలా ఉంటే సంవత్సరం క్రితం అదే పొలంలో మృతుడి చిన్న కూతురు ఏదో విషపురుగు కరిచి చనిపోయింది. ఇప్పుడు మరొకరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఏయూ పరిధిలో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువును జులై 25వ తేదీ వరకు పొడిగించారు. స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జులై 23 నుంచి 25 వరకు జరుగుతాయి. కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్ ఆప్షన్స్ నమోదు జులై 26 నుంచి 29 వరకు ఉంటుంది. వెబ్ ఆప్షన్ మార్చుకోవడానికి జులై 30న అవకాశం ఇచ్చారు. ఆగష్టు 3న సీట్ల కేటాయింపు ఉంటుంది.
విశాఖ రేంజ్ డీఐజీగా గోపీనాథ్ జెట్టి బుధవారం బాధ్యతల స్వీకరించారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా గోపీనాథ్ జెట్టిని విశాఖ రేంజ్ డీఐజీగా బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన తొలిత సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామి వారి దర్శించుకుని అనంతరం లాంఛనంగా బాధ్యతలు స్వీకరించారు. 2008 బ్యాచ్‌కు చెందిన జెట్టి గతంలో చింతపల్లి ఏఎస్పీగా విధులు నిర్వహించారు.
మక్కువ మండలం కన్నంపేటకి చెందిన ఆర్మీ జవాన్ తేలు దినేష్ (34) ఈనెల 12న సెలవుల నిమిత్తం స్వగ్రామానికి వచ్చారు. మంగళవారం స్వల్ప అస్వస్థతకు గురి కావటంతో చికిత్స కోసం విజయనగరం తీసుకొని వెళ్లారు. చికిత్స పొందుతూ రాత్రి మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జవాన్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
విజయనగరం రైల్వే స్టేషన్‌లో ప్లాట్ ఫామ్ కింద పడి వ్యక్తి మృతి చెందాడు. పి.చంద్రపాత్రో అనే వ్యక్తి మూడో ప్లాట్ ఫామ్ వద్ద రైలు దిగుతుండగా కాలు జారి కింద పడ్డాడు. మృతుడు ఒడిశా రాష్ట్రానికి చెందిన మల్కన్‌గిరి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించామని అధికారులు తెలిపారు. మృతదేహాన్ని మహారాజా సర్వజన ఆసుపత్రికి తరలించారు.
ధన్ బాద్-అలెప్పి బొకారో ఎక్స్‌ప్రెస్‌కు మంగళవారం పెద్ద ప్రమాదం తప్పింది. ఏ2 సెకండ్ ఏసీ భోగికి స్ప్రింగ్ విరిగిపోయింది. రైలు విశాఖ స్టేషన్‌కు చేరుకునే సమయంలో జరగడంతో ఆవరణలో ఉన్న రోలింగ్ సిబ్బంది దానిని గుర్తించి సమాచారాన్ని అధికారులకు తెలియజేశారు. ప్రయాణికులను ఖాళీ చేయించి రైలు నుంచి బోగిని తొలగించారు. వేరొక బోగిని దానికి అమర్చారు. గంటన్నర పాటు రైలు స్టేషన్‌లో నిలిచిపోయింది.
Sorry, no posts matched your criteria.