India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఈ నెల 20 లోపు 1 నుంచి ఇంటర్ చదువుతున్న విద్యార్ధులందరికీ అపార్ ఐడీలు జనరేట్ చేయాలని కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. శనివారం కలెక్టర్ ఛాంబర్లో యాక్షన్ టేకాన్ రిపోర్ట్‌పై విద్యా శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఆధార్ సమస్యను పరిష్కరించుకొని వెంటనే అపార్ ఐ.డిలను జారీ చేయాలని సూచించారు. బడి బయట ఉన్న 6 సంవత్సరాల పైబడిన బాలల వివరాలను, బడి బయట ఉండడానికి గల కారణాలను తెలపాలన్నారు.

జిల్లాలో MSME, ఇతర పరిశ్రమల పర్యవేక్షణకు జిల్లా స్థాయి కమిటీని నియమించినట్లు కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. శనివారం కలెక్టర్ ఛాంబర్లో పరిశ్రమల శాఖపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 9 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన ఈ కమిటీకి డిప్యూటీ కలెక్టర్ జోసెఫ్‌ను ఇన్‌ఛార్జ్‌గా నియమించినట్లు తెలిపారు. పరిశ్రమల ప్రోత్సాహానికి అవసరమైన భూ సమస్యలను రెవెన్యూ అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు.

దత్తిరాజేరు జెడ్పీ హైస్కూల్లో చదివిన పూర్వ విద్యార్థి ఎం.కూర్మారావు ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో కలెక్టర్‌గా పదవి బాధ్యతలు చేపట్టారు. కూర్మారావు సొంత ఊరు అయిన పొరలికి వచ్చి, దత్తిరాజేరు స్కూల్‌ను శనివారం పరిశీలించారు. జిల్లా అధికారి మాణిక్యం నాయుడు, మండల ఎంఈఓ వెంకట్రావు, స్కూల్ హెచ్ఎం స్వర్ణ కలెక్టర్‌కు ఘనంగా స్వాగతించి అభినందనలు తెలిపారు.

మహిళపై స్కూల్ HM అత్యాచారయత్నం చేసినట్లు ఎస్.కోట పోలీసలు కేసు నమోదు చేసుకున్నారు. సీఐ వీ.ఎన్ మూర్తి వివరాల ప్రకారం.. గంట్యాడ మండలంలోని ఓ మహిళ తన కుమారుడి స్టడీ సర్టిఫికెట్లు సరిదిద్దాలని ఆ గ్రామ ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎమ్‌ను కోరారు. సరి చేయడం కోసం బొడ్డవర వెళ్లాలని చెప్పి ఆమెను బైక్ ఎక్కించుకున్నాడు. సమీప తోటల్లోకి తీసుకువెళ్లి అత్యాచారయత్నం చేయబోగా ఆమె గట్టిగా కేకలు వేయడంతో వదిలేశాడు.

ఇటీవల కాలంలో పలువురు వైసీసీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వాళ్లకు అండగా నిలిచేందుకు విజయనగరం మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జోగారావుకి బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని కార్యకర్తలకు వీళ్లు అండగా ఉంటారని చెప్పారు. లీగల్ సెల్‌తో అండగా ఉంటూ కేడర్‌కు భరోసా ఇవ్వాలని జగన్ సూచించారు.

వచ్చే నెల 14న జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి మీనా దేవి కోరారు. శుక్రవారం తన ఛాంబర్‌లో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు, ఇన్సూరెన్స్ కంపెనీ న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన కేసులన్నీ లోక్ అదాలతో పరిష్కరించు కోవాలన్నారు. దీనికి లోక్ అదాలత్‌ను వేదికగా చేసుకుని కక్షిదారులకు డబ్బు, సమయం వృథా కాకుండా చూడాలన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబును.. అక్కడి విమానాశ్రయంలో కలిసి ఆహ్వానం పలికారు. చెన్నైలో మాదిరిగా జిల్లాలో వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబుకు వినతిపత్రం అందజేసినట్లు ఎంపీ తెలిపారు.

రాజీకు వచ్చే అన్ని క్రిమినల్ కేసులను గుర్తించి వాటిని జాతీయ లోక్ అదాలత్ లో పరిష్కరించాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి టీవీ రాజేష్ సూచించారు. పోలీస్ అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. వచ్చే నెల 14న జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలన్నారు. రాజీయే రాజమార్గమని, ఈ విధానం ద్వారా కక్షిదారులకు డబ్బు, సమయం ఆదా అవుతుందని చెప్పారు.

విజయనగరం రైల్వే స్టేషన్ యార్డులో రూట్ నంబర్ 9లో సుమారు 30 -35 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు ఆర్పీఎఫ్ ఎస్ఐ బాలాజీ రావు తెలిపారు. పింక్ కలర్ రెడీమేడ్ ఫుల్ హ్యాండ్ షర్ట్, బిస్కెట్ కలర్ ఫ్యాంట్, కుడి మోచేతి పైన “SINVREN “అని పచ్చబొట్టు ఉన్నట్లు తెలిపారు. ఇతడి ఆచూకీ తెలిసినవారు స్థానిక స్టేషన్లో సంప్రదించాలన్నారు.

తగరపువలస గోస్తని నదిలో కారు బోల్తా పడిన ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందాడు. వంతెనపై అంధకారం నెలకొనడంతో గురువారం రాత్రి కారు అదుపుతప్పి నదిలో బోల్తా పడిన విషయం తెలిసిందే. దీంతో స్థానికులతో పాటు పోలీసులు సహాయకు చర్యలు చేపట్టారు. మృతుడు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ సిబ్బందికి చెందిన డ్రైవర్‌గా పోలీసులు గుర్తించారు. మరి కొంతమందిని ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ సమస్య లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.
Sorry, no posts matched your criteria.