India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో కోటియా గ్రూపు గ్రామమైన దిగువ గంజాయబద్రలో కొత్త విద్యుత్ మీటర్లు వెయ్యడానికి వెళ్లిన ఏపీ విద్యుత్ అధికారులను ఒడిశా పోలీసులు అడ్డుకున్నారు. ఆయా గ్రామాలు ప్రజలు విద్యుత్ మీటర్లు కోసం దరఖాస్తులు చెయ్యగా.. గత కొన్ని రోజులుగా విద్యుత్ మీటర్లు సిబ్బంది బిగిస్తున్నారు. గురువారం వెళ్లిన అధికారులను కోటియా పోలీసులు బంధించగా, ఉన్నత అధికారులు ఒడిశా అధికారులతో మాట్లాడి విడిపించారు.
రామభద్రపురం మండలం కొట్టక్కి బ్రిడ్జిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన సంగతి తెలిసిందే. అందులో జన్నివలసకి చెందిన జొన్నాడ పురుషోత్తం రాజమండ్రి సమీపంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సొంత పనులు నిమిత్తం రాజమండ్రి నుంచి బైక్‌పై జన్నివలస గురువారం సాయంత్రమే వచ్చాడు, పనిమీద సాలూరు వెళ్లి వస్తుండగా చనిపోయాడు. మృత్యువు వెంటాడిందంటూ కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.
2024-25 విద్యా సంవత్సరానికి జిల్లాలోని ప్రైవేట్, అన్-ఎయిడెడ్ పాఠశాలల్లో 1వ తరగతిలో ఉచిత సీట్లకు విద్యార్థులు మార్చి 31వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని జిల్లా డీఈవో తెలిపారు. సెంట్రల్ లేదా రాష్ట్ర సిలబస్‌లో విద్యనభ్యసించేందుకు దరఖాస్తులు చేసుకోవచ్చునన్నారు. ఆర్‌టిఈ చట్టంలోని సెక్షన్ 12(1) (సి) 2009 అనుసరించి 25 శాతం సీట్లను భర్తీ చేస్తామని తెలిపారు.
రామభద్రపురం మండలం కొట్టక్కి బస్ షెల్టర్ సమీపంలో గురువారం రాత్రి రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతులలో ఇద్దరు సాలూరు పట్టణానికి, ఒకరు జన్నివలస గ్రామానికి చెందిన వారు అని స్థానికులు తెలిపారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి చెందిన ఘటన మక్కువ మండలం కన్నంపేట గ్రామంలో చోటు చేసుకుంది. గురువారం మక్కువ ఎస్సై నరసింహ మూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. కన్నంపేట గ్రామానికి చెందిన చీపురు ఉమామహేశ్వరరావు(40) బుధవారం రాత్రి అదే గ్రామానికి చెందిన పెళ్లి మండపం పనులు చేస్తుండగా, విద్యుత్ షాక్‌తో మృతిచెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఉత్తరాంధ్రలో టీడీపీ సీనియర్ నాయకుల్లో కిమిడి కళా వెంకట్రావు ఒకరు. పొత్తులో భాగంగా ఆయన ఆశించిన ఎచ్చెర్ల సీటును BJPకి కేటాయించారు. విజయనగరం MP అభ్యర్థి కోసం చేసిన ఐవీఆర్‌ఎస్ సర్వేలో కూడా ఆయన పేరు లేదు. దీంతో ఆయన పోటీ చేసే స్థానంపై ఉత్కంఠ నెలకొంది. చీపురుపల్లిలో నుంచి బరిలో ఉంటారా..లేక ఉమ్మడి విజయనగరంలో TDP ప్రకటించిన 7 స్థానాల్లో ఒక అభ్యర్థిని మార్చి ఆ సీటు కళాకు కేటాయిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.
ఏకలవ్య పాఠశాలల్లో ప్రవేశాలకు ఈనెల 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారని, గడువులోగా ఆసక్తి గలవారు వివరాలు నమోదు చేసుకోవాలని కురుపాం ఏకలవ్య పాఠశాల ప్రిన్సిపల్ పట్నాయక్ తెలిపారు. ఈ ఏడాది నుంచి ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులను అనుమతించడం లేదని ఆన్‌లైన్‌లో తుది గడువులోగా అందజేయాలన్నారు. ఏప్రిల్ 13న పి.కోనవలస, జోగింపేట, గుమ్మలక్ష్మీపురం, సీతంపేట కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై కోడ్ ఉల్లంఘన కేసు నమోదయ్యింది. పట్టణంలోని నవిరికాలనీలో ఎటువంటి అనుమతులు లేకుండా ఈనెల 25న కరపత్రాలను పంపిణీ చేసినట్లు ఫిర్యాదు అందిందని ఎన్నికల అధికారిని కే.హేమలత తెలిపారు. ఈ ఫిర్యాదుపై విచారణ అనంతరం టీడీపీ అభ్యర్థి విజయచంద్రతోపాటు మరో పదిమందిపై పార్వతీపురం పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.
ఏనుగుల గుంపు జియ్యమ్మవలస మండలం గవరంపేట, చింతలబెలగాం గ్రామాల మధ్య ప్రధాన రహదారిపైకి రావడంతో వాహన చోదకులు భీతిల్లిపోతున్నారు. వారం రోజుల వ్యవధిలోనే ప్రధాన రహదారిపై రెండుసార్లు ఏనుగుల గుంపు రావడంతో ఏ క్షణాన ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారిపైకి ఏనుగులు వచ్చిన విషయం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది వచ్చి వాటిని సమీప పంట పొలాల్లోకి తరలించారు.
ప్రచారానికి అనుమతులు తప్పనిసరని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. బుధవారం రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి ఎన్నికల నిర్వహణకు ముందస్తు చేస్తున్న ఏర్పాట్లును, ఎన్నికల ప్రవర్తనా నియమావళి పటిష్టంగా అమలు తీరును సమీక్షించారు.
Sorry, no posts matched your criteria.