India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మానసిక స్థితి సరిగా లేక ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పార్వతీపురం మండలం చిన్నబొండపల్లిలో చోటుచేసుకుంది. పార్వతీపురం మండలం బొడ్డవలస పాఠశాలలలో ప్రధానోపాధ్యాయుడిగా చిట్టా పాపారావు (48) విధులు నిర్వహిస్తున్నారు. అతని మానసికస్థితి సరిగా లేక ఇంట్లో ఉరివేసుకొని సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రెండు నెలలుగా సముద్రంలో చేపలు గుడ్లు పెట్టే సమయం కావడంతో విజయనగరం జిల్లాలోని మత్స్యకారులు సముద్రంలో వేటను నిషేధించిన విషయం తెలిసిందే. గడువు ముగియడంతో ఈ నెల 16వ తేదీ నుంచి మళ్లీ సముద్రంలో వేట ప్రారంభించేందుకు భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో ఉన్న మత్స్యకారులు సిద్ధమవుతున్నారు. వలలు, బోట్ల మరమ్మతుల పనుల్లో వారంతా నిమగ్నమయ్యారు.
కొమరాడ మండలం పెద్ద కెర్జల వద్ద ఆటో బోల్తా పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం ఉదయం పెద్ద కెర్జల నుంచి కొమరాడ వెళ్తున్న ఆటో అదుపుతప్పి లోయలో పడింది. ప్రమాదంలో సుమారు 15 మంది గాయపడినట్లు తెలుస్తోంది. 108కి సమాచారం అందించగా ఘటనా స్థలానికి మూడు అంబులెన్స్‌లు చేరుకున్నాయి. క్షతగాత్రులను పార్వతీపురం ఆస్పత్రికి తరలించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జిల్లా వ్యాప్తంగా ఎస్పీ దీపికా పాటిల్ ఆదేశాల మేరకు గడిచిన 24 గంటల్లో పోలీసులు విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. చేపట్టిన దాడుల వివరాలను సోమవారం తెలిపారు. MV నిబంధనలు అతిక్రమించిన 249 మందిపై రూ.67,425 ఈ చలానాలు విధించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 8 మందిపై, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన మరో 22 మందిపై జిల్లావ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి.
చికిత్స పొందుతూ వివాహిత మృతి చెందిన సంఘటన పార్వతీపురంలోని పార్వతీ నగర్‌లో చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై దినకర్ తెలిపిన వివరాల ప్రకారం.. చింతాడ కుమారి (42) వ్యక్తిగత కారణాలవల్ల శుక్రవారం ఇంట్లో ఫినాయిల్ తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. గమనించిన తల్లి జిల్లా ఆసుపత్రికి తరలించింది. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేశామన్నారు.
ఓ వ్యక్తికి బైక్‌పై లిఫ్ట్ ఇచ్చి దోచుకొని.. దాడిచేసిన ఘటన ఆదివారం జరిగింది. ఎస్.కోట మం. వెంకటరమణ పేటకు చెందిన జవ్వాది శ్రీను(32) దేవరాపల్లిలోని అత్తారింటికి శనివారం రాత్రి బయలుదేరాడు. వావిలపాడు నుంచి దేవరాపల్లికి వెళ్తూ, దారిలో బైక్‌పై వస్తున్న వారిని లిఫ్ట్ అడిగాడు. వారు శారదానది వంతెనపై బైక్ ఆపి చాకు చూపిస్తూ పర్సు, సెల్‌ఫోన్ ఇవ్వాలని బెదిరించారు. శ్రీను సెల్‌ఫోన్ ఇవ్వకపోవడంతో అతనిపై దాడిచేశారు.
సాలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1980వ సంవత్సరం పదో తరగతి చదివిన విద్యార్థులు 44 ఏళ్ల తరువాత ఆదివారం ఆత్మీయ సమ్మేళన సమావేశంలో కలుసుకున్నారు. చిన్ననాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. చదువుకున్న సమయంలో చేసిన అల్లరిని గుర్తు చేసుకున్నారు. తమకు చదువు నేర్పిన గురువులను సన్మానించారు. రోజంతా ఉల్లాసంగా గడిపారు.
గన్నవరం మండలం కేసరపల్లి IT పార్క్ వద్ద చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తుండడంతో ట్రాఫిక్‌పై ఆంక్షలు చేపట్టినట్లు SP అద్నాన్ తెలిపారు. విశాఖ నుంచి చెన్నై వెళ్లే వాహనాలను కత్తిపూడి నుంచి జాతీయ రహదారి 216 మీదుగా ఒంగోలు వైపు మళ్లిస్తామన్నారు. చెన్నై నుంచి విశాఖ వచ్చే వాహనాలు ఒంగోలు, రేపల్లె మీదుగా వయా మచిలీపట్నం- లోసరి బ్రిడ్జి- నరసాపురం- అమలాపురం- కత్తిపూడి మీదుగా విశాఖ చేరుకుంటాయి.
ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోన్న కల్కి 2898 AD ట్రైలర్ రేపు విడుదలకానుంది. అభిమానుల కోసం విజయనగరం జిల్లాలోని పలు థియేటర్లలో రేపు 6PMకు ట్రైలర్ విడుదల చేస్తున్నారు. విజయనగరంలో ఎన్‌సీఎస్, ఎస్‌వీఎస్ రంజనీ థియోటర్‌లో స్క్రీనింగ్ ఉండగా.. చీపురుపల్లిలో వంశీ, ఎస్.కోటలో శ్రీ వెంకటేశ్వర, సాలూరులో శ్రీ రామ, పార్వతీపురంలో SVC TBR థియేటర్‌లలో ట్రైలర్ స్క్రీనింగ్ చేస్తారు.SHARE IT
బావిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మక్కువ మండలంలో చోటు చేసుకుంది. సీబిల్లికి చెందిన వడ్డి నాగేశ్వరరావు (53) ఈనెల7 నుంచి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించలేదు. శనివారం పాతకాముడువలస సమీపంలో బావిలో శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కొడుకు ఫిర్యాదుతో అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నర్సింహమూర్తి తెలిపారు.
Sorry, no posts matched your criteria.