India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత సుజయ కృష్ణ రంగారావు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జ్ ఎస్.వి.ఎస్.ఎన్. వర్మతో పాటు మంగళగిరిలో ఉన్న జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి పవన్‌తో భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్‌ను ఘనంగా సత్కరించి తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.
జియమ్మవలస మండలం ఇటిక పంచాయతీ ఇటిక గదబవలస గ్రామ శివారులోని తోటపల్లి కుడి కాలువ నుంచి, గుర్తు తెలియని మృత దేహం కొట్టుకొని వచ్చిందని పోలీసులు తెలిపారు. అతని వయసు 30 నుంచి 35 సంవత్సరాలు ఉంటుందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వాళ్ళు పోలీస్ స్టేషన్‌కి తెలియజేయాలని కోరారు.
విజయనగరం, బొబ్బిలి, గజపతినగరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు అదితి గజపతిరాజు, బేబీ నాయన, కొండపల్లి శ్రీనివాస్ శనివారం విజయవాడలో టీడీపీ నిర్వహించిన ఎన్నికల సన్నాహాక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. గెలుపే లక్ష్యంగా నియోజకవర్గాల్లో బీజేపీ, జనసేనతో కలిసి పనిచేయాలని ఆయన సూచించారు.
భారత్, అమెరికా దేశాల సైనిక సంబంధాలు బలోపేతమయ్యేలా బంగాళాఖాతంలో విశాఖపట్నం కేంద్రంగా ‘టైగర్ ట్రయంప్’ ప్రత్యేక సాగర విన్యాసాలు జరుగుతున్నాయని నేవీ అధికారులు తెలిపారు. రెండు వారాలపాటు జరగనున్న ఈ విన్యాసాల కోసం బాహుబలి నౌకగా పేరొందిన ‘యూఎస్ సోమర్సెట్’ విశాఖతీరానికి చేరుకుంది. ఇది ఉభయచర యుద్ధ నౌకగా ఖ్యాతిగాంచింది.
సింహాచలం సింహాద్రి అప్పన్నకు ఈనెల 25వ తేదీన పెళ్లిచూపులు జరగనున్నాయి. స్వామిని పెళ్లి కుమారుడిగా ముస్తాబు చేసి కొండ దిగువన గల పుష్కరిణి సత్రంలోని ఉద్యానవన మండపానికి తీసుకువస్తారు. అక్కడ మండపంలో అధిష్ఠింప చేస్తారు. పెళ్లి నిశ్చయం అయినందున స్వామిని ఊరేగింపుగా అడవివరంలో వేంచేసి ఉన్న పైడితల్లమ్మ ఆలయానికి ఊరేగింపుగా తీసుకువెళ్తారు. అనంతరం మళ్లీ ఇక్కడకు తీసుకువచ్చి డోలోత్సవం, వసంతోత్సవం నిర్వహిస్తారు.
ప్రభుత్వ నివాస గృహాన్ని రాజకీయ కార్యకలాపాలకు వినియోగించుకోవడం పై ఉపాధ్యాయుడు అడ్డాకుల సన్యాసి నాయుడును సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని ఇన్‌ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి జి.కేశవ నాయుడు శనివారం ధ్రువీకరించారు. కురుపాం ఎన్నికల అధికారి ఇచ్చిన నివేదిక మేరకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని ఆయన పేర్కొన్నారు.
ఎన్నికల కోడు ఉల్లంఘనలో భాగంగా ఎల్కోట మండలం ఖాసాపేట సచివాలయం పరిధిలో క్లస్టర్-6 వాలంటీర్ బొబ్బిలి శివను తొలగించినట్లు ఎల్ కోట ఎంపీడీవో కే రూపేష్ తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన మొబైల్‌లో రాజకీయ నాయకుల స్టేటస్లు పెడుతూ ప్రచారం చేస్తున్నాడని వచ్చిన ఫిర్యాదు పై ఇతనిపై చర్యలు తీసుకున్నట్లు ఎంపీడీవో తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ వేతనం తీసుకుంటున్న అందరికీ నిబంధన వర్తిస్తుంది అన్నారు.
విజయనగరం జిల్లాలో మొత్తం 129 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు. భౌతికశాస్త్రం పరీక్షలకు మొత్తం 25256 విద్యార్థులు హాజరయ్యారు. 826 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.ప్రేమ్ కుమార్ శనివారం తెలిపారు. మాస్ కాపీయింగ్ వంటి ఫిర్యాదులు అందలేదన్నారు. జిల్లా మొత్తం భౌతిక శాస్త్రం పరీక్ష సజావుగా జరిగిందన్నారు. మొత్తం హాజరు శాతం 96.83 నమోదు అయిందన్నారు.
రానున్న సాధారణ ఎన్నికల దృష్ట్యా ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ల వద్ద నిరంతర పటిష్ఠ నిఘా ఉండాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. శనివారం కురుపాం మండలం మంత్ర జోల సమీపంలోని మూలిగూడ సెంటర్ వద్ద ఏర్పాటుచేసిన చెక్‌పోస్ట్‌ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రస్తుతం ఎన్ని కేసులు, వాహనాలు సీజ్ చేసిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు శృంగవరపుకోట నియోజకవర్గం నుంచి 1953లో ప్రాతినిధ్యం వహించి చట్టసభలకు వెళ్లారు. 1953లో సీవీ సోమయాజులు అప్పటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పీఎస్పీ నుంచి టంగుటూరి ఏకగ్రీవంగా ఎన్నికై ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశారు.
Sorry, no posts matched your criteria.