India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గంట్యాడ సమీపంలోని గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో గంట్యాడకి చెందిన హరీశ్ అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
వ్యవసాయ శాఖ విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం ఆధ్వర్యంలో నగరంలోని కర్షకరత్న ఆగ్రో కెమికల్స్‌లో ఆదివారం విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, సూక్ష్మ పోషకాల నిల్వ పట్టికలను తనిఖీ చేశారు. మండల వ్యవసాయ అధికారి సమక్షంలో తనిఖీలు చేసి నివేదికలు అందించినట్టు వ్యవసాయ అధికారి తెలిపారు. రూ.3.94 లక్షల విలువ చేసే ఎరువులకు సంబంధించి నమూనాలు తనిఖీ కోసం పంపినట్లు తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాపాడాలని సీఐటీయూ నాయకుడు గొర్లి వెంకటరమణ అన్నారు. జులై 10న జిల్లాలోని అన్ని మండల కార్యాలయాల్లో ధర్నాలు చేయాలన్నారు. స్థానిక సుందరయ్య భవనంలో ధర్నాకు సంబంధించిన కరపత్రాన్ని ఆయన విడుదల చేశారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలు కార్మిక హక్కులను కనీసం పట్టించుకోవడంలేదన్నారు. హక్కులను కాపాడే వరకు నిరసన తెలుపుతామని హెచ్చరించారు.
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా ఏ.శ్యాంప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం ఉదయం కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు కలెక్టరేట్ ఉద్యోగులు స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ ఛాంబర్‌లో ఆయన బాధ్యతలను స్వీకరించారు. అందరి సహకారంతో జిల్లాను ప్రగతి పథంలో నడిపించడానికి తనవంతు కృషి చేస్తానని శ్యాంప్రసాద్ పేర్కొన్నారు.
ఉమ్మడి జిల్లాలోని సచివాలయాల్లో పనిచేస్తున్న డిజిటల్ అసిస్టెంట్స్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు శనివారం వినతిపత్రం సమర్పించారు. డిజిటల్ అసిస్టెంట్ల ఉన్నత విద్యార్హతలు, జాబ్ చార్ట్‌లో లోపాలు మంత్రికి తెలియజేశారు. వివిధ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్‌గా నియమించాలని కోరారు. డిజిటల్ అసిస్టెంట్స్‌ని స్కూల్స్‌లో కంప్యూటర్ టీచర్ లేదా జూనియర్ అసిస్టెంట్‌గా మార్చాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో వినియోగదారులకు జులై 8వ తేదీ సోమవారం నుంచి ఉచితంగా ఇసుక సరఫరా చేస్తున్నట్లు కలెక్టర్ డా.బి.ఆర్ అంబేడ్కర్ వెల్లడించారు. దానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. శ్రీకాకుళం, మన్యం జిల్లాల నుంచి ఇసుకను తీసుకువచ్చి కొత్తవలస, డెంకాడ మండలం పెదతాడివాడ, బొబ్బిలి గ్రోత్ సెంటర్ తదితర ప్రాంతాలలో నిల్వ ఉంచామన్నారు.
గజపతినగరం మం. మధుపాడ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్.ఐ మహేశ్ తెలిపారు. మధుపాడకి చెందిన వేల్పూరి చిట్టెమ్మ (68) కాల కృత్యాలు తీర్చుకోవడానికి రహదారి దాటుతుండగా విజయనగరం నుంచి సాలూరు వెళ్తున్న బైక్ ఢీ కొట్టినట్లు చెప్పారు. చిట్టెమ్మ మహారాజ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు ఎస్.ఐ తెలిపారు.
విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు దిల్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి జిల్లాకు విచ్చేశారు. విశాఖ విమానాశ్రయం నుంచి చెల్లూరు చేరుకోగా టీడీపీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి. అనంతరం విజయనగరం టీడీపీ కార్యాలయం అశోక్ బంగ్లాలో మీడియా సమావేశం నిర్వహించారు. తనకు ఇంతటి ఘనవిజయం అందించినందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
విజయనగరం పాత LIC భవనం దగ్గరలో ప్రభుత్వ బాలురు కళాశాల వసతి కేంద్రం-1లో 62 మంది విద్యార్థులు ఉన్నారు. దానికి నెలకు రూ.52 వేల అద్దె చెల్లిస్తున్నారు. కాగా.. ఆ భవనానికి సరైన కిటికీలు, దోమ తెరలు లేవని, తలుపులు పూర్తిగా పాడయ్యాయని విద్యార్థులు వాపోతున్నారు. డైట్ బిల్లులు రూ.6 లక్షల వరకు రావాలని అధికారులే చెబుతుండటం గమనార్హం. ఈ భవనానికి విద్యుత్త్ బిల్లులు కూడా చెల్లించలేదని సమాచారం.
బాడంగి మండలం గొల్లాది సమీపంలోని నక్కలబంద వద్ద రైలు ఢీకొని గొల్లాదికి చెందిన మన్నెల(48) శుక్రవారం మృతి చెందాడు. జీఆర్‌పీ హెచ్‌సీ ఈశ్వరరావు మాట్లాడుతూ.. వ్యవసాయ పనులకు వెళ్తూ పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు మృతి చెందాడని తెలిపారు. పోస్ట్‌మార్టమ్ నిమిత్తం బాడంగి సీహెచ్‌సీకీ మృతదేహాన్ని తరలించామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.