Vizianagaram

News May 31, 2024

చంద్రబాబుతో కిమిడి నాగార్జున భేటీ

image

రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రాబోతోందని టీడీపీ విజయనగరం పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబును నాగార్జున గురువారం రాత్రి కలిసి పలు అంశాలపై చర్చించారు. జిల్లాలో జరిగిన ఎన్నికల సరళిని వివరించారు. జిల్లాలో జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ స్థానం ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలన్నారు.

News May 31, 2024

విజయనగరం: రెండుసార్లు చైన్ లాగడంతో ఆగిన రైలు

image

గజపతినగరం మండలం పురిటిపెంట రైల్వే గేటు వద్ద గురువారం సాయంత్రం 7 గంటలకు టాటానగర్-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ చైన్‌ను రెండుసార్లు ఓ ప్రయాణికుడు లాగడంతో అరగంట సేపు నిలిచిపోయింది. మొదటి సారి రైల్వే గేటుకు ముందు నిలిచి.. కాసేపటికి తిరిగి కదిలింది. 50 మీటర్లు వెళ్లిన తర్వాత మళ్లీ రెండోసారి చైన్ లాగడంతో గేటు మధ్యలో ఆగిపోయింది. చైన్ ఎవరు లాగారో తెలుసుకుంటామని రైల్వే అధికారులు తెలిపారు.

News May 30, 2024

ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఠారెక్కిస్తున్న ఎండలు

image

పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో వేసవి ప్రభావంతో ఎండలు ఠారెక్కిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కాస్తున్న ఎండకు వృద్ధులు, చిన్నారులు, ప్రజలు ఉక్కపోతతో తీవ్ర అస్వస్థతకు గురౌతున్నారు. ఎండ ప్రభావంతో జన సంచారం లేక ప్రధాన పట్టణాలు నిర్మానుష్యంగా మారుతున్నాయి. వేసవి తాపానికి గురి కాకుండా మజ్జిగ, మంచి నీరు, కొబ్బరినీళ్లు విధిగా తీసుకోవాలని, పనులు వాయిదా వేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

News May 30, 2024

విజయనగరం జిల్లాలో మరో 7 జూనియర్ కాలేజీలు

image

ఈ విద్యా సంవత్సరం నుంచి విజయనగరం జిల్లాలో ఏడు చోట్ల కొత్తగా కాలేజీలు ప్రారంభిస్తున్నట్లు డిప్యూటీ డీఈవో కేవీ రమణ తెలిపారు. తెట్టంగి, జామి, కోనూరు, బొండపల్లి, రామభద్రపురం, పిరిడి, ఏవీ పురం ఉన్నత పాఠశాలల్లో కళాశాలలు ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూపులు ఉంటాయని వెల్లడించారు. విద్యార్థులు ప్రభుత్వ కాలేజీల్లో చేరాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

News May 29, 2024

బొండపల్లి: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

బొండపల్లి మండలం నెలివాడ జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఆగి ఉన్న ఆటోని ఒడిశా లారీ ఢీ కొట్టింది. ప్రమాదంలో పలువురు గాయపడగా చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కి తరలించారు. వారిలో విశాఖకు చెందిన డెంకాడ సూరిబాబు (45) బుధవారం మృతిచెందినట్లు బొండపల్లి ఎస్సై కె.లక్ష్మణరావు తెలిపారు. లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేశామన్నారు.

News May 29, 2024

రామతీర్థానికి హుండీల ద్వారా వచ్చిన ఆదాయం

image

రామతీర్థం దేవస్థానానికి హుండీల ద్వారా రూ.27.36 లక్షలు ఆదాయం వచ్చినట్లు దేవాదాయశాఖ అధికారిణి పీవీ.లక్ష్మి తెలిపారు. ఆమె పర్యవేక్షణలో గురువారం హుండీలు లెక్కించారు. మార్చి 11 నుంచి మే నెల 28 వరకు గల ఆదాయాన్ని లెక్కించినట్లు ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వాహణ అధికారి వై.శ్రీనివాసరావు వెల్లడించారు.

News May 29, 2024

విజయనగరంలో ఎవరికి ఎక్కువ సీట్లు.. మీ కామెంట్?

image

ఇంకో ఐదు రోజుల్లో అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. ఈ తరుణంలో విజయావకాశాలపై ఎరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిది స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని ఇటీవల బొత్స సత్యన్నారాయణ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 175 స్థానాల్లో గెలుస్తామని నిన్న తిరుపతిలో కోలగట్ల అన్నారు. మరి విజయనగరంలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని మీరు భావిస్తున్నారో కామెంట్ చెయ్యండి.

News May 29, 2024

సింహాచలంలో నేత్ర పర్వంగా అప్పన్న నిత్య కల్యాణం

image

సింహాచలం వరాహలక్ష్మీ నృసింహ స్వామి నిత్య కల్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండ పంలో అధిష్టింపజేశారు. పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు.

News May 29, 2024

VZM:రూ.91,795 ఈ-చలనాలు విధింపు

image

జిల్లా వ్యాప్తంగా ఎస్పీ ఎం.దీపిక పాటిల్ ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు, సిబ్బంది గడచిన 24 గంటల్లో విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. మోటార్ వెహికల్ నిబంధనలు అతిక్రమించిన 287 మందికి రూ.91,795 ఈ-చలానాలను విధించారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి 11 కేసులు నమోదు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై నమోదు చేసినట్లు జిల్లా పోలీస్ కార్యాలయం తెలిపింది.

News May 29, 2024

VZM: ఎమ్మెల్సీ రఘురాజు అనర్హతపై ఈనెల 31న విచారణ

image

ఎస్.కోట నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు అనర్హతపై ఈనెల 31న విచారణ జరగనుంది. పార్టీ ఫిరాయించిన రఘురాజు వ్యక్తిగత విచారణకు హాజరుకావాలని మండలి ఛైర్మన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. విచారణ అనంతరం అనర్హతపై ఛైర్మన్ మోషేన్ రాజు నిర్ణయం తీసుకోనున్నారు. కాగా ఎన్నికల ముందు అతని భార్య టీడీపీలో చేరగా ఆయన మాత్రం వైసీపీలో ఉంటూ టీడీపీకి మద్దతు ఇచ్చినట్లు విమర్శలున్నాయి.

error: Content is protected !!