India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర ఉద్యానవన కళాశాలలో రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికలు కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట భద్రత కల్పించినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సోమవారం కౌంటింగ్ కేంద్రం వద్ద విధులకు హాజరవుతున్న పోలీసులకు సమావేశం నిర్వహించి విధివిధానాలు తెలియజేశారు. కౌంటింగ్ హాజరైన వారికి ఐడీ కార్డు లేనిదే లోనికి అనుమతించరాదన్నారు. 400 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన సాలూరులో చోటు చేసుకుంది. పట్టణ సీఐ సీహెచ్ వాసునాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. గడివలసకి చెందిన చోడిపల్లి ఉష(19) పట్టణంలో ఓ హోటల్‌లో పని చేస్తుంది. ఆదివారం సాయంత్రం సాలూరులో అద్దెకు ఉన్న ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని వచ్చిన ఫిర్యాదుతో వెళ్లి పరిశీలించామన్నారు. తండ్రి ఫిర్యాదుతో అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.
ఉమ్మడి విజయనగరంలో తొమ్మిది స్థానాల్లో టీడీపీ-4, వైసీపీ-4, జనసేన ఒక స్థానంలో విజయం సాధిస్తాయని RTV అంచనా వేసింది.
➢ కురుపాం: పుష్పశ్రీవాణి
➢ పార్వతీపురం: అలజంగి జోగారావు
➢ సాలూరు: పీడిక రాజన్నదొర
➢ బొబ్బిలి: బేబినాయన
➢ గజపతినగరం: కొండపల్లి శ్రీనివాస్
➢ చీపురుపల్లి: బొత్స సత్యనారాయణ
➢ నెల్లిమర్ల: లోకం మాధవి
➢ ఎస్.కోట: కోళ్ల లలితకుమారి
➢ విజయనగరం: అతిది గజపతిరాజు గెలుస్తారని తెలిపింది.
విజయనగరం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై వైసీపీ అనర్హత వేటు వేసింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీలో ఉంటూ టీడీపీ అభ్యర్థులకు సహకరించారని ఆరోపణలతో వైసీపీ విప్ పాలవలస విక్రాంత్ శాసనమండలిలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు మండలి చైర్మన్ మోషేన్ రాజు చర్యలు తీసుకున్నారు. వివరణ ఇవ్వాలని 3సార్లు పిలిచినా.. డుమ్మా కొట్టడంతో.. సస్పెన్షన్ వేటు వేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది.
నగరంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి విజయనగరం పుత్యుల వీధిలో ఉన్న ఉమా రామలింగేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎమ్మల్యేగా తను చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
వంగర మండలం పట్టువర్ధనం గ్రామ సమీపంలో పిడుగు పాటుకు ఎనిమిది గొర్రెలు మృతి చెందాయి. చిన్న గంగులు, చిన్ని అయ్యప్పకు చెందిన గొర్రెల మందతో పొలంలో కాపు కాస్తున్న సమయంలో పెద్ద ఎత్తున ఉరుములు మెరుపులతో కూడిన పిడుగు పడడంతో ఈ దుర్ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఊరిలోకి పరుగులు తీసి తమ ప్రాణాలు కాపాడుకున్నామన్నారు.
పాడేరు ఘాట్ రోడ్డులోకి సోమవారం ఉదయం నుంచి భారీ వాహనాల రాకపోకలను నిషేధించినట్టు సీఐ నవీన్ కుమార్ తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మైదాన ప్రాంతం నుంచి పాడేరు, జీ.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు, హుకుంపేట తదితర మండలాలకు సిమెంటు, తదితర సామగ్రిని తరలించే భారీ వాహనాలను ముందస్తుగానే ఘాట్ మార్గంలోకి ప్రవేశించకుండా అవసరమైన చర్యలు చేపట్టామని సీఐ వెల్లడించారు.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు కేవలం ఒక్క రోజు మాత్రమే ఉంది. జూన్ 4న ఫలితాలు వెడుననున్న నేపథ్యంలో విజయనగరం జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని కలెక్టర్ నాగలక్ష్మీ తెలిపారు. సోమవారం డ్రైడేగా ప్రకటించామని.. మద్యం తాగినా, విక్రయించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాలకొండ, పార్వతీపురం, కురుపాం, సాలూరు నియోజకవర్గాల పరిధిలో 53 మద్యం దుకాణాలు, 8 బార్లు మూసివేస్తున్నట్లు తెలిపారు.
ఓట్ల లెక్కింపు జరిగే జూన్ 4న జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నాగలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంతంగా పూర్తి చేసేందుకు, శాంతిభద్రతలను పరిరక్షించేందుకు ఈ సెక్షన్‌ను విధిస్తున్నట్లు తెలిపారు. ఆ రోజు ఐదుగురు కంటే ఎక్కువమంది గుమిగూడకూడదని, ఎవరూ ఎటువంటి ఆయుధాలను ధరించకూడదని స్పష్టం చేశారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. అచ్యుతాపురం మండలం తంతడి బీచ్‌లో ముగ్గురు మహిళలు గల్లంతయ్యారు. వారిలో శెట్టిపాలెంకి చెందిన నూకరత్నం, తీడ గ్రామానికి చెందిన కనకదుర్గ(27) మృతిచెందగా.. శిరీష అనే అమ్మాయిని స్థానికులు కాపాడారు. కాగా మృతి చెందిన వారిద్దరూ సొంత అక్కాచెల్లెళ్లుగా గుర్తించారు. శిరీష పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్‌కి తరలించారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.