India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లా సమీక్షా సమావేశం శనివారం జరుగుతుందని కలెక్టర్ అంబేద్కర్ ఒక తెలిపారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొని జిల్లా అభివృద్ధిపై చర్చిస్తారన్నారు.

విశాఖ డెయిరీపై విచారణకు ప్రత్యేక హౌస్ కమిటీని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నియమించారు. కమిటీ ఛైర్మన్‌గా జ్యోతుల నెహ్రూ, సభ్యులుగా బొండా ఉమామహేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, గౌతు శిరీష, ఆర్‌విఎస్ కేకే.రంగారావు, దాట్ల సుబ్బరాజులను నియమించారు. సమగ్ర విచారణ జరిపి రెండు నెలల లోపు నివేదిక సమర్పించాలని స్పీకర్ ఆదేశించారు.

విజయనగరం జిల్లా వ్యాప్తంగా వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో వరి నూర్పులు పూర్తి కాగా పండించిన పంటను ధాన్యం కోనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో 3.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కోనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా.. ధాన్యం సేకరణకు రైతు భరోసా కేంద్రాలను 250 క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. మరి మీ ప్రాంతంలో ధాన్యం కొనుగోలు సేకరణ ఎలా ఉందో కామెంట్ చేయండి.

ఎస్.కోట మండలంలో 2 వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మహిళలు మృతిచెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఎస్.కోటకు చెందిన విశాలక్ష్మి (86) బుధవారం వంట చేస్తుండగా చీరకు నిప్పు అంటుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమెను విశాఖ తరలించగా అక్కడ చికిత్సపొందుతూ గురువారం మృతిచెందారు. అదేవిధంగా వెంకటరమణ పేట గ్రామానికి చెందిన సన్నమ్మ మెట్ల నుంచి జారిపడగా మెరుగైన చికిత్స కోసం KGHకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందారు.

గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు ఎటువంటి సమాచారం ఉన్నా 1972 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని డీఐజీ గోపీనాథ్ జెట్టీ విజ్ఞప్తి చేశారు. చీపురుపల్లి డీఎస్పీ కార్యాలయాన్ని గురువారం సందర్శించారు. ఇప్పటివరకు గంజాయి రవాణాపై 289 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణాకు డైనమిక్ చెక్ పోస్టులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 29 స్పెషల్ టీములను గంజాయి రవాణా అరికట్టేందుకు నియమించాన్నారు.

గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు ఎటువంటి సమాచారం ఉన్న 1972 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయాలని డీఐజీ గోపీనాథ్ జెట్టీ విజ్ఞప్తి చేశారు. చీపురుపల్లి డీఎస్పీ కార్యాలయాన్ని గురువారం సందర్శించారు. ఇప్పటివరకు గంజాయి రవాణాపై 289 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణాకు డైనమిక్ చెక్ పోస్టులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 29 స్పెషల్ టీములను గంజాయి రవాణా అరికట్టేందుకు నియమించాన్నారు.

దత్తత తీసుకున్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని రాష్ట్ర మహిళా,శిశు సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. గురువారం ఉడా చిల్డ్రన్ థియేటర్‌లో ఫోస్టర్ అడాప్షన్ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి చేతులు మీదుగా పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పిల్లలు కావలసిన వారు చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలన్నారు. చిన్న పిల్లలను అమ్మినా,కార్మికులుగా మార్చినా కఠిన చర్యలు తప్పవని అన్నారు.

ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఎంపీ అప్పలనాయుడు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని పలు రోడ్లు అభివృద్ధి చెయ్యాలని కోరారు. నెల్లిమర్ల నుంచి రామతీర్థం మీదుగా రణస్థలం వరుకు రహదారిని అభివృద్ధి చేయాలని, విజయనగరం-కొత్తూరు NH-16ను 4 లైన్ల రహదారిగా అభివృద్ధి చేయాలని, పాలకొండ, రామభద్రపురం, రహదారులను 4లైన్ల రహదారిగా మార్చాలని వినతిపత్రం ఇచ్చారు.

విజయనగరం పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో వార్షిక జిల్లా పోలీసు స్పోర్ట్స్ గేమ్స్ మీట్ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జెట్టి ముఖ్య అతిథిగా హాజరై, క్రీడా పోటీలను ప్రారంభించారు. పోలీసు ఉద్యోగులు అన్ని రంగాల్లోను ఇతరులకు రోల్ మోడల్‌గా ఉండాలన్నారు. పోలీస్ సిబ్బంది శారీరక ధారుడ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు.

విద్యా వ్యవస్థ బలోపేతానికే శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్న విషయం తెలిసిందే. గజపతినగరం మండలం మరుపల్లి పరిధిలో గల పాలిటెక్నికల్ కళాశాలలో శిక్షణ ఇస్తున్న శ్రీను అనే ఉపాధ్యాయుడు గురువారం గుండెపోటుతో మరణించాడు. ఈ ఉపాధ్యాయుడు శ్రీకాకుళం వాసిగా స్థానిక ఎంఈవో సాయి చక్రధర్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.