India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లా వ్యాప్తంగా ఎస్పీ ఎం దీపిక పాటిల్ ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు, సిబ్బంది గడచిన 24 గంటల్లో విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. మోటార్ వెహికల్ నిబంధనలు అతిక్రమించిన 290 మందికి రూ.75,980 ఈ-చలానాలను విధించారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి 23 కేసులు నమోదు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై నమోదు చేసినట్లు జిల్లా పోలీస్ కార్యాలయం తెలిపింది.
బొండపల్లి మండలంలోని అంబటివలస-గొట్లాం గ్రామాల మధ్య జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాను ఢీకొని విజయనగరం మండలం గుంకలాంకి చెందిన తాడ్డి తాతబాబు (35) మృతి చెందినట్లు బొండపల్లి ఎస్.ఐ కె.లక్ష్మణరావు తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న తాతబాబు విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా ప్రమాదానికి గురైనట్లు చెప్పారు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేశామన్నారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో కుక్కల దాడిలో మరో వ్యక్తి మృతి చెందాడు. <<13322735>>జియ్యమ్మవలస<<>> మండలం బిత్రపాడుకు చెందిన నీరస శంకర్రావు (40) బహిర్భూమికి వెళ్లాడు. ఆ సమయంలో కుక్కలు దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే చినమేరంగి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందు మృతి చెందాడు. కాగా కొద్దిరోజుల క్రితమే వెంకటరాజపురానికి చెందిన ఓ వృద్ధురాలు కుక్కలదాడిలో మృతి చెందింది.
ఉమ్మడి జిల్లాలో 9,890 మంది పాలీసెట్ పరీక్ష రాయగా..నేటి నుంచి కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. కౌన్సిలింగ్‌కు తీసుకెళ్లాల్సిన సర్టిఫికెట్ల వివరాలు.
➣ ప్రాసెసింగ్ ఫీజు రశీదు
➣ పాలీసెట్ హాల్ టికెట్, ర్యాంకు కార్డు
➣ పది, తత్సమాన మార్కుల జాబితా
➣ 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్స్
➣ EWS కోటా అభ్యర్థులు సంబంధిత EWS సర్టిఫికేట్
➣ 1-1-2021 తర్వాత నాటి కుల,ఆదాయ సర్టిఫికేట్
➣ టీసీ
➣➣Share it
విజయనగరం పైడితల్లి అమ్మవారి అంతరాలయ దర్శనం టికెట్‌ను ఇటీవల రూ.25 నుంచి రూ.50కు పెంచారు. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ అనువంశిక ధర్మకర్తకు తెలియకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారని, ప్రైవేటు వ్యక్తులు గర్భాలయం పూజలు చేస్తున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలకు ఆలయ అధికారులు కొట్టిపారేశారు. అలా ఏం జరగడం లేదని తేల్చి చెప్పారు.
జూన్ 4న జరగనున్న ఓట్లు లెక్కింపు ప్రక్రియ కోసం తీసుకోవాల్సిన చర్యలు గూర్చి కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు జిల్లాలోని ఎన్డీఏ కూటమి అభ్యర్థులతో కలిసి ఆదివారం సాయంత్రం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమర్థులైన కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకొని ఓట్లు లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించాలని అన్నారు. ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
పూసపాటి రేగ మండలంలో శనివారం ఓ వ్యక్తి విద్యుత్ షాక్‌తో మృతిచెందినట్లు ఎస్సై సన్యాసినాయుడు తెలిపారు. మృతుడు అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలం వడ్డాదికి చెందిన దారపు రెడ్డి అప్పారావు (48)గా గుర్తించారు. ఇతడు మండలంలోని ఆంజనేయస్వామి ఆలయంలో పనులు చేస్తుండంగా వైర్లు తగిలి విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. భోగాపురం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు.
పెదముషిడివాడలో ఉంటున్న కోట్ల జగదీశ్ (23) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయనగరం జిల్లా మలిచర్లకి చెందిన జగదీశ్ ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. శనివారం ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ బాలసూర్యరావు తెలిపారు. మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. అతని స్నేహితులు చెప్పిన వివరాల ప్రకారం లవ్ ఫెయిల్యూర్‌తోనే ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చు అని తెలిపారు.
విజయనగరం ఎస్పీ ఎం.దీపిక శనివారం లెండి ఇంజనీరింగ్ కళాశాలలో సార్వత్రిక ఎన్నికల తదనంతరం భద్రపరచిన ఈవీఎంల స్ట్రాంగ్ రూం వద్ద ఏర్పాటు చేసిన మూడంచెల భద్రత, గార్డ్స్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారులు, సిబ్బందికి భద్రతాపరమైన సూచనలు చేశారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగే జేఎన్టీయూ, లెండి ఇంజనీరింగ్ కళాశాలలో చేపట్టాల్సిన ఏర్పాట్లు, మౌలిక వసతుల కల్పన, భద్రత ఏర్పాట్లను ఎస్పీ దీపిక ఎం.పాటిల్ శనివారం పరిశీలించారు. ఎటువంటి ఆటంకం తలెత్తకుండా ఉండాలని సిబ్బందికి సూచించారు. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద ఏర్పాటు చేసిన మూడంచెల భద్రత, గార్డ్స్‌ను ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు.
Sorry, no posts matched your criteria.