Vizianagaram

News May 31, 2024

VZM: ఒక్కసారే ఛాన్స్.. అయినా ఆమెదే ఎక్కువ మెజారిటీ

image

విజయనగరం నియోజకవర్గంలో బీసీ సామాజిక ర్గం ఎక్కువ ఉన్నప్పటికీ ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులు ఓసీ సామాజిక వర్గానికి చెందిన వారే బరిలో నిలుస్తున్నారు. 2014లో బీసీ వర్గానికి చెందిన మీసాల గీతకు టీడీపీ అవకాశం ఇవ్వగా.. ఆమె 15,404 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2004లో 1,126 ఓట్లతో కోలగట్ల, 2009లో 3,282 ఓట్లతో అశోక్, 2019లో 6,400 ఓట్లతో కోలగట్ల గెలిచారు. ప్రస్తుతం మీసాల గీత స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు.

News May 31, 2024

విజయనగరం ఆసుపత్రిలో చేరిన MLC 

image

జిల్లాలోని ఎస్.కోట నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ఉన్నట్టుండి విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీలో ఉంటూనే టీడీపీకి మద్దతు ఇచ్చారనే ఆరోపణలతో మండలి ఛైర్మన్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈరోజు అనర్హత పిటిషన్ విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. గ్లాండ్ బ్లేడర్ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరానంటూ రఘురాజు సంకేతాలు పంపారు.

News May 31, 2024

విశాఖలో యాక్సిడెంట్.. పాల్తేరు వ్యక్తికి గాయాలు

image

విశాఖ <<13346298 >>సాగర్ నగర్<<>> కారు ప్రమాద ఘటనలో అనంతపురం జిల్లాకు చెందిన ఎర్రగుంట్ల క్రాంతికుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌కు భయపడ్డ నిందితుడు మద్యం మత్తులో రాంగ్‌రూట్‌లో వచ్చి బైక్‌ను ఢీకొట్టినట్లు గుర్తించారు. ఈ ప్రమాదంలో విజయనగరం జిల్లా బాడంగి మండలం పాల్తేరుకు చెందిన డెలవరీ బాయ్ ఎస్.గణపతి తీవ్రంగా గాయపడ్డాడు. అపస్మారక స్థితికి చేరుకున్న అతనిని KGHకి తరలించి చికిత్స అందిస్తున్నారు.

News May 31, 2024

VZM: చెక్‌బౌన్స్ కేసులో టీచర్‌కి జైలు శిక్ష

image

చెక్‌బౌన్స్ కేసులో టీచర్ జాగరపు వెంకట అప్పారావుకు 6 నెలల జైలుశిక్ష విధిస్తూ S.KOTA జూనియర్ సివిల్ జడ్జి వాణి గురువారం తీర్పు చెప్పారు. ధర్మవరానికి చెందిన శ్రీనివాసరావు నుంచి కుమరాంకి చెందిన వెంకట అప్పారావు రూ.2 లక్షలు అప్పు తీసుకొని రూ.1.50 లక్షలకు చెక్కు ఇచ్చారు. చెక్కు చెల్లకపోవడంతో కోర్టును ఆశ్రయించగా శిక్ష ఖరారైంది. నెల రోజుల్లో చెల్లించకపొతే మరో 6 నెలల శిక్ష ఉంటుందని తీర్పు వెల్లడించారు.

News May 31, 2024

చంద్రబాబుతో కిమిడి నాగార్జున భేటీ

image

రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రాబోతోందని టీడీపీ విజయనగరం పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబును నాగార్జున గురువారం రాత్రి కలిసి పలు అంశాలపై చర్చించారు. జిల్లాలో జరిగిన ఎన్నికల సరళిని వివరించారు. జిల్లాలో జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ స్థానం ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలన్నారు.

News May 31, 2024

విజయనగరం: రెండుసార్లు చైన్ లాగడంతో ఆగిన రైలు

image

గజపతినగరం మండలం పురిటిపెంట రైల్వే గేటు వద్ద గురువారం సాయంత్రం 7 గంటలకు టాటానగర్-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ చైన్‌ను రెండుసార్లు ఓ ప్రయాణికుడు లాగడంతో అరగంట సేపు నిలిచిపోయింది. మొదటి సారి రైల్వే గేటుకు ముందు నిలిచి.. కాసేపటికి తిరిగి కదిలింది. 50 మీటర్లు వెళ్లిన తర్వాత మళ్లీ రెండోసారి చైన్ లాగడంతో గేటు మధ్యలో ఆగిపోయింది. చైన్ ఎవరు లాగారో తెలుసుకుంటామని రైల్వే అధికారులు తెలిపారు.

News May 30, 2024

ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఠారెక్కిస్తున్న ఎండలు

image

పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో వేసవి ప్రభావంతో ఎండలు ఠారెక్కిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కాస్తున్న ఎండకు వృద్ధులు, చిన్నారులు, ప్రజలు ఉక్కపోతతో తీవ్ర అస్వస్థతకు గురౌతున్నారు. ఎండ ప్రభావంతో జన సంచారం లేక ప్రధాన పట్టణాలు నిర్మానుష్యంగా మారుతున్నాయి. వేసవి తాపానికి గురి కాకుండా మజ్జిగ, మంచి నీరు, కొబ్బరినీళ్లు విధిగా తీసుకోవాలని, పనులు వాయిదా వేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

News May 30, 2024

విజయనగరం జిల్లాలో మరో 7 జూనియర్ కాలేజీలు

image

ఈ విద్యా సంవత్సరం నుంచి విజయనగరం జిల్లాలో ఏడు చోట్ల కొత్తగా కాలేజీలు ప్రారంభిస్తున్నట్లు డిప్యూటీ డీఈవో కేవీ రమణ తెలిపారు. తెట్టంగి, జామి, కోనూరు, బొండపల్లి, రామభద్రపురం, పిరిడి, ఏవీ పురం ఉన్నత పాఠశాలల్లో కళాశాలలు ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూపులు ఉంటాయని వెల్లడించారు. విద్యార్థులు ప్రభుత్వ కాలేజీల్లో చేరాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

News May 29, 2024

బొండపల్లి: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

బొండపల్లి మండలం నెలివాడ జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఆగి ఉన్న ఆటోని ఒడిశా లారీ ఢీ కొట్టింది. ప్రమాదంలో పలువురు గాయపడగా చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కి తరలించారు. వారిలో విశాఖకు చెందిన డెంకాడ సూరిబాబు (45) బుధవారం మృతిచెందినట్లు బొండపల్లి ఎస్సై కె.లక్ష్మణరావు తెలిపారు. లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేశామన్నారు.

News May 29, 2024

రామతీర్థానికి హుండీల ద్వారా వచ్చిన ఆదాయం

image

రామతీర్థం దేవస్థానానికి హుండీల ద్వారా రూ.27.36 లక్షలు ఆదాయం వచ్చినట్లు దేవాదాయశాఖ అధికారిణి పీవీ.లక్ష్మి తెలిపారు. ఆమె పర్యవేక్షణలో గురువారం హుండీలు లెక్కించారు. మార్చి 11 నుంచి మే నెల 28 వరకు గల ఆదాయాన్ని లెక్కించినట్లు ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వాహణ అధికారి వై.శ్రీనివాసరావు వెల్లడించారు.