India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయనగరం జిల్లా వ్యాప్తంగా పోలీసులు డ్రంకన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్‌లపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టారని SP దీపిక తెలిపారు. డ్రంకన్ డ్రైవ్ చేస్తున్న 38 మందిపై, ఓపెన్ డ్రింకింగ్ చేసిన మరో 74మందిపై కేసులునమోదుచేశారని వివరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురికావొద్దన్నారు.
విజయనగరం జిల్లా గజపతినగరం మండలం గంగచోళ్ళపెంటకు చెందిన తామాడ అఖిల్ (9) గురువారం రోడ్డుప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. కాగా కేజీహెచ్‌లో చికిత్సపొందుతూ శుక్రవారం మృతిచెందినట్లు మండల SI మహేశ్ కుమార్ తెలిపారు.
ఓట్ల లెక్కింపు కోసం పకడ్బంధీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఆదేశించారు. లెక్కింపు ప్రక్రియ నిర్వహణ కోసం చేయాల్సిన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో శుక్రవారం సమీక్షించారు. ఆయా శాఖల వారీగా చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. మూడు రోజుల ముందే ఏర్పాట్లు పూర్తికావాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో జేసీ కె.కార్తీక్ పాల్గొన్నారు.
పార్వతీపురంలో వివిధ కేసుల్లో పట్టుబడిన నాటుసారా, మద్యం సీసాలను శుక్రవారం పోలీసులు ధ్వంసం చేశారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఏఎస్పీ సునీల్ షరైన్, సీఐ కృష్ణారావు ఆధ్వర్యంలో పార్వతీపురం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 16 ఎక్సైజ్ కేసుల్లో పట్టుబడిన 576 మద్యం బాటిల్స్‌తో పాటు, సుమారు 130 లీటర్ల నాటు సారా ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసులు పాల్గొన్నారు.
బొబ్బిలి మండలంలోని కమ్మవలస గ్రామానికి చెందిన కవిటి నాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఫిబ్రవరి 20న తన భార్యను ఇనుప రాడ్డుతో కొట్టి చంపిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. గురువారం రాత్రి పొలంలో చెట్టుకు ఉరి వేసుకుని అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడి తమ్ముడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
విశాఖ రూరల్ తహశీల్దార్ రమణయ్య హత్య కేసులో నిందితుడికి విశాఖ జిల్లా కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. మూడు నెలల తర్వాత నిందితుడికి ఊరట లభించింది. కోర్టు షరతుల ప్రకారం బెయిల్ మంజూరు చేసింది. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడు ప్రణాళిక ప్రకారం హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
కంబోడియా సైబర్ నేరగాళ్ల నుంచి ఎట్టకేలకు 60 మందికి విముక్తి లభించింది. సైబర్ నేరగాళ్ల నుంచి తప్పించుకున్న విశాఖ వాసి ఒకరు ఇచ్చిన సమాచారంతో విశాఖ నగర కమిషనర్ స్పందించారు. విశాఖకు చెందిన 150 మంది, దేశవ్యాప్తంగా 5,000 మంది కంబోడియా మోసగాళ్ల చెరలో ఉన్నట్లు తెలుస్తోంది. విముక్తి లభించిన 60 మంది గురువారం భారత్‌కు బయలుదేరినట్లు విశాఖ పోలీసులకు సమాచారం అందింది. వారి కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.
పదోతరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 2024కు సంబంధించి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలను కార్యాలయ వెబ్సైట్ www.bse.ap.gov.inలో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. సంబంధిత ప్రధానోపాధ్యాయులు ఆయా వెబ్‌సైట్‌లో డౌన్లోడ్ చేసి సంబంధిత కాపీలను విద్యార్థులకు అందజేయవలసిందిగా విజయనగరం జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.ప్రేమ్‌కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఎన్నికల ప్రక్రియలో భాగంగా చేపట్టే ఓట్ల లెక్కింపు అత్యంత కీలకమని, ఈ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని విజయనగరం కలెక్టర్, ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఆదేశించారు. ఆర్ఓలు, ఏఆర్వోలు, డీటీలు, నోడల్ అధికారులకు ఓట్ల లెక్కింపు ప్రక్రియపై కలెక్టరేట్ ఆడిటోరియంలో తొలివిడత అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుందని చెప్పారు.
పట్టణంలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన నిందితుడిని 24 గంటల్లోనే అరెస్టు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ బి.వెంకటరావు తెలిపిన వివరాల మేరకు.. గాజులరేగకు చెందిన వెంకటేశ్ 21న ఆంజనేయస్వామి గుడివద్ద నిలబడ్డాడు. లంకాపట్నంకు చెందిన ఏసు లిఫ్ట్ ఇస్తానని నమ్మించి, చైన్ లాక్కోగా నిందితుడిని బుధవారం అరెస్టు చేశారు. అతని వద్ద స్కూటీని, బంగారం గొలుసు రికవరీ చేసినట్లు చెప్పారు.
Sorry, no posts matched your criteria.