Vizianagaram

News March 16, 2024

VZM: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

image

గంట్యాడ మండలంలోని వసాది గ్రామ సమీపంలో కొత్త వెలగాడ రహదారి జంక్షన్‌లో రహదారిపై, శనివారం మధ్యాహ్నం 3.45 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్.కోట మం. కొత్తూరు గ్రామానికి చెందిన భార్యా భర్తలు ఒక బైక్‌పై, వేరొక బైక్‌పై జామి మం. తానవరానికి చెందిన ముగ్గురు యువకులు వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కొత్తూరు వాసి మృతిచెందగా, అతని భర్యతో పాటు తానవరానికి చెందిన ముగ్గురు యువకులు గాయపడ్డారు.

News March 16, 2024

రామభద్రపురం: చెట్టు నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

నాయుడువలస గ్రామానికి చెందిన M. నారాయణ రావు (46)చెట్టు మీద నుంచి జారిపడి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. నారాయణ రావు హైదరాబాద్‌లో చక్కెర కర్మాగారంలో పనిచేస్తూ సెలవుపై సొంతూరు కొద్ది రోజుల ముందు వచ్చారు. ఈరోజు ఇంటివద్ద ఉన్న చింతచెట్టు కాయలు కోస్తుండగా కాలుజారి పడ్డాడు. గాయాలు కావడంతో అస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు హెచ్సీ సత్యనారాయణ తెలిపారు.

News March 16, 2024

అరకు ఎంపీ వైసీపీ అభ్యర్థిగా డాక్టర్

image

అరకు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా చెట్టి తనూజారాణికి టిక్కెట్ కేటాయిస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఎంబీబీఎస్ పూర్తి చేసిన తనూజారాణికి అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ కుమారుడు వినయ్‌తో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. తనూజారాణి తండ్రి శ్యాం సుందర్ హుకుంపేట మండలం అడ్డుమండ సర్పంచ్. తనూజారాణికి ఎంపీ కేటాయింపుతో మూడు సామాజిక వర్గాలకు న్యాయం చేకూరిందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News March 16, 2024

విజయనగరం ఎంపీ అభ్యర్థి బెల్లాన నేపథ్యం ఇదే

image

విజయనగరం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మళ్లీ బెల్లాన చంద్రశేఖర్‌కే అవకాశం దక్కింది. బీఎల్ చదివిన ఆయన జెడ్పీటీసీ‌గా, జడ్పీ ఛైర్మన్‌గా పనిచేశారు. 2019 ఎన్నికల్లో విజయనగరం ఎంపీగా పోటీ చేసి అశోక్ గజపతి రాజుపై విజయం సాధించారు. డిగ్రీ చదివిన రోజుల్లో విద్యార్థి సంఘ నాయకుడిగా కూడా పనిచేశారు. ఆయన భార్య శ్రీదేవి చీపురుపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్‌గా 10 ఏళ్లు పనిచేశారు.

News March 16, 2024

రామభద్రపురంలో దంపతులపై దాడి.. బంగారం చోరీ

image

రామభద్రపురం గ్రామంలో అర్ధరాత్రి దోపిడీ దొంగలు భీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి దొంగలు ఓ ఇంట్లోకి చొరబడి నిద్రిస్తున్న దంపతులు రుద్రాక్షుల సత్యన్నారాయణ, అనురాధలపై కత్తితో దాడి చేసి.. అనురాధ చెయ్యిని విరిచి మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు పుస్తెల తాడును తెంచుకెళ్ళారు. ఆ తర్వాత దంపతులు బిగ్గరగా అరవడంతో స్థానికులు వెంటనే స్పందించి వారిని ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.