India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎల్.కోట మండలం రంగారాయపురంలో ఊబిలో మునిగి వ్యక్తి మృతిచెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై గోపాలరావు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటరమణ(62) పశువుల కాపరులతో కలిసి కరెడ్ల వారి కోనేరు సమీపానికి వెళ్లాడు. అక్కడ పశువులు కోనేరులో ఉన్న ఊబిలో దిగగా.. వాటిని నెట్టే ప్రయత్నంలో అతను ఊబిలో మునిగి చనిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
సింహాచలం ఆలయంలో బుధవారం, గురువారం ఆర్జిత సేవలన్నీ రద్దు చేసినట్లు సింహాచలం దేవస్థానం ఏఈఓ ఆనంద్ కుమార్ మంగళవారం తెలిపారు. ఈనెల 22న శ్రీ నృసింహ జయంతి, స్వాతి నక్షత్ర హోమం నిర్వహిస్తున్న కారణంగా ఆర్జిత సేవలు అన్నింటిని రద్దు చేసినట్లు తెలిపారు. అలాగే 23న వైశాఖ పౌర్ణమి కావడంతో గురువారం కూడా ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
విజయనగరం జిల్లాలో ఆరోగ్యశ్రీకి సంబంధించి దాదాపు రూ.50 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ఆసుపత్రుల యజమానులు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులతో చర్చలు జరిపారు. అవి విఫలం కావడంతో నేటి నుంచి జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. జిల్లాలో ఆరోగ్యశ్రీ కింద సేవలు అందించే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు 46 ఉన్నాయి. వీటిలో ఏడాదికి రెండు లక్షలకు పైగా రోగులు చికిత్స పొందుతున్నారు.
విజయనగరం ఎస్పీ దీపిక ఎం.పాటిల్ ఈవీఎంలను భద్రపరిచిన ఇంజినీరింగ్ కళాశాల వద్ద కేంద్ర బలగాలు, ఆర్మ్డ్ రిజర్వుడు, సివిల్ పోలీసుల మూడంచెల భద్రతను మంగళవారం తనిఖీలు నిర్వహించారు. కళాశాలకు వెళ్లే మార్గాల వాహనా తనిఖీలు పర్యవేక్షించారు. అంతేకాకుండా ఆయా మార్గాల వెళ్లే వాహనాల వ్యక్తుల వివరాలను రిజిస్టర్లో నమోదు చేస్తామన్నారు. ఈవిఎంల భద్రతను అదనపు ఎస్పీ, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైల పర్యవేక్షణలో ఉంటుందన్నారు
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చివరి ప్రయాణం శ్రీకాకుళంలో మే 21, 1991న సాగింది. అప్పటి లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో ఆయన ఉత్తరాంధ్రలో పర్యటించారు. శ్రీకాకుళంలో జరిగిన భారీ బహిరంగ సభలో అభ్యర్థి డా.కణితి విశ్వనాథంకు మద్దతుగా ప్రసంగించారు. అక్కడ నుంచి విజయనగరం సభలో మాట్లాడారు. అనంతరం విశాఖ చేరుకుని అక్కడ నుంచి విమానంలో రాత్రి 10 గంటలకు తమిళనాడులోని పెరుంబుదూర్‌లో జరిగిన మానవబాంబు దాడిలో హత్యకు గురయ్యారు.
ఇటీవల ఫెడెక్స్ కొరియర్ పేరుతో వచ్చే కాల్స్‌తో ప్రజలు సైబర్ మోసాలకు గురవుతున్నారని, ఇటువంటి నకిలీ కాల్స్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఎం.దీపిక సూచించారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. కొరియర్ సర్వీసులతో వచ్చే నకిలీ కాల్స్‌ను నమ్మి, సైబర్ మోసాల బారిన పడొద్దని కోరారు. ఈ తరహా సైబర్ మోసగాళ్ల కాల్స్ భయపడాల్సిన పని లేదని, ఇటువంటి కాల్స్ ప్రజలెవరూ స్పందించకూడదన్నారు.
అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేశామని బొబ్బిలి రూరల్ తిరుమల రావు తెలిపారు. మంగళవారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. తెర్లాం ఎస్ఐ రమేశ్‌కు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు తెర్లాం జంక్షన్లో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసునున్నామన్నారు. వారి వద్ద నుంచి 1.5 కేజీ గంజాయి, బైక్‌ను స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులను రిమాండ్‌కు తరలించామని సీఐ వివరాలను వెల్లడించారు
ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఈ నెల 24న ఎంఎస్ఎంఈ మేక్ఇన్ ఇండియా సపోర్ట్ స్టార్టప్ అండ్ అగ్రిటెక్, ఆక్వా, ఫుడ్ ప్రాసెసింగ్ వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. ఎంఎస్ఎంఈ చాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ డాక్టర్ దాసరి దేవ రాజ్, డీజీఎస్ సంతోష్ కుమార్‌లు ఈ విషయం తెలిపారు. పెందుర్తి మహిళా ప్రగతి కేంద్రం టీటీడీసీలో వర్క్‌షాప్ జరుగుతుందని తెలిపారు.
ఈ నెల 24 నుంచి జూన్ 7వ తేది వరకు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు జరుగుతాయని జిల్లా రెవెన్యూ అధికారి జి. కేశవనాయుడు అన్నారు. సోమవారం పార్వతీపురం ఇంటర్ పరీక్షల నిర్వహణపై కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని, వర్షాలు పడినా పరీక్షల నిర్వహణకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. కేంద్రాల వద్ద పోలీసుల బందోబస్తు ఉండాలన్నారు.
గంజాయతో పట్టుబడిన ఆరుగురు యువకులను అరెస్ట్ చేసినట్లు తెర్లాం ఎస్సై ఆర్.రమేశ్ సోమవారం తెలిపారు. ఆదివారం రాత్రి మండలంలో రంగప్పవలస చెరువు దగ్గర ఒడిశా రాష్ట్రం నుంచి 2.193 కిలోల గంజాయి తీసుకువస్తుండగా యువకులను అదుపులోకి తీసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని, ఈ కేసు బొబ్బిలి సీఐ తిరుమలరావు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.