India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన పాచిపెంట మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై పి నారాయణరావు తెలిపిన ప్రకారం.. పాంచాలి గ్రామానికి చెందిన కలువలపల్లి రాంబాబు(45) మద్యానికి బానిపై అయ్యాడు. అతిగా మద్యం తాగవద్దని భార్య మందలించింది. మనస్తాపం చెందిన రాంబాబు ఈ నెల 18న గడ్డి మందు తాగాడు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.
జిల్లాలో పశువుల అక్రమ రవాణా, తరలింపు నియంత్రణకు కఠిన చర్యలు చేపడతామని ఈ చర్యలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక నోడల్ అధికారిగా విజయనగరం ట్రాఫిక్ డీఎస్పీ డి.విశ్వనాధ్‌ను నియమిస్తున్నామని జిల్లా ఎస్పీ ఎం.దీపిక తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత పోలీసు అధికారులకు లేదా విజయనగరం ట్రాఫిక్ డీఎస్పీ 91211 09406 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు.
పాము కాటుకు గురై ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఎల్.కోట మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. కరెడ్ల చిన్నారావు(60) పొలంలో పనిచేస్తున్న క్రమంలో పాముకాటుకు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక పీహెచ్సీకి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడ నుంచి ఎస్.కోట తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నేడు జరగనున్న పైడితల్లి అమ్మవారి దేవరోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశారు. రైల్వే స్టేషన్ వనంగుడిలో కొలువుదీరిన అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు, ఆలయ ప్రదక్షిణ అనంతరం సా.5గంటలకు ఊరేగింపుగా హుకుంపేట తీసుకొస్తారు. అక్కడ నుంచి ఘటాలతో మంగళవారం తెల్లవారుజామున కొత్తపేట, పార్కుగేటు, శివాలయం వీధి మీదుగా ఊరేగింపుతో మూడులాంతర్ల చదురుగుడికి తీసుకొస్తారు. వచ్చే రెండువారాల వరకు అమ్మవారు అక్కడే పూజలందుకుంటారు.
ఈ నెల 24న DEECET-2024 పరీక్షను గాజులరేగలో ఐయాన్ డిజిటల్ జోన్‌లో నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ప్రేమకుమార్ తెలిపారు. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12.30 నిమిషాల వరకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్లను cse.ap.gov.in వెబ్సైట్ లో డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు.
ఎస్.కోట మండలం వెంకటరమణపేటకు చెందిన అప్పలస్వామి అనే గొర్రెల కాపరి ఆదివారం పిడుగుపాటుతో మృతి చెందాడు. ఎప్పటిలాగే తన మేకలను మేపేందుకు గ్రామ సమీపంలో మెట్టకు వెళ్లాడు. సాయంత్రం మేకలు ఇంటికి వచ్చినప్పటికీ అప్పలస్వామి రాకపోవడంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు వెతికారు. ఈ నేపథ్యంలో అప్పలస్వామి గ్రామ సమీపంలో పిడుగు పడి మృతి చెంది ఉండడాన్ని కుటుంబ సభ్యులు గుర్తించినట్లు తీవ్రంగా రోదిస్తూ వెల్లడించారు.
ఈనెల 24 నుంచి జరగబోయే ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలు జిల్లాలో 42 కేంద్రాల్లో నిర్వహించనున్నామని ఆర్ఐఓ ఆదినారాయణ తెలిపారు. ప్రథమ సంవత్సర పరీక్షలకు 14,904, ద్వితీయ సంవత్సర పరీక్షలకు 7,927 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అరగంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు.
దత్తిరాజేరు మండలంలోని రాజుల రామచంద్రపురం గ్రామానికి చెందిన మండాది గౌతం (10) శనివారం సాయంత్రం స్నేహితులతో కలిసి కాలకృత్యాలు తీర్చుకునేందుకు పప్పల చెరువు వద్దకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో కాలు జారి చెరువులోకి పడిపోయాడు. స్నేహితులు బయటకు తీసి 108కు సమాచారం అందించారు. వారు వచ్చి పరిశీలించగా అప్పటికే బాలుడు మృతి చెందాడని స్టేషన్ బూర్జివలస ఎస్.ఐ లక్ష్మీప్రసన్న కుమార్ ఆదివారం తెలిపారు.
భోగాపురం మండలంలో పులి సంచరిస్తున్నట్లు వస్తున్న వార్తలపై అటవీశాఖ అధికారులు స్పందించారు. దిబ్బలపాలెం ప్రాంతంలో సెక్షన్ అధికారి మధుమోహన్‌రావు శనివారం పర్యటించి పాదముద్రలు పరిశీలించారు. అవి పులి అడుగుజాడల్లానే ఉన్నా.. దుమ్మలగుండుగా పిలిచే హెన్నావిగా నిర్ధారించారు. ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.
ఈ నెల 21 అనగా మంగళవారం నాడు అండర్-16 బాలుర క్రికెట్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు ఆంధ్రా క్రికెట్ సంఘం జిల్లా కార్యదర్శి ఎంఎల్ఎన్ రాజు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపిక పోటీలకు హాజరు కానున్న క్రీడాకారులు స్టడీ, ఆధార్ కార్డులు పట్టుకొని ఆరోజు ఉదయం 6.30 గంటలయ్యేసరికి విజ్జీ మైదానంలో ఉండాలని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.