India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయనగరం జిల్లాలో అతిసారం వ్యాధి వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వ అధికారులతో టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సంయుక్త కలెక్టర్ కే.కార్తీక్ చెప్పారు. సోమవారం ఏర్పాటు చేసిన కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన అధికారులతో మాట్లాడారు. ఐదేళ్ల లోపు పిల్లలు వ్యాధి బారిన పడకుండా ఇంటికి ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లను, జింక్ మాత్రలను పంపిణీ చేయాలన్నారు.
విజయనగరం జిల్లా కలెక్టర్‌గా నియమితులైన బీ.ఆర్.అంబేడ్కర్ మంగళవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం జిల్లాకు చేరుకుంటారు. కలెక్టరేట్‌లో మధ్యాహ్నం ప్రస్తుత కలెక్టర్ నాగ లక్ష్మి ఆయనకు బాధ్యతలు అప్పగించి రిలీవ్ అవుతారని తెలియజేశారు.
విశాఖ – విజయవాడ మార్గంలో పలు రైళ్లను రద్దు చేయడంతో ఆర్టీటీ బస్సు సర్వీసులను నడపనున్నట్లు డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ అప్పలనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ద్వారక బస్ స్టేషన్ నుంచి 12 ప్రత్యేక సర్వీసులు, శ్రీకాకుళం విజయనగరం నుంచి మరో మూడు ప్రత్యేక సర్వీసులు విజయవాడకు నడుపుతామన్నారు. వందే భారత్ రైలు ప్రయాణికుల కోసం విశాఖ నుంచి విజయనగరానికి రాత్రి వేళల్లో ప్రత్యేక బస్ సర్వీసు ఏర్పాటు చేశామన్నారు.
G.O 117ను రద్దు చెయ్యాలని మంత్రి లోకేశ్‌ను ఆప్తా సంఘం నాయకులు కోరారు. వెలగపూడి సచివాలయంలోని మంత్రి లోకేశ్ పేషీలో రాష్ట్ర అధ్యక్షుడు గణపతిరావు, ప్రధాన కార్యదర్శి కె.ప్రకాష్‌రావు, సహాధ్యక్షుడు మెహది సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు. తల్లికి వందనం ద్వారా ఇచ్చే ఆర్థిక లబ్ధి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మాత్రమే ఇవ్వాలని కోరారు. వారి వినతులపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
విశాఖ బ్యాటింగ్ డైనమైట్, SRH ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ఇండియా టీ-20 టీంకు ఎంపికైన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించారు. క్రికెట్ చరిత్రలో విశాఖ పేరును ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేస్తున్న సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన నితీశ్‌ను పలువురు అభినందిస్తున్నారు. ఆయన ఎంపిక పట్ల ACA గౌరవఅధ్యక్షుడు శరత్ చంద్రారెడ్డి, కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
గంట్యాడ మండలంలోని వసాది గ్రామానికి చెందిన బొదంకి ఎర్రి నాయుడు(47) పిడుగు పడి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. గంట్యాడ ఎస్సై సురేంద్ర నాయుడు అందించిన వివరాలు ప్రకారం.. మృతుడు పొలంలో పనులు చేసేందుకు వెళ్లగా పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ప్రైవేటు కంపెనీల్లో మొత్తం 310 ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెల 27న 10 గంటల నుంచి ఎంఆర్ కాలేజ్‌లో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి డి.అరుణ తెలిపారు. హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్‌లో ప్రొడక్షన్, ముత్తూట్ ఫైనాన్స్‌లో రిలేషన్షిప్ ఆఫీసర్, జాబ్ డీలర్స్ కంపెనీలో ఫ్రంట్ ఆఫీస్, టెలీ కాలింగ్, హెల్పర్స్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, మార్కెటింగ్ వంటి ఉద్యోగాల భర్తీ జరుగుతుందని తెలిపారు.
విజయనగరం జిల్లా కేంద్రం రింగురోడ్డు సమీపంలోని మహరాజుపేట వద్ద నిర్మాణంలో ఉన్న వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయ భవనం అక్రమమని నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు జారీచేశారు. వీఎంఆర్డీఏ అభ్యంతరాలు ఉన్నాయని పేర్కొంటూ.. నిర్మాణ పనులు తక్షణం నిలుపు చేయాలని, వారం రోజుల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని పార్టీ ప్రతినిధులకు సూచించారు. కాగా సుమారు ఎకరా స్థలంలో ఇక్కడ వైసీపీ కార్యాలయ నిర్మాణం జరుగుతోంది.
కేవలం 14 నెలల కాలంలోనే ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించారు కలెక్టర్ నాగలక్ష్మి. ఈ కొద్ది రోజుల్లోనే ఆమె అజాత శతృవుగా, అందరికీ అభిమానపాత్రులయ్యారు. జిల్లా అభివృద్ధి పట్ల తపన, నిరంతర శ్రమ, ఎటువంటి భేషజాలులేని పనితీరుతో ఆమె అందరినీ ఆకట్టుకున్నారు. ఒకవైపు ప్రజాప్రతినిధులను అధికారయంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ, విధులు నిర్వహించారని అధికారులు గుర్తు చేసుకున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన తొలి మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఉమ్మడి విజయనగరం నుంచి మంత్రులు సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు తమ శాఖలపై పట్టు పెంచుకునేందుకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేయనున్నారు. తొలి మంత్రి వర్గ సమావేశం కావటంతో వివిధ వర్గాలకు లబ్ధి చేకురేలా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.