Vizianagaram

News May 7, 2024

VZM: చంద్రబాబు కురుపాం పర్యటన ఖరారు

image

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈనెల 9న ఎన్నికల ప్రచారానికి కురుపాం రానున్నారు. 9వ తేదీ ఉదయం 11 గంటలకు కురుపాం మండల కేంద్రం సమీపంలోని జరిగే ఎన్నికల బహిరంగ సభలో పాల్గొంటారని మాజీ మంత్రి కిడారి శ్రావణ్ చెప్పారు. ఈ మేరకు చంద్రబాబు పర్యటన కోర్ కమిటీ సోమవారం సాయంత్రం రాష్ట్ర పార్టీ కార్యదర్శి వీరేశ్ దేవ్ ఇంటి వద్ద సమావేశమయ్యారు.

News May 7, 2024

VZM: పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి గడువు పెంపు

image

ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగి పార్వతీపురం మన్యం జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి రెండు రోజులు సమయం పెంచినట్లు జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ తెలిపారు. పార్వతీపురం ఎస్‌వీడీ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రంలో ఏడు, ఎనిమిది తేదీలలో ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలని సూచించారు.

News May 6, 2024

VZM: పొక్సో కేసులో నిండుతుడికి 20 సం జైలు, జరిమానా

image

విజయనగరం రూరల్ పోలీసు స్టేషనులో 2020 నమోదైన పోక్సో కేసులో నిండుతుడికి 20 సం కఠిన కారాగార శిక్ష, 2,500 జరిమానా విధిస్తూ కోర్టు సోమవారం తీర్పు ఇచ్చిందని సీఐ శ్రీనివాసరావు తెలిపారు. ద్వారపూడి గ్రామానికి చెందిన నిందితుడు కళ్లేపల్లి అప్పారావు (61) 5సం. మైనర్ బాలికపై లైంగిక నేరానికి పాల్పడినట్లుగా బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. నిండుతుడిని కోర్టులో హాజరుపరచగా నేరం రుజువు కావడంతో తీర్పు ఇచ్చిందన్నారు.  

News May 6, 2024

చంద్రబాబు సభను జయప్రదం చేయండి: కిమిడి

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 9న టీడీపీ అధినేత నారా చంద్రబాబు పాల్గొనున్న ప్రజాగళం బహిరంగ సభను విజయవంత చేయాలని ఆ
పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున పిలుపునిచ్చారు. చీపురుపల్లిలోని విజయనగరం, పాలకొండ ప్రధాన రహదారిలో మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేయనున్న బహిరంగ సభ స్థలాన్ని పార్టీ ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జ్ శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు.

News May 6, 2024

గ్రామాల‌ అభివృద్ధికి కట్టుబడి ఉంటాం: రాజన్నదొర

image

గ్రామాల‌ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని సాలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజన్నదొర అన్నారు. సాలూరు మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం ప్రచారం చేపట్టారు. ఆయా గ్రామాల్లో ప్రజలతో మాట్లాడి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. వైసీపీకి ఓటు వేసి జగన్మోహన్‌రెడ్టిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలతో కలిసి థింసా నాట్యం చేశారు.

News May 6, 2024

VZM: ఒకే గ్రామం.. రెండు మండలాలు

image

ఏ గ్రామానికైనా ఒకటే మండల కేంద్రం ఉంటుంది. కానీ కురుపాం నియోజకర్గంలోని మార్కొండపుట్టికి 2 మండల కేంద్రాలున్నాయి. గరుగుబిల్లి మండలంలో ఉన్న మార్కొండపుట్టి.. తోటపల్లి డ్యాంలో ముంపునకు గురవ్వడంతో వారికి కొమరాడ మండల పరిధిలో నిర్వాసితకాలనీ ఏర్పాటు చేశారు. దీంతో భూసమస్యలకు గరుగుబిల్లి.. కుల, ఆదాయ ఇతర పనులకు కొమరాడ మండల కేంద్రాలకు పరుగులు తీయాల్సి వస్తోంది. మరి ఈ సమస్యను పాలకులు పట్టించుకుంటారో లేదో చూడాలి.

News May 6, 2024

భోగాపురం ఎయిర్ పోర్టుకు అల్లూరి పేరు: శ్రీభరత్

image

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే భోగాపురం ఎయిర్ పోర్టుకు అల్లూరి పేరు పెడతామని విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. ఈ మేరకు గాజువాకలో జరిగిన ఓ సమావేశంలో ఆయన ఈ హామి ఇచ్చారు. అలాగే ఎస్.కోట నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో కలుపుతామని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలిత కుమారి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

News May 5, 2024

VZM: పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న వారు

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎన్నికల విధులు నిర్వర్తిస్తూ వేరే జిల్లాలలో ఓటరుగా నమోదు అయి ఉన్న 6,812 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును ఆదివారం వినియోగించుకున్నారు.
➠విజయనగరం: 1356
➠చీపురుపల్లి: 385
➠గజపతినగరం: 603
➠నెల్లిమర్ల: 587
➠బొబ్బిలి: 749
➠ఎస్.కోట: 563
➠పార్వతీపురం: 1098
➠కురుపాం: 925
➠సాలూరు: 546

News May 5, 2024

సంబల్పూర్-కాచిగూడ ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సంబల్పూర్-కాచిగూడ-సంబల్పూర్ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు వాల్తేరు రైల్వే డివిజన్ డీసీఎం సందీప్ తెలిపారు. ఈనెల 13 నుంచి 24 వరకు ప్రతి సోమవారం రాత్రి 9 గంటలకు సంబల్పూర్‌లో బయలుదేరి దువ్వాడ మీదుగా కాచిగూడ చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో ఈనెల 14 నుంచి 25 వరకు ప్రతి మంగళవారం కాచిగూడలో రాత్రి 11 గంటలకు బయలుదేరి దువ్వాడ మీదుగా సంబల్పూర్ చేరుకుంటుందన్నారు.

News May 5, 2024

VZM: ఇక్కడ నోటాకు అత్యధిక ఓట్లు.. దేశంలోనే 2nd

image

అరకు లోక్‌సభ 2019 ఎన్నికల్లో నోటా ఓట్లు ఎక్కువగా పోలైన నియోజకవర్గాల్లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. 2019లో బిహార్‌లోని గోపాల్‌గంజ్ నియోజకవర్గంలో అత్యధికంగా 51,660 ఓట్లు ‘నోటా’కి రాగా, ఆ తర్వాతి స్థానంలో అరకులో 47,977 ఓట్లు నోటాకు పోలయ్యాయి. దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందనే లెక్కలను భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన ‘జనరల్ ఎలక్షన్స్ 2019: యాన్ అట్లాస్’లో పేర్కొంది.

error: Content is protected !!