India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అల్లూరి జిల్లా పాడేరు ఘాట్ రోడ్ లో ఓ ప్రైవేటు జీపు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం ఉదయం ద్విచక్ర వాహనంపై పాడేరు వస్తుండగా… మైదాన ప్రాంతం వెళ్తున్న ప్రైవేట్ జీపు డైమండ్ పార్క్ జంక్షన్ సమీప మలుపు వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు ముడువ సింహాచలం మృతి చెందాడు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
విజయనగరం జిల్లా వ్యాప్తంగా నేడు పోస్టల్ బ్యాలెట్ ప్రారంభం కానుంది. ఆ మేరకు ఫెసిలిటేషన్ సెంటర్లను శనివారం కలెక్టర్ నాగలక్ష్మి తనిఖీ చేశారు.హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేసి, ఓటు వేయడానికి వచ్చే ఉద్యోగులకు అవసరమైన సమాచారాన్ని అందించాలని ఆదేశించారు. జేసీ కార్తీక్, సహాయ కలెక్టర్ వెంకట త్రివినాగ్, డీఆర్వో అనిత , డీఆర్డీఏ పీడీ కళ్యాణ్ చక్రవర్తి , ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సుధారాణి తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో ఓటు కలిగి జిల్లాలో ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు వారి స్వంత నియోజకవర్గాలలోని ఫెసిలిటేషన్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగి ఈ జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులకు మే 5, 6 తేదీల్లో శ్రీ వేంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫెసిలిటేషన్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలన్నారు.
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియకు ఫెసిలిటేషన్ కేంద్రాలను అధికారులు కేటాయించారు. రాజాం- (ప్రభుత్వ ఉన్నత పాఠశాల, RTC కాంప్లెక్స్ దరి), బొబ్బిలి-(మున్సిపల్ పాఠశాల గొల్లపల్లి), చీపురుపల్లి-( శ్రీరామ్ జూనియర్ కాలేజ్, SDS కాలేజ్), గజపతినగరం-(బాలికల ఉన్నత పాఠశాల, పురిటిపెంట), నెల్లిమర్ల-(CKMకాలేజ్, MIMS పక్కన), విజయనగరం-(JNTU), శృంగవరపుకోట -(ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, ఎస్ కోట)లో ఏర్పాటు చేశారు.
జిల్లాలో 18,631 మంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పేర్కొన్నారు. బొబ్బిలి నియోజక వర్గంలో 2105 మంది , చీపురుపల్లిలో 1405 మంది, గజపతినగరం లో 1665 మంది, నెల్లిమర్ల లో 1525 మంది , విజయనగరంలో 3975 మంది, శృంగవరపుకోట (అసెంబ్లీ)లో 1776, రాజాంలో 1741 మంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.
చెడు వ్యసనాలతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బాడంగి మండలంలో చోటు చేసుకుంది. జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ బీ ఈశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. కోటిపల్లి గ్రామానికి చెందిన బోను వెంకటరమణ(21) తాగుడు, బెట్టింగ్‌కు అలవాటు పడినట్లు తెలిపారు. జీవితంపై విరక్తి చెంది శనివారం డొంకినవలస ఎత్తు బ్రిడ్జి సమీపంలో రైలు క్రిందపడి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. పోలీసులు కేసు నమోదు చేశామని తెలిపారు.
సరిగ్గా మరో నెల రోజుల్లో మీ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరో తేలిపోనుంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్ స్టార్ట్ అవ్వగా.. మే13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్లు లెక్కించి ఎమ్మెల్యే ఎవరో ప్రకటిస్తారు. అయితే గత ఎన్నికల్లో ఉమ్మడి విజయనగరంలోని 9 నియోజకవర్గాల్లోనూ వైసీపీ అభ్యర్థులే గెలిచారు. మరి ఈసారి మీ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారో కామెంట్ చెయ్యండి.
70 ఏళ్ల క్రితమే విశాఖ రాజధాని కావాలని గొంతెత్తిన సాలూరు మొదటి MLA కూనిశెట్టి వెంకటనారాయణ దొర. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో గెలిచిన కూనిశెట్టి 1952లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో ఆనాడే ఆయన ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగాలంటే విశాఖ రాజధాని కావాలని గొంతెత్తారు. ప్రతిపాదనపై ఓటింగ్ జరిగితే ఒకే ఒక్క ఓటుతో తీర్మానం వీగిపోయింది.
1952లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో మెరకముడిదాం మండలం గర్భాంకి చెందిన తాడ్డె చినఅచ్చిన్నాయుడు తొలిసారి గెలుపొందారు. 1955లో జరిగిన ఎన్నికల్లో మెరకముడిదాంకి చెందిన ముదుండి సత్యనారాయణరాజు, 1962లో అదే మండలంలో చినబంటుపల్లికి చెందిన కోట్ల సన్యాసప్పలనాయుడు, 1967లో గర్భాంకు చెందిన తాడ్డె రామారావు, 1972లో ఇప్పలవలసకు చెందిన రౌతు పైడపునాయుడులు వరుసగా విజయం సాధించారు.
ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో మహిళల ఓట్లే కీలకంగా మారనున్నాయి. జిల్లాలో మొత్తం ఓటర్లు 15,62,921 మంది ఉన్నారు. వీరిలో అధికంగా మహిళా ఓటర్లు 7,92,038 మంది ఉండడంతో అభ్యర్థుల గెలుపులో వీరంతా కీలకంగా మారనున్నారు. మహిళలు ఎక్కువ శాతం ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో ఆ పార్టీ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. పోలింగ్ దగ్గర పడుతుండడంతో మహిళలను ప్రసన్నం చేసుకోవడంలో అభ్యర్థులు బిజీ బిజీగా ఉన్నారు.
Sorry, no posts matched your criteria.