India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయనగరం జిల్లాలో ఈనెల 13న జరిగే సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తూ, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పోలింగ్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఆదేశించారు. పోలింగ్ నిర్వహణకు సంబంధించి పీఓలు, ఏపీఓల రెండో విడత శిక్షణ కార్యక్రమాలు జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురువారం చేపట్టారు.
గొట్లాం, గరుడబిల్లి రైల్వేస్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని మృత దేహాన్ని గురువారం గుర్తించామని రైల్వే పోలీసులు తెలిపారు. ట్రైన్ ఢీకొట్టిందా లేదా ట్రైన్ నుంచి జారిపడి మృతిచెందాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని విజయనగరం ఆస్పత్రికి తరలించామని జీఆర్పీ హెచ్సీ కృష్ణారావు తెలిపారు. వ్యక్తి ఆచూకీ తెలిసిన వారు VZM, BBL GRP స్టేషన్‌లకి తెలపాలని కోరారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురువారం పాలకొండలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆయన రాజుపేట జంక్షన్ వద్ద హెలికాప్టర్ దిగి, అక్కడి నుంచి తన కాన్వాయ్‌లో ప్రచారం చేస్తూ పాలకొండలోని వడమ సెంటర్ చేరుకుంటారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జన సైనికులకు దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం విశాఖలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.
రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈనెల 1వ తేదీ నుంచి నిర్వహించాలనుకున్న వేసవి శిక్షణ శిబిరాలను ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు క్రీడాధికారి ఎస్. వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ శిబిరాలు వచ్చే నెల 14వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. ఎనిమిదేళ్ల నుంచి పద్నాలుగేళ్ల వయసు గల బాల, బాలికలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా నందమూరి బాలకృష్ణ నేడు విజయనగరంలో పర్యటించనున్నారు. సాయంత్రం 5 గంటలకు సభ జరగుతుందని స్థానిక టీడీపీ నాయకులు తెలిపారు. చీపురుపల్లిలో జరిగే సభ అనంతరం కొత్తపేట నీళ్ల ట్యాంకు, అంబటి సత్రం కూడలి, మూడు లాంతర్ల కూడలి మీదుగా సభస్థలానికి చేరుకుంటారని వెల్లడించారు. ఈ మేరకు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఈ పర్యటనలో భాగంగా నిన్న విశాఖ చేరుకున్నారు.
గరుగుబిల్లి ఉద్యాన కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్ల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ బుధవారం పరిశీలించారు. ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సాధారణ ఎన్నికలకు సంబంధించి అరకు పార్లమెంటు నియోజకవర్గంతో పాటు పార్వతీపురం, సాలూరు, పాలకొండ, కురుపాం నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు ఉద్యాన కళాశాలలో ఏర్పాట్లను చేస్తున్నారు.
డుంబ్రిగుడలో దారుణ హత్య జరిగింది. నూతనంగా నిర్మిస్తున్న తహశీల్దార్ కార్యాలయంలో ప్లాస్టిక్ వినియోగ పరికరాలు సేకరించే ఓ వ్యక్తి బుధవారం హత్యకు గురయ్యాడు. అరకు సీఐ రుద్రశేఖర్, స్థానిక ఎస్సై సంతోష్ కుమార్ ఘటనా స్థలిని పరిశీలించారు. మృతుడు ఎస్.కోట మండలం రాజిపేట గ్రామానికి చెందిన బత్తిన శివ శ్రీనివాస్‌గా గుర్తింమన్నారు. నిందుతుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. హత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పోక్సో కేసులో రామభద్రపురం మండలంలోని కోటశిర్లాం గ్రామానికి చెందిన నిందితుడు గర్బాపు వినయ్ కుమార్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ న్యాయస్థానం బుధవారం తీర్పు వెల్లడించింది. బొబ్బిలి రూరల్ సీఐ తిరుమలరావు మాట్లాడుతూ.. 2020లో బాలికను మోసం చేశాడన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ఆధారాలతో కోర్టులో ప్రవేశపెట్టామన్నారు. నేరం రుజువు కావడంతో జడ్జి నాగమణి శిక్ష ఖరారు చేశారని చెప్పారు.
సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ విజయనగరంలో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. గురువారం సాయంత్రం 6 గంటలకి విజయనగరంలోని ముఖ్య కూడలి గంటస్తంభం వద్ద బాలకృష్ణ రోడ్ షో నిర్వహించి, అక్కడ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిగా బాధ్యతలు స్వీకరించిన డా.కే.విజయపార్వతీ జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్‌ను కలెక్టర్ కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేశారు. ఇప్పటి వరకు జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారిగా విధులు నిర్వహించిన డా.బగాది జగన్నాథరావు మంగళవారం పదవీ విరమణ చేసిన సంగతి అందరికీ విదితమే.
Sorry, no posts matched your criteria.