India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయనగరం జిల్లా సమీపంలో తగరపువలస జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుకు అడ్డుగా వచ్చిన ఓ బాలికను తప్పించబోయి శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ నేతింటి వైకుంఠరావు ప్రమాదానికి గురయ్యాడు. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
సీఎం జగన్ సోమవారం చోడవరం రానున్నారు. విశాఖ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో ఉదయం 10.35 గంటలకు చోడవరం చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో బహిరంగ సభకు వస్తారు. ఉదయం 11 నుంచి 11.45 గంటల వరకు కొత్తూరులో జరిగే సభలో ప్రసంగిస్తారు. తిరిగి హెలికాప్టర్ లో మధ్యాహ్నం 12.10 గంటలకు బయలుదేరి ఒంటి గంటకు డాక్టర్ బిఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అంబాజీపేట వెళ్లనున్నారు.
బాడంగి మండలంలో వీఆర్వోగా పనిచేస్తున్న రాజయ్యపేటకుగ్రామానికి చెందిన ఏవీఎస్ డీకే రాజు (58) ఆదివారం మృతి చెందారు. ఇటీవల విధుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. విశాఖలో చికిత్స పొందుతూ , ఇతర అనారోగ్య సమస్యలతో పరిస్థితి విషమించి మృతి చెందారు. ఆయనకు వీఆర్వోల సంఘం సంతాపం ప్రకటించింది.
సామాజిక పింఛన్ల పంపిణీపై కలెక్టర్ నాగలక్ష్మి కీలక ప్రకటన చేశారు. మోడల్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో దివ్యాంగులు, సైనిక్ వెల్ఫేర్ పింఛన్లు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మాత్రమే సచివాలయ సిబ్బంది ఇంటికి వెళ్లి సొమ్ము అందజేస్తారని చెప్పారు. అలాంటి వారిని ఇప్పటికే గుర్తించామని స్పష్టంచేశారు. మిగిలిన వారికి డీబీటీ విధానం ద్వారా మే 1న జమ చేస్తామని తెలిపారు.
గరుగుబిల్లి ఉద్యాన కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్ల ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్, సహాయ రిటర్నింగ్ అధికారి ఎస్ శోభిక ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సాధారణ ఎన్నికలకు సంబంధించి అరకు పార్లమెంటు నియోజకవర్గంతో పాటు పార్వతీపురం, సాలూరు, పాలకొండ, కురుపాం నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుకు ఉద్యాన కళాశాలలో ఏర్పాట్లను చేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజున చిన్న తప్పు కూడా జరగకుండా అధికారులు సక్రమంగా విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సూచించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో రిసెప్షన్ సెంటర్ల ఇన్‌ఛార్జ్‌లు, అధికారులు, సిబ్బందికి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. అధికారులకు అప్పగించిన విధుల పట్ల పూర్తి అవగాహనా కలిగి ఉండాలని, ఎన్నికల కమిషన్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని సూచించారు.
విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిఆస్పత్రిలో తాత్కాలిక పద్ధతిపై పని చేస్తున్న ఓ ఉద్యోగి మద్యం సేవించి విధులకు హాజరయ్యాడు. సదరు ఉద్యోగి ఓపీ విభాగంలో పని చేస్తున్నాడు. ఓపీ చీటీ కావాలని రోగులు అడగగా ఉద్యోగి నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో వారు ఆస్పత్రి అధికారులకు ఫిర్యాదు చేయగా, సదరు వ్యక్తి నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు.
జిల్లాలో వచ్చే నెలలో జరగనున్న సాధారణ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో భాగంగా PO, APO, OPOల కేటాయింపు ప్రక్రియ శనివారం పూర్తయింది. ఎన్ఐసీలో రాండమైజేషన్ ప్రక్రియ ద్వారా జిల్లాలోని 12, 522 మంది ఎన్నికల సిబ్బందిని నియోజకవర్గాలకు కేటాయించే ప్రక్రియను కలెక్టర్ నాగలక్ష్మి, ఎన్నికల సాధారణ పరిశీలకులు హనీశ్ చాబ్రా, సీతారాం జాట్ తదితరుల సమక్షంలో ఎన్ఐసీ అధికారులు నిర్వహించారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. శనివారం జిల్లాలో అత్యధికం, అత్యల్పం ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.
• సాలూరులో 45.2
• గరుగుబిల్లి, సీతానగరంలో 44.7
• కొమరాడలో 44
• బలిజిపేట, జియ్యమ్మవలసలో 43.7
• మక్కువ, పాచిపెంటలో 43.5
• పార్వతీపురంలో 43.2
• కురుపాం, గుమ్మలక్ష్మీపురంలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినట్లు అధికారులు తెలిపారు.
జిల్లాలో వచ్చే నెలలో జరగనున్న సాధారణ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో భాగంగా PO, APO, OPOల కేటాయింపు ప్రక్రియ శనివారం పూర్తయింది. ఎన్ఐసీలో రాండమైజేషన్ ప్రక్రియ ద్వారా జిల్లాలోని 12, 522 మంది ఎన్నికల సిబ్బందిని నియోజకవర్గాలకు కేటాయించే ప్రక్రియను కలెక్టర్ నాగలక్ష్మి, ఎన్నికల సాధారణ పరిశీలకులు హనీశ్ చాబ్రా, సీతారాం జాట్ తదితరుల సమక్షంలో ఎన్ఐసీ అధికారులు నిర్వహించారు.
Sorry, no posts matched your criteria.