India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీకాకుళం రోడ్డు తిరుపతి మధ్య వేసవి ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే సీనియర్ డీసీఎం కే సందీప్ తెలిపారు. మే 5, 12 తేదీల్లో రాత్రి 8.05 గంటలకు తిరుపతిలో బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 8.05కి దువ్వాడ చేరుకుని మధ్యాహ్నం12.15కి శ్రీకాకుళం చేరుకుంటుంది. మే 6, 13వ తేదీల్లో మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకాకుళం రోడ్‌లో బయలుదేరి దువ్వాడ మీదగా తర్వాత రోజు ఉదయం 8.20కి తిరుపతికి చేరుకుంటుంది.
సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నృసింహ స్వామి వార్షిక తిరుకల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని రద్దు చేసిన సుప్రభాత సేవ, ఉదయం, సాయంత్రం ఆరాధన సేవల టికెట్లను శుక్రవారం నుంచి పునరుద్ధరిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రాత్రి 7 గంటల తర్వాత రద్దు చేసిన దర్శనాలను కూడా పునః ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులు గమనించాలని కోరారు.
ఉమ్మడి జిల్లాలో నామినేషన్ వివరాలను సంబంధిత అధికారులు వెల్లడించారు. చీపురుపల్లిలో 12 మందికి 10, బొబ్బిలిలో 13కి 8, గజపతినగరంలో 15కి 9, నెల్లిమర్లలో 16కి 13, ఎస్.కోటలో 16కి 14, విజయనగరంలో 20కి 16 మంది అభ్యర్థుల నామినేషన్‌లను ఆమోదించారు. విజయనగరం MPకి 15 మంది నామినేషన్‌లు ఆమోదించారు. మన్యం జిల్లాలో పార్వతీపురంలో 18 సెట్లకి 14, సాలూరులో 15కి 13, కురుపాంలో 19కి 16, అరకు MPకి 38లో 27సెట్లు ఆమోదించారు.
విజయనగరం జిల్లాలో 7అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 105నామినేషన్లు దాఖలు కాగా 83 నామినేషన్లను ఆమోదించినట్లు ఆయా నియోజకవర్గాల ROలు తెలిపారు. రాజాంలో 12 నామినేషన్లకు 10, బొబ్బిలి- 13 నామినేషన్లకు 9, చీపురుపల్లి- 13 నామినేషన్లకు 8, గజపతినగరం- 15 నామినేషన్లకు 13, నెల్లిమర్ల- 16 నామినేషన్లకు 13, విజయనగరం- 20 నామినేషన్లకు 16, ఎస్.కోట- 16 నామినేషన్లకు 14 ఆమోదించి మిగతావి తిరస్కరించామని తెలిపారు.
చీపురుపల్లి నియోజకవర్గానికి 1985లో జరిగిన ఎన్నికల్లో వింత ఘటన జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన మీసాల నీలకంఠం నాయుడికి అప్పటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ నుంచి బీఫాం కొంత ఆలస్యంగా రావడంతో సకాలంలో నామినేషన్ వేయలేకపోయారు. ఆయనను EC స్వతంత్ర అభ్యర్థిగా పరిగణించి విమానం గుర్తుఇచ్చింది. దీంతో ఆయన విమానం, హస్తం గుర్తులను బ్యానర్‌పై వేయించి ప్రచారం చేశారు. కాగా ఈ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు.
విజయనగరం ఎంపీ స్థానానికి ఓ ప్రత్యేకత ఉంది. విజయనగరం లోక్ సభ 2009లో ఏర్పడింది. అప్పటి నుంచి ఇక్కడ గెలిచిన పార్టీనే రాష్ట్రంలో అధికారం చేపట్టాయి. 2009లో కాంగ్రెస్ నుంచి బొత్స ఝాన్సీ, 2014లో టీడీపీ నుంచి అశోక్ గజపతిరాజు, 2019లో వైసీపీ నుంచి బెల్లాన చంద్రశేఖర్ గెలిచారు. ఈ ఎన్నికల్లో మూడు పార్టీలో బరిలో ఉన్నాయి. మరి ఈ సారి సెంటిమెంట్ వర్క్‌ఔట్ అవుతుందా కామెంట్ చేయండి.
ఈ నెల 30న అండర్-19 బాలుర క్రికెట్ ఎంపిక పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఎంఎల్ఎన్ రాజు తెలిపారు. ఎంపిక పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు 2005 సెప్టెంబర్ 1 తరువాత జన్మించిన వారై ఉండాలన్నారు. పోటీలకు హాజరయ్యే వారు ఒరిజినల్ ఆధార్ కార్డు, జన్మదిన ధ్రువపత్రం, గత మూడేళ్ల స్టడీ సర్టిఫికెట్స్ తీసుకొని రావాలన్నారు. సంబంధిత తేదీల్లో ఉదయం 6.30 గంటలకు వైట్ డ్రెస్, సొంత కిట్‌తో హాజరు కావాలని కోరారు.
ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి గురువారం వరకు విజయనగరం జిల్లాలో సీజ్ చేసిన వాటి వివరాలను కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. సుమారు రూ.4.43 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, విలువైన లోహ పరికరాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. రూ.1.04 కోట్ల నగదు, 14,372 లీటర్ల మద్యం, రూ.29.75 లక్షల విలువైన డ్రగ్స్, రూ.1.85 కోట్ల విలువైన లోహ పరికరాలు సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.
విజయనగరం మండలంలో గురువారం మధ్యాహ్నం ఆటో, బైకును ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. జామి నుంచి విజయనగరం వైపు వస్తున్న బస్సు రామనారాయణం వద్ద టీపాయింట్ సమీపంలో కొత్త భీమసింగి వైపు వెళ్తున్న ఆటోను, ఆ వెనుకే వస్తున్న స్కూటీని ఢీకొట్టింది. మృతులు పద్మనాభం మండలం చిన్నాపురానికి చెందిన యు.లలిత(35), జామి మండలం కొత్త భీమసింగికి చెందిన పి.శశికుమార్‌గా గుర్తించారు.
మీరు వేసే ప్రతీ ఓటు మీ భవిష్యత్తును నిర్ణయిస్తుందని అసిస్టెంట్ కలెక్టర్ సహాదిత్ వెంకట త్రివినాగ్ అన్నారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా గురువారం పట్టణంలోని కోట, బాలాజీ, మయూరి జంక్షన్ల వద్ద కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ విద్యార్దులు ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. ఓటు హక్కు వినియోగం పట్ల అవగాహన కల్పించారు. హుషారైన నృత్యాలను ప్రదర్శించి ఉర్రూతలూగించారు.
Sorry, no posts matched your criteria.