India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కమాండ్ కంట్రోల్ రూమ్‌ను అరకు పార్లమెంటరీ నియోజకవర్గ సాధారణ పరిశీలకులు ప్రమోద్, శాంతి భద్రతల పరిశీలకులు నయీం ముస్తఫా మన్సూరి గురువారం సందర్శించారు. జిల్లాకు విచ్చేసిన సాధారణ పరిశీలకులు కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ఎన్నికల ప్రవర్తన నియమావళి విభాగం, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ తదితర విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
విజయనగరం జిల్లాలో పార్లమెంటు స్థానానికి 30 సెట్లు, అసెంబ్లీ స్థానాలకు 184 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి తెలిపారు. పార్లమెంటు స్థానానికి 18 మంది, మొత్తం 7 అసెంబ్లీ స్థానాలకు 105 మంది నామినేషన్లు వేశారని చెప్పారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం కలెక్టరేట్ మీడియా సెంటర్‌లో కలెక్టర్ నాగలక్ష్మి మీడియాతో మాట్లాడారు.
ఇండియా కూటమి అభ్యర్థులకు తన మద్దతు ఉంటుందని మాజీ కేంద్ర మంత్రి వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ గురువారం తెలిపారు. తెలుగుదేశం పార్టీ బీజీపీతో జతకట్టారని ఆయన నిరసిస్తూ టీడీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఇప్పటివరకు ఏ పార్టీలో చేరకుండా తటస్థంగా ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తన మనసులో మాట వెల్లడించారు.
గుర్ల మండలం గొలగం గ్రామానికి చెందిన కలిశెట్టి మురళి ఆవు ప్రసవానికి ఇబ్బంది పడుతుండటంతో, బుధవారం గరివిడి స్థానిక పశువైద్య కళాశాలకు తీసుకొని వెళ్లాడు. కళాశాలలోని సహా ఆచార్యులు ఆవును పరీక్షించి, ఆపరేషన్ చేశారు. ఆడ దూడ 2 తలలు, 2 తోకలు, 4 వెనక కాళ్లు, 2 ముందర కాళ్లు, 3 నాలుకలతో ఉంది. పుట్టిన వెంటనే మరణించింది. జన్యుపరమైన లోపాలతో అరుదుగా ఇలాంటి దూడలు పుడుతుంటాయని
కళాశాల వైద్యులు తెలిపారు.
గజపతినగరం,నెల్లిమర్ల, విజయనగరం నియోజకవర్గాల ఎన్నికల పరిశీలకులు హనీష్ చాబ్రా గురువారం ఎన్నికల కంట్రోల్ రూంను, మీడియా కేంద్రాన్ని సందర్శించారు. కంట్రోల్ రూంలో ఏర్పాటు చేసిన వాహనాల జీపీఎస్, చెక్ పోస్టుల వద్ద ఏర్పాటు చేసిన సీసీకెమెరాల లైవ్ కార్యక్రమాలను, మీడియా మానిటరింగ్, ఎంసీసీ, సీ-విజిల్, 24/7 ఫిర్యాదుల విభాగం, సోషల్ మీడియా పర్యవేక్షణ, రిపోర్ట్స్ విభాగాలను తనిఖీ చేశారు.
జామి మండలం కిర్ల గ్రామానికి దండి నాగరాజు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నాగరాజు అట్టాడ సచివాలయంలో వెటర్నరీ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గత 2 రోజులుగా కనబడటం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం అలమండ హైవే వద్ద బ్రిడ్జ్ సమీపంలో స్థానికులు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఉమ్మడి విజయనగరం జిల్లాలోని అంబేడ్కర్ గురుకులాల్లో ఇంటర్ తప్పిన విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు సమన్వయకర్త టి.పద్మజ తెలిపారు. 13 గురుకులాల్లోని ఫస్ట్ ఇయర్, సెకెండియర్ కలిపి 172 మంది ఫెయిలయ్యారని వెల్లడించారు. ఈనెల 24న తరగతులు ప్రారంభించగా.. మే 23 వరకు కొనసాగుతాయన్నారు. బాలురుకు కొప్పెర్లలో, బాలికలకు నెల్లిమర్ల గురుకులంలో వేర్వేరుగా తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
విజయనగరం కలెక్టరేట్ సమీపంలోని ఎస్.కోట వెళ్లే రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఢీకొని గురువారం ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. ఈరోజు తెల్లవారు జామున రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తి చేశారు. ఈ మేరకు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. తుమ్మికాపల్లిలో బుధవారం 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇది రాష్ట్రంలోనే అత్యధికం. నేడు కూడా ఉమ్మడి జిల్లాలో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. విజయనగరంలో 23, పార్వతీపురం మన్యం జిల్లాలోని 12 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని గిరిజన గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పీవో విష్ణుచరణ్ తెలిపారు. పి. కోనవలస, భద్రగిరిలో బాలురు, బాలికలు, కురుపాంలో బాలికల కళాశాలలు నడుస్తు న్నాయి. వీటిలో ఎంపీసీలో 200, బైపీసీలో 200 సీట్లు భర్తీ చేయనున్నారు. వీటిలో కొన్నిచోట్ల సీఈసీ, హెచ్ఎసీ గ్రూపులున్నాయని, 40 చొప్పున సీట్లు భర్తీ చేస్తామని పీవో చెప్పారు.
Sorry, no posts matched your criteria.