Vizianagaram

News April 16, 2024

VZM: పోస్టుమాస్టర్ ఇంట్లో బంగారం చోరీ

image

కామాక్షినగర్ సమీపంలో నివాసం ఉంటున్న పోస్టుమాస్టర్ వెంకటరమణ ఇంట్లో మూడు తులాల బంగారం చోరీ జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. వెంకటరమణ గజపతినగరంలోని తన బంధువుల ఇంటికి ఈ నెల 13న కుటుంబసభ్యులతో కలిసి వెళ్లాడు. ఇంటి తాళాలు పగులగొట్టి ఉండడాన్ని సోమవారం ఉదయం 7గంటల సమయంలో పక్కింటి వారు చూసి సమాచారం ఇచ్చారు. వెంకటరమణ వచ్చి చూసేసరికి ఇంట్లో సామగ్రి చిందరవందరగా ఉంది. ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 15, 2024

విజయనగరం: తాటిచెట్టు నుంచి పడి మృతి

image

పూసపాటిరేగ మండలం చల్లవానితోట పంచాయతీ గొల్లపేట గ్రామానికి చెందిన కె.రాజారావు(45) కూలిపని నిమిత్తం ఎస్.కోట మండలం ముషిడిపల్లి గ్రామానికి వచ్చాడు. మధ్యాహ్నం భోజనం అనంతరం తాటికాయల కోసం తాటిచెట్టు ఎక్కుతూ ప్రమాదవశాత్తు జారిపడడంతో గాయాలయ్యాయి. రాజారావు ఘటనా స్థలంలోనే సోమవారం మృతిచెందాడు. మృతుడి భార్య సత్యవతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.కోట సీఐ వై.ఎంరావు తెలిపారు.

News April 15, 2024

విజయనగరం : మీడియా సిబ్బందికి కూడా పోస్టల్ బ్యాలెట్

image

పోస్టల్ బ్యాలెట్ కోసం అత్యవసర సేవలందిస్తున్న శాఖల లో పని చేస్తున్న ఉద్యోగుల, ఎన్నికల విధులలో పాల్గొంటున్న పాస్ లు పొందిన మీడియా వారి కి ఓటింగ్ కోసం పోస్టల్ బ్యాలెట్ ను అందించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో అత్యవసర సేవలను అందించే అధికారులతో కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేసారు.

News April 15, 2024

రామతీర్థం రాములోరికి గోటితో ఒలిచిన తలంబ్రాలు 

image

పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థంలో రాములోరికి శ్రీరామతీర్థం సంఘం గోటితో ఒలిచిన తలంబ్రాలను సోమవారం మధ్యాహ్నం సమర్పించారు. 2017 నుంచి రామతీర్థంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహిస్తున్న రాములోరి కళ్యాణానికి గోటితో ఒలిచిన తలంబ్రాలను అందిస్తున్నట్లు సంఘం ప్రధాన కార్యదర్శి సుదర్శనం విజయకుమార్ వెల్లడించారు. కోలాట బృందాలతో ఊరేగింపుగా గోటితో ఒలిచిన తలంబ్రాలను ఆలయ ఈఓ వై.శ్రీనివాసరావుకి అందజేశారు.

News April 15, 2024

VZM: 8ఏళ్ల బాలికను రేప్ చేసిన యువకుడు.. పోక్సో కేసు నమోదు

image

ఎల్.కోట మండలంలో పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రాజు అనే యువకుడు శనివారం రాత్రి 8 గంటల సమయంలో, చెల్లితో ఆడుకుంటున్న 8ఏళ్ల బాలికను బలవంతంగా తన ఇంటి మేడ మీదకి తీసుకువెళ్లాడు. దీంతో బాలిక చెల్లి తన తల్లీదండ్రులకి చెప్పింది. వారు చుట్టుప్రక్కల వారి సహాయంతో మేడ మీదకు వెళ్లారు. బలవంతంగా తలుపులు తెరవడంతో రాజు అర్ధనగ్నంగా, బాలిక ఏడుస్తూ కనిపించారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు.

News April 15, 2024

TDP రాష్ట్ర అధికార ప్రతినిధిగా గొంప

image

విజయనగరం జిల్లాలో టీడీపీ MLA సీటు దక్కని నేతకు పార్టీలో కీలక పదవి లభించింది. S.కోట నియోజకవర్గానికి చెందిన గొంప కృష్ణ ఎమ్మెల్యే సీటు ఆశించారు. మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారికి టికెట్ ఇచ్చారు. దీంతో కృష్ణ రెబల్‌గా పోటీ చేయడానికి సన్నద్ధమవుతున్నారు. ఈక్రమంలో ఆయన్ను టీడీపీ రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధిగా నియమించారు. ఇప్పటి వరకు ఆయన రాష్ట్ర కార్యదర్శిగా పని చేశారు.

News April 15, 2024

పార్వతీపురం: ఘనంగా అంబేడ్కర్ జయంతి

image

భారతరత్న డా. బీ. ఆర్. అంబేడ్కర్ జయంతి కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ, సాధికారిత శాఖ ఆధ్వర్యంలో జరిగింది. జాయింట్ కలెక్టర్ ఎస్ ఎస్ శోబిక జ్యోతి భారతరత్న అంబేడ్కర్ చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలవేసి నివాళులర్పించారు. అంబేడ్కర్ ఆశయాలు ఆదర్శంగా తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ శోబిక అన్నారు.

News April 14, 2024

VZM: టీడీపీ రెబల్‌గా మీసాల గీత పోటీ..!

image

2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం అసెంబ్లీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీసాల గీత తెలిపారు. ఆదివారం విజయనగరంలో ఆమె మాట్లాడుతూ.. అందరి ఆత్మ గౌరవం అనే నినాదంతో వెళ్తున్నట్లు చెప్పారు. పదవుల కోసం చూడకుండా పార్టీ మనుగడ కోసం పని చేస్తే 2O24లో కూడా తనకు అన్యాయం చేశారన్నారు. పార్టీ ప్రయోజనాల కోసం అన్ని అవమానాలు భరించానన్నారు.

News April 14, 2024

VZM: సీఎం జగన్‌పై దాడిని ఖండించిన కోలగట్ల

image

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిన్న జరిగిన దాడిని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఖండించారు. ప్రతిపక్షాలు చేసిన పిరికిపంద చర్యగా అభివర్ణించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి జరగడం హేయమైన చర్య అన్నారు. చేతకానితనంతో చేసే దాష్టీక చర్యగా పేర్కొన్నారు.

News April 14, 2024

ప్రజాదరణ చూసి ఓర్వలేక దాడి: జడ్పీ ఛై‌ర్మన్

image

విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్‌పై రాయితో దాడి చేసిన ఘటనపై జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు స్పందించారు. మళ్లీ జగన్ సీఎం కాబోతున్నారని, సిద్ధం సభకు వచ్చిన ప్రజాదరణ చూసి ఓర్వలేకనే ఈ దాడికి పాల్పడినట్లు ఆరోపించారు. రాజ్యాంగ బద్ధంగా అధికారంలోకి రావాలే కానీ.. జగన్‌ను భౌతికంగా దూరం చేసి అధికారంలోకి రావాలన్న ఆలోచన మంచి విధానం కాదన్నారు. మరో 30 ఏళ్లు జగన్ ప్రజల గుండెల్లో ఉంటారన్నారు.

error: Content is protected !!