India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎల్.కోటలో ఓ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన రాజు అనే వ్యక్తి పై పోలీసులు ఇటీవల కేసు నమోదు చేశారు. ఈ మేరకు రాజు పోలీసులు నుంచి తప్పించుకుని పరారీలో ఉన్నాడు. అయితే నిందితుడు రాజు సోంపురం సమీపంలో గల ఓ పొలంలో గురువారం శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చనిపోయిన వ్యక్తి రాజుగా నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట పీహెచ్సీకి తరలించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎంగా జగన్మోహన్ రెడ్డి విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పరిపాలనను కూడా విశాఖ నుంచే ప్రారంభిస్తారని అన్నారు. మాట తప్పని వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని వెల్లడించారు. టీడీపీ అధికారంలో ఉండగా అమరావతి పేరిట చేసిన దోపిడీ అందరికీ తెలిసిందే అన్నారు.
నోటిఫికేషన్ విడుదల కావడంతో ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎన్నికల సందడి నెలకొంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 9 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. రెండు నియోజకవర్గాలు మినహా మిగతా 7 స్థానాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఏజెన్సీ ప్రాంతం కావడంతో సాలూరు, కురుపాం నియోజకవర్గాల్లో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకే పోలింగ్ ఉంటుంది. ఓటర్లు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు కోరారు.
కొన్నేళ్లుగా సాలూరు ప్రాంత వాసులకు ఊరిస్తున్న రైలుబండి ఇంకెన్నేళ్లకు పట్టాలెక్కుతుందో అని సాలూరు ప్రజలు మండి పడుతున్నారు. గతంలో వచ్చే రైలు బస్‌కు బదులు సాలూరు నుంచి విశాఖపట్నం వరకు 6 బోగీలతో రైలు దసరాకు ప్రారంభిస్తారని పట్టాలు సరిచేసి, విద్యుత్ లైన్ వేసి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. దీంతో పట్టాల మధ్య పిచ్చి మొక్కలు పెరిగి స్టేషన్ పరిసరాలు చీకటి పనులకు అడ్డాగా మారిందంటున్నారు.
విజయనగరం జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. విజయనగరం పార్లమెంట్ స్థానానికి యుగ తులసి పార్టీ అభ్యర్థిగా శంబాన శ్రీనివాస రావు నామినేషన్ వేశారు.
జిల్లా ఎన్నికల అధికారి, విజయనగరం పార్లమెంటు రిటర్నింగ్ అధికారి నాగలక్ష్మికి రెండు సెట్ల నామినేషన్ పత్రాలను శ్రీనివాసరావు అందజేసారు. హెల్ప్ డెస్క్‌లో ముందుగా నామినేషన్ పత్రాలను ఏఆర్వో సుమబాల పరిశీలించారు.
విశాఖలోని కిర్లంపూడికి చెందిన హనిత సివిల్స్‌లో 887వ ర్యాంక్ సాధించారు. ఇంటర్ వరకు విశాఖలోనే చదివిన ఆమె 2012లో ఖరగ్‌పూర్‌లో ఇంజినీరింగ్‌లో చేరారు. 2013లో సడెన్‌గా పెరాలసిస్ రావడంతో రెండు కాళ్లు పడిపోయాయి. వీల్ ఛైర్‌కు పరిమితమైన ఆమె రెండేళ్ల పాటు డిప్రెషన్‌కి గురయ్యారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో డిస్టెన్స్‌లో డిగ్రీ పూర్తిచేసి 2020లో తొలిసారి సివిల్స్ రాశారు. నాలుగో ప్రయత్నంలో ర్యాంక్ సాధించారు
బీజేపీ బహిష్కృత నేత, మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజు స్వతంత్ర అభ్యర్థిగా నేడు (గురువారం) నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. ఈరోజు ఉదయం అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా కురుపాంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అరకు పార్లమెంట్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నట్లు జయరాజు తెలిపారు. ఈ కార్యక్రమానికి అభిమానులు హాజరవ్వాలని కోరారు.
జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అంతా సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. జిల్లాలో మొత్తం 342 ఫిర్యాదులు అందాయని అందులో 171 ఫిర్యాదులు ఎన్నికల కమిషన్ పోర్టల్‌లో నమోదయ్యాయని, వాటిలో 166 పరిష్కరించామని తెలిపారు. సి-విజిల్ లో 91 ఫిర్యాదులు అందగా వాటన్నిటినీ పరిష్కరించామన్నారు. జిల్లాలో మొత్తం రూ.83 లక్షల విలువ కలిగిన మద్యం, గంజాయి, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
బీజేపీ యువమోర్చా నాయకులు, మాజీ MLA నిమ్మక జయరాజును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అరకు ఎంపీ బీజేపీ అభ్యర్థిగా కొత్తపల్లి గీతను పార్టీ అధిష్ఠానం ప్రకటించడంతో జయరాజు వ్యతిరేక గళం విప్పారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న పార్టీ అదిష్ఠానం జయరాజును పార్టీ నుంచి సస్పెండ్‌తో పాటు ప్రాథమిక సభ్యుత్వాన్ని రద్దు చేస్తున్నట్లు క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్ పాకా సత్యన్నారాయణ రాజు తెలిపారు.
తెర్లాం పోలీస్ స్టేషన్‌లో 2016లో నమ్మించి, మోసగించిన కేసు నమోదయ్యంది. రంగప్పవలసకి చెందిన డి.రామకృష్ణ ఓ మహిళను పెళ్లిచేసుకుంటానని మోసగించి అత్యాచారం, హత్యాయత్నానికి పాల్పడినట్లు కేసు నమోదు చేశారు. మంగళవారం విజయనగరం ఏడీజే & మహిళా కోర్టు తీర్పు వెల్లడించినట్లు ఎస్సై రోణంకి రమేశ్ తెలిపారు. నిందుతుడికి సంవత్సరం కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేలు జరిమానా విధించినట్లు చెప్పారు.
Sorry, no posts matched your criteria.