India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గంట్యాడ మండలం పెదవేమలికి చెందిన పి భార్గవ్ మంగళవారం విడుదలైన సివిల్స్ ఫలితాల్లో 590 ర్యాంక్ సాధించారు. 2016లో బీటెక్ పూర్తిచేసి సాఫ్ట్‌వేర్‌లో చేరిన అతను IAS లక్ష్యంతో 2018లో ఉద్యోగాన్ని వదులుకున్నాడు. గతేడాది ఫలితాల్లో 722 ర్యాంక్ సాధించాడు. దీంతో IDASలో శిక్షణ పొందుతున్నాడు. తాజా ర్యాంక్‌తో IPS, IRS మాత్రమే వచ్చే అవకాశం ఉన్నందున IAS కోసం మళ్లీ ప్రయత్నిస్తానని తెలిపారు.
ట్రైనీ నర్సుపై యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన విజయనగరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. గంట్యాడ మం.కి చెందిన గోపీ తన తల్లిని వారం క్రితం ఆస్పత్రిలో చేర్చాడు. మంగళవారం రాత్రి విధుల్లో ఉన్న నర్సు మంచినీరు తాగేందుకు గదిలోకి వెళ్లగా ఆమె వెనకే వెళ్లి తలుపులు వేసి అత్యాచారం చేసేందుకు యత్నించాడు. ఆమె గట్టిగా అరవడంతో సిబ్బంది చేరుకున్నారు. మద్యం మత్తులో ప్రవర్తించినట్లు వైద్యులు తెలిపారు.
విజయనగరంలోని ఎత్తు వంతెన సమీపంలో ట్రావెల్ బస్సు ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గంట్యాడ మండలానికి చెందిన ఎస్ చిమ్మనాయుడు (43) విజయనగరంలోని ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి పని ముగించుకొని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా, విశాఖ వైపు వెళ్తున్న బస్సు వంతెన వద్ద ఢీకొంది. ప్రమాదంలో చిమ్మనాయుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లుకి చెందిన సూక్ష్మ కళాకారుడు గట్టెం వెంకటేశ్ పెన్సిల్ ముల్లుపై శ్రీరాముడి రూపాన్ని అద్భుతంగా చెక్కారు. ఇప్పటికే గిన్నీస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించి, ఎన్నో అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. తాజాగా 6 హెచ్‌బీ పెన్సిల్ ముల్లుపై, 6 గంటల పాటు శ్రమించి 8మి.మీ వెడల్పు, 20మి.మీ పొడవులో శ్రీరాముడి రూపాన్ని చెక్కారు.
చినమేరంగి, జియ్యమ్మవలస పోలీస్ స్టేషన్ పరిధిలో గల వివిధ పోలింగ్ కేంద్రాలను ఎస్పీ విక్రాంత్ పాటిల్ పరిశీలించారు. ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి ఎన్నికల ప్రవర్తన నియమావళి గూర్చి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సమస్యాత్మక గ్రామాలలో ఎన్నికల ప్రశాంతంగా జరుగుటకు ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల నిర్వహణపై సిబ్బందికి పలు సూచనలు అందించారు.
➤ విజయనగరం MP అభ్యర్థి : VZM కలెక్టర్ ఆఫీసు ➤విజయనగరం MLA: విజయనగరం MRO ఆఫీసు ➤ నెల్లిమర్ల MLA: నెల్లిమర్ల MRO ఆఫీసు ➤ చీపురుపల్లి MLA: చీపురుపల్లి MRO ఆఫీసు ➤ S.కోట MLA: S.కోట MRO ఆఫీస్, ➤గజపతినగరం MLA: గజపతినగరం MRO ఆఫీస్ ➤బొబ్బిలి MLA: బొబ్బిలి MRO ఆఫీస్ ➤ అరకు MP: పార్వతీపురం కలెక్టర్ ఆఫీస్, పార్వతీపురం MLA: పార్వతీపురం MRO ఆఫీసు ➤ సాలూరు MLA: సాలూరు MRO ఆఫీసు ➤ కురుపాం MLA: కురుపాం MRO ఆఫీసు
ఎలక్షన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వర్క్‌లో భాగంగా మంగళవారం విజయనగరం రైల్వే స్టేషన్‌లో విశాఖ జీఆర్పీ ఇన్‌స్పెక్టర్ కే.వెంకట్రావు నేతృత్వంలో జీఆర్పీ ఎస్ఐ రవివర్మ, సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ప్లాట్ ఫారం నెం-1లో గంజాయిని గుర్తించారు. మహారాష్ట్ర, ఒడిశాకు చెందిన ఇద్దరిని తనిఖీ చేసి.. వారి వద్ద నుంచి 33 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.
VZM : ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈనెల 18వ తేదీన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 18 న ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుందని, ఆరోజు నుంచీ నామినేషన్లను స్వీకరించడం జరుగుతుందన్నారు.
సివిల్స్ ఫలితాల్లో పార్వతీపురానికి చెందిన దొనక పృథ్వీరాజ్ 493వ ర్యాంకు సాధించారు. తండ్రి దొనక విజయ్ కుమార్ కురుపాం MEOగా, తల్లి రికార్డ్ అసిస్టెంట్‌గా పనిచేశారు. పృథ్వీరాజ్ తన రెండవ ప్రయత్నంలో ర్యాంకు సాధించారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ చదివిన యువకుడు.. ఇంటి వద్దే సివిల్స్‌కు సన్నద్ధం అయ్యి ర్యాంకు సాధించారు. ర్యాంకు సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభాలు ఇస్తామని వచ్చిన మెసేజ్‌కు యువతి మోసపోయిన ఘటన గజపతినగరం మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని పురిటిపెంటకి చెందిన ఓ యువతికి తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభాలు ఇస్తామని మెసేజ్ వచ్చింది. నమ్మిన యువతి దశలో వారీగా రూ.14.15 లక్షలు జమ చేసింది. అటు నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో మోసపోయానని గ్రహించి ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.