India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గరివిడి మండలంలోని కొండపాలెంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ శనివారం పర్యటించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జరుగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. స్థానిక అధికారులతో మాట్లాడి ఏ మేరకు పంపిణీ చేశారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. శత శాతం పింఛన్ల పంపిణీ జరగాలని ఆదేశించారు.

దేశంలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరాలలో విజయనగరం ఉందని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. జాతీయ స్వచ్ఛ గాలి కార్య క్రమం అమలుపై శుక్రవారం తన కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా రూ.2.65 కోట్లతో ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఇప్పటి వరకు రూ.4.5 కోట్లు ఖర్చు చేశారని, ఈ మేరకు వచ్చిన ఫలితాలను తెలియజేయాలన్నారు. కాలుష్య కారకాలను నియంత్రించాలన్నారు.

బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారింది. రానున్న రెండు రోజుల పాటు ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో ఉన్న మత్స్యకారులు వేటకు వద్దని మత్స్యశాఖ డీడీ నిర్మలాకుమారి సూచనలు చేశారు.

పింఛన్ల పంపిణీ ప్రక్రియను శనివారం ఉదయం 6గంటలకే ప్రారంభించారు. ఆ విధంగా కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశాలు జారీ చేశారు. సాంకేతిక లోపాలు తలెత్తితే వెంటనే తమను సంప్రదించాలని చెప్పారు. రేపు ఆదివారం కావడంతో ఈ రోజు పింఛన్ల పంపిణీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

వర్షాకాలం కావడంతో ఈ రెండు నెలలు సీజనల్ వ్యాధులు ప్రబల కుండా వైద్యాధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఆదేశించారు. తన కార్యాలయంలో శుక్రవారం సమీక్షలో సంబంధిత అధికారులతో మాట్లాడారు. వైద్య శాఖ జిల్లా అధికారులు బృందాలుగా వేసుకొని జిల్లా అంతటా ప్రతి రోజు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని సూచించారు.

వినాయక ఉత్సవాలకు సంబంధించిన అన్ని రకాల అనుమతులను మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ విండో విధానాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి, సులభతరం చేసిందని ఎస్పీ వకుల్ జిందాల్ ఆగస్టు 30న తెలిపారు. ఈ విధానంతో ప్రజలు సులభంగా గణేశ్ ఉత్సవాల నిర్వహణ, మండపాల ఏర్పాటు, ఊరేగింపులు, నిమర్జనానికి చలానా రుసుమును చెల్లించి, నిరభ్యంతర పత్రం, క్యూఆర్ కోడ్‌ను పొందవచ్చునన్నారు.

ఉమ్మడి జిల్లాకు ప్రత్యేకాధికారులుగా ఇద్దరు IASలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. విజయనగరం జిల్లాకు ప్రభుత్వ కార్యదర్శిగా ఉన్న వి.వినయ్ చంద్, పార్వతీపురం మన్యం జిల్లాకు కోన శశిధర్‌ను నియమిస్తూ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలపై జిల్లా అధికారుల సమన్వయంతో ఇక మీదట పర్యవేక్షించమని ఆదేశించారు.

ఆరోగ్యశ్రీలో చికిత్స పొందిన రోగులు, సంబంధిత కుటుంబ సభ్యుల నుంచి ఒక్క రూపాయి తీసుకున్నా.. సంబంధిత ఆసుపత్రి యాజమాన్యంతో పాటు వైద్యులు, సిబ్బందిపై చర్యలు తప్పవని ఆరోగ్యశ్రీ సమన్వయకర్త అప్పలరాజు హెచ్చరించారు. గురువారం ఆరోగ్యశ్రీ అనుబంధ విభాగం ఆసుపత్రుల యాజమాన్యాలతో నగరంలోని మహారాజ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో సమావేశమయ్యారు. ఉచిత చికిత్స, నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు.

డెంకాడ మండలంలోని గుణుపూరుపేట సమీపంలో లారీను ఢీ కొట్టడంతో పోతయ్య పాలెం గ్రామానికి చెందిన యువకుడు కోరాడ సురేంద్ర గురువారం మృతి చెందాడు. డెంకాడ నుంచి తన ద్విచక్రవాహనంపై స్వగ్రామం వెళుతుండగా ఐరన్ లోడుతో వెళుతున్న లారీను వెనుక నుంచి బలంగా ఢీ కొట్టడంతో ఇనుప చువ్వలు తలలో గుచ్చుకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్ఐ సన్యాసినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తెలుగు భాషకు వాడుక పదజాలాన్ని జోడించి తన రచనలను సామాన్యులకు దగ్గర చేశారు మహాకవి గురజాడ అప్పారావు. అప్పటి సాంఘిక పరిస్థితులకు అద్దం పట్టే విధంగా స్థానిక మాండలికంలో రాసిన ‘కన్యాశుల్కం’ నాటకం నేటికీ నిత్యనూతనం. ‘దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్’ అనే దేశభక్తి గీతంతో తెలుగు భాషకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చారు. నేడు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గురజాడ జ్ఞాపకం తెచ్చుకోవడం సందర్భోచితం.
Sorry, no posts matched your criteria.