Vizianagaram

News April 14, 2024

VZM: సీఎం జగన్‌పై దాడిని ఖండించిన కోలగట్ల

image

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిన్న జరిగిన దాడిని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఖండించారు. ప్రతిపక్షాలు చేసిన పిరికిపంద చర్యగా అభివర్ణించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి జరగడం హేయమైన చర్య అన్నారు. చేతకానితనంతో చేసే దాష్టీక చర్యగా పేర్కొన్నారు.

News April 14, 2024

ప్రజాదరణ చూసి ఓర్వలేక దాడి: జడ్పీ ఛై‌ర్మన్

image

విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్‌పై రాయితో దాడి చేసిన ఘటనపై జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు స్పందించారు. మళ్లీ జగన్ సీఎం కాబోతున్నారని, సిద్ధం సభకు వచ్చిన ప్రజాదరణ చూసి ఓర్వలేకనే ఈ దాడికి పాల్పడినట్లు ఆరోపించారు. రాజ్యాంగ బద్ధంగా అధికారంలోకి రావాలే కానీ.. జగన్‌ను భౌతికంగా దూరం చేసి అధికారంలోకి రావాలన్న ఆలోచన మంచి విధానం కాదన్నారు. మరో 30 ఏళ్లు జగన్ ప్రజల గుండెల్లో ఉంటారన్నారు.

News April 14, 2024

విజయనగరం: నాగార్జున అడుగులు ఎటువైపు..?

image

ఉన్నత చదువులు చదివి రాజకీయాల మీద ఆసక్తితో గత ఎన్నికల సమయంలో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగారు కిమిడి నాగార్జున. కష్ట కాలంలో టీడీపీకి సేవ చేసిన ఆయనకు చివరికి మిగిలింది ఏమీ లేదని.. కనీసం ఈసారి పార్టీ తరఫున టికెట్ కూడా దక్కలేదని ఉమ్మడి జిల్లాలో ఆయన అభిమానులు చర్చించుకుంటున్నారు. నాగార్జున రాజకీయ భవితవ్యం ఏమిటని.. ఆయన అడుగులు ఎటువైపు అన్న చర్చ అంతటా నడుస్తోంది.

News April 14, 2024

విజయనగరంలో భారీగా బంగారం పట్టివేత

image

ఎన్నికల సందర్భంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో విజయనగరం కన్యాకాపరమేశ్వరి ఆలయం దగ్గరలో నిన్న రాత్రి అన్నవరం ప్రాంతానికి చెందిన వ్యక్తి నుంచి భారీగా బంగారాన్ని 1టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేకపోవడంతో అతని వద్ద నుంచి 2.68 కేజీల బంగారు ఆభరణాలు, రూ.17,50,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పసిడి వ్యాపారస్థులకు సంభందించినదిగా పోలీసులు భావిస్తున్నారు.

News April 14, 2024

విజయనగరం: పాసింజర్ రైళ్లు పునరుద్ధరణ

image

ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖ-భవానిపట్నం-విశాఖ ప్యాసింజర్ రైళ్ల సేవలను పునరుద్ధరిస్తున్నట్లు వాల్తేరు డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. సంబల్పూర్ డివిజన్‌లో భద్రతాపరమైన ఆధునీకరణ పనులు కారణంగా రద్దయిన ఈ రైళ్లను విశాఖ-రాయగడ-విశాఖ మధ్య నడపనున్నట్లు తెలిపారు. ఈనెల 15 నుంచి 24 వరకు విశాఖ-రాయగడ మధ్య ఈనెల 16 నుంచి 25 వరకు రాయగడ- విశాఖ మధ్య ఈ రైళ్లు నడుస్తాయని తెలిపారు.

News April 14, 2024

VZM: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పర్యటన వాయిదా..!

image

విజయనగరంలో ఈనెల 16న జరగాల్సిన ప్రజాగళం కార్యక్రమం వాయిదా పడినట్లు టీడీపీ కార్యాలయం వెల్లడించింది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొనాల్సి ఉండగా.. అనివార్యకారణాలు వలన రావడం లేదని పేర్కొంది. అయితే రేపు రాజాంలో జరిగే సభలో చంద్రబాబు పాల్గొంటారు. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి విశాఖ ఎయిర్ పోర్టుకు.. అక్కడ నుంచి హెలికాప్టర్‌లో రాజాం వస్తారు. అంబేడ్కర్ కూడలిలో సా.3గంటలకు జరిగే సభలో పాల్గొంటారు.

News April 14, 2024

పోలింగ్ పటిష్ఠంగా నిర్వహించాలి: కలెక్టర్ నిశాంత్ కుమార్

image

పోలింగ్ పటిష్ఠంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ అన్నారు. సాధారణ ఎన్నికల నిర్వహణలో లోపాలు, నిర్లక్ష్యం లేకుండా ప్రశాంతంగా జరిగేందుకు శిక్షణను సద్వినియోగం చేసుకుని సమర్థంగా విధులు నిర్వహించాలని ప్రిసైడింగ్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సాలూరు ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు అందిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించారు.

News April 13, 2024

కొత్తవలస: ఎమ్మార్వో కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ మృతి

image

కొత్తవలస ఎమ్మార్వో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న షేక్ ఇబ్రహీం (33) శనివారం సాయంత్రం మృతి చెందారు. కొత్తవలస కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా ఎనిమిది నెలల క్రితమే విధుల్లోకి వచ్చారు. అనారోగ్య కారణంగా రెండు రోజులుగా విశాఖలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఎమ్మార్వో సిబ్బంది అతని కుటుంబానికి సంతాపం తెలిపారు.

News April 13, 2024

ఈవీఎంల కేటాయింపును పరిశీలించిన కలెక్టర్ నాగలక్ష్మి

image

స్థానిక ఈవీఎం గోదాములో నిర్వహిస్తున్న ఈవీఎంల కేటాయింపు ప్రక్రియను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి శనివారం పరిశీలించారు. ర్యాండమైజేషన్ ద్వారా ఈవిఎంలను వివిధ నియోజక వర్గాలకు ఇప్పటికే కేటాయించిన విషయం తెలిసిందే. నియోజకవర్గాలకు వచ్చిన ఈవీఎం సీరియల్ నంబర్ల ప్రకారం, వాటిని ఆయా నియోజకవర్గాల వారీగా వేరుచేసి, స్కానింగ్ చేసే కార్యక్రమం ప్రస్తుతం జరుగుతోంది.

News April 13, 2024

విశాఖ: రాళ్లతో కొట్టి యువకుడి దారుణ హత్య

image

విశాఖపట్నం అరిలోవ కృష్ణపురంలో యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. యువకుడిని రాళ్లతో కొట్టి గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. మృతదేహాన్ని గమనించిన స్థానికులు సమాచారాన్ని పోలీసులకు అందజేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.