India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరం జిల్లాలో చంద్రబాబు పర్యటన తేదీలు ఖరారైనట్లు టీడీపీ నాయకులు తెలిపారు. ఈనెల 15న రాజాంలో సాయంత్రం 3గంటలకు జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. మరుసటి రోజు విజయనరగంలో సాయంత్రం 4 గంటలకు, నెల్లిమర్ల ప్రధాన కూడలిలిలో రాత్రి 7 గంటలకు జరిగే సభల్లో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పాల్గొనున్నట్లు వెల్లడించారు. కాగా.. అభ్యర్థుల ప్రకటన అనంతరం మొదటిసారి వీరు జిల్లాకు వస్తున్నారు.
విజయనగరం కలెక్టరేట్‌లోని ఎన్నికల కంట్రోల్ రూమ్‌ని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి గురువారం సందర్శించారు. వివిధ విభాగాల కార్యకలాపాలను పరిశీలించారు. నమోదు చేసిన కేసులను, తీసుకున్న చర్యలను జిల్లా కలెక్టర్‌కు సీపీఓ పి.బాలాజీ, నోడల్ అధికారి డాక్టర్ సత్య ప్రసాద్ వివరించారు. జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్, డిఆర్ఓ ఎస్‌డి అనిత పాల్గొన్నారు.
ఆటో బోల్తా పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన పార్వతీపురం మండలం హెచ్ కారడవలస గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. పార్వతీపురం రూరల్ ఎస్సై దినకర్ తెలిపిన వివరాల ప్రకారం.. తాళ్ల బురిడీ గ్రామం నుంచి నిడగల్లు గ్రామానికి వెళుతున్న ఆటో కారాడవలస సమీపంలో బోల్తా పడిందన్నారు. ఈ ఘటనలో పైలా సింహాచలం (67) మృతి చెందినట్లు ఆయన తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించామన్నారు.
అనుమానాస్పద స్థితిలో ఉపాధి హామీ ఉద్యోగి మృతి చెందిన ఘటన మన్యం జిల్లాలో చోటు చేసుకుంది. పాచిపెంట మండల కేంద్రానికి చెందిన డోలా శంకరరావు పాచిపెంట ఉపాధి హామీలో టెక్నీకల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. గురువారం ఉదయం పారమ్మకొండ సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న కాలువ దగ్గర అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీంచారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
ఈ ఏడాది ఇంటర్ ఫలితాలు రికార్డు స్థాయిలో మూల్యాంకనం పూర్తయిన వారం రోజుల లోపే విడుదల కానున్నాయి. అయితే పరీక్షలు నిరాటంకంగా జరిపించిన అధ్యాపకుల సేవలు మాత్రం ఇంటర్ బోర్డు విస్మరించిందని అధ్యాపకులు వాపోతున్నారు. ఫిబ్రవరిలో జరిగిన ప్రాక్టికల్స్ రెమ్యూనరేషన్ గానీ, మార్చిలో జరిగిన పరీక్షల ఇన్విజిలేషన్ రెమ్యూనరేషన్ గానీ అనంతరం జరిగిన పేపర్ల మూల్యాంకనం రెమ్యూనరేషన్ గానీ తమకి అందకపోవడం దారుణమని అంటున్నారు.
ప్రీ-నాన్ -ఇంటర్లాకింగ్, నాన్ -ఇంటర్లాకింగ్ పనుల కారణంగా పలు రైళ్లు రద్దు చేస్తునట్లు స్టేషన్ సూపరిండెంట్ శ్రీనివాసరావు తెలిపారు. 08527 విశాఖ- రాయ్‌పూర్, 08528 రాయ్‌పూర్ -విశాఖ, 08504 విశాఖ-భవానీపట్నం ప్యాసింజర్, 18301 సంబల్పూర్ – రాయగడ, 18302 రాయగడ -సంబల్పూర్ ఇంటర్ సిటీని ఈనెల 15 నుంచి 24వ తేదీ వరకు.. 08503 భవానీపట్న-విశాఖ ప్యాసింజర్ ఈనెల 16 నుంచి 25వ వరకు రద్దు చేసినట్ల వెల్లడించారు.
ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారం విజయనగరం జిల్లా కేంద్రంలో వెలసిన శ్రీ పైడితల్లి అమ్మవారిని బుధవారం ఉదయం సూర్య కిరణాలు తాకాయి. రైల్వేస్టేషన్ సమీపంలోని ఉన్న వనం గుడిలో అమ్మవారిని సూర్య కిరణాలు తాకడంతో అమ్మ వారిని చూసేందుకు భక్తులు పోటెత్తారు. అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దత్తిరాజేరు మండలం మరడాం గ్రామ సమీపంలోని మామాడి తోటలో బుధవారం మధ్యాహ్నం ఓ వృద్ధులు మృతి చెందాడు. వంగర గ్రామానికి చెందిన చుక్క రామన్న గత కొంతకాలంగా మతిస్తిమితం లేకుండా తిరుగుతున్నాడని స్టేషన్ బూర్జివలస ఎస్.ఐ లక్ష్మీప్రసన్న కుమార్ తెలిపారు. వడదెబ్బకు మృతి చెంది ఉండొచ్చని, మృతదేహాన్ని కుటుంబ సభ్యులు స్వగ్రామం తరలించినట్లు వెల్లడించారు.
బాలికను మోసం చేసి శారీరకంగా లోబరుచుకుని యువకునిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై దినకర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం.. పార్వతీపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన పెంటకోట ప్రవీణ్ కుమార్ మాయమాటలు చెప్పి శారీరకంగా లోబరుచుకున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్.ఐ తెలిపారు.
రక్త హీనతపై ప్రజల్లో సంపూర్ణ అవగాహన ఉండాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. 10 ఏళ్ల లోపు పిల్లల్లో మరణాల రేటు నివారణ కార్యక్రమం ( ప్రాజెక్టు ఫర్ రిడక్షన్ ఆఫ్ ఇన్ఫాంట్ మోర్టాలిటి రేట్ బిలో 10)పై వైద్య అధికారులు, మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బందితో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 10 ఏళ్ల లోపు పిల్లల్లో మరణాల రేటు నివారణకు ముఖ్యంగా రక్త హీనత నివారణపై దృష్టి సారించాలన్నారు.
Sorry, no posts matched your criteria.