India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బొబ్బిలి – సీతానగరం రైల్వేస్టేషన్ల మధ్య చిన భోగిలి సమీపంలో, బుధవారం గుర్తు తెలియని మృతదేహాం లభ్యమయ్యిందని బొబ్బిలి జీఆర్పీ హెచ్సీ ఈశ్వరరావు తెలిపారు. ట్రైన్ నుంచి జారిపడి మృతిచెందారా, లేదా పట్టాలు దాటే క్రమంలో ట్రైన్ ఢీకొనడంతో ఈ ఘటన జరిగందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేశామన్నారు.
ఇంటింటి ఎన్నికల ప్రచారం, పాంప్లెట్ల పంపిణీ గురించి ముందుగా సంబంధిత పోలీసు స్టేషన్‌లో సమాచారం ఇస్తే సరిపోతుందని, ప్రత్యేకంగా వీటికోసం అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి స్పష్టం చేశారు. తన ఛాంబర్‌లో బుధవారం నిర్వహించిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ నుంచి తాజాగా వచ్చిన మార్గదర్శకాలను వివరించారు.
పార్వతీపురంలో ఎటువంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న పశువుల వ్యాన్ సీజ్ చేసినట్లు పార్వతీపురం తహశీల్దార్ కె.ఆనందరావు తెలిపారు. స్థానిక ఎస్సై సంతోషి కుమారితో పార్వతీపురంలో బుధవారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ వ్యాన్‌లో అనుమతులు లేకుండా పశువుల రవాణా చేస్తున్నట్లు గుర్తించి.. వాహనాన్ని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో రెవెన్యూ ఇనస్పెక్టర్ వి.రామకృష్ణ ఉన్నారు.
పండగ పూట అత్తారింటికి వెళ్తూ ఓ వ్యక్తి మృతి చెందిన విషాదకర ఘటన బలిజిపేట మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ పాపారావు తెలిపిన వివరాల ప్రకారం.. వెంగాపురం గ్రామానికి చెందిన ఎస్.సంగమెశ్ (24) మంగళవారం మిర్తివలస అత్తవారింటికి వెళ్తుండగా బైక్‌ని, లారీ బలంగా ఢీ కొట్టింది. తీవ్రగాయలైన సంగమేశ్‌ను కుటుంబ సభ్యులు విజయనగరం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు.
శ్రీరామనవమి సందర్భంగా విజయనగరం నుంచి భద్రాచలం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సు ఏర్పాటు చేస్తున్నట్లు డిపో ప్రబంధకుడు శ్రీనివాసరావు తెలిపారు. ఈనెల 16న సాయంత్రం 4.30 గంటలకు విజయనగరం డిపో నుంచి బస్సు బయల్దేరి, ఆదివారం ఉదయం 5 గంటలకు అక్కడికి చేరుకుంటుందన్నారు. అదేరోజు సాయంత్రం 5 గంటలకు తిరిగి బయల్దేరి సోమవారం ఉదయం 5.30 గంటలకు ఇక్కడకు వస్తుందని చెప్పారు.
మండల పరిధిలోని ఆరికతోట గ్రామానికి చెందిన సుమారు 80 కుటుంబాలు మాజీ సర్పంచ్ పెంకి భీమయ్య ఆధ్వర్యంలో వైసీపీలో చేరాయి. స్థానిక మండల వైసీపీ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, ఎంపీపీ చొక్కాపు లక్ష్మణరావు సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. పార్టీలో చేరిన వ్యక్తులు మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం టీడీపీ నాయకులు ప్రలోభాలకు గురిచేసి కండువాలు వేయించి పార్టీలో చేర్చారని చెప్పారు.
విజయనగరం పట్టణంలో వెలసిన శ్రీ దేవీ దండుమారమ్మ దేవాలయంలో అమ్మవారి ఉత్సవాలను ఏప్రిల్ 9 నుంచి 16 వరకు నిర్వహిస్తున్నట్లుగా ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మంగళవారం విజయనగరం జిల్లా ఎస్పీ ఎం. దీపికా పాటిల్, మన్యం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ దంపతులు పాల్గొని, జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఎస్పీ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉమ్మడి విజయనగరం జిల్లాలో 2019 ఎన్నికలలో నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతం ఇలా ఉంది. కురపాం-77.7, పార్వతీపురం- 76.9, సాలూరు-79.4, బొబ్బిలి-78.9, చీపురుపల్లి-83.3, గజపతినగరం-86.9, నెల్లిమర్ల-87.9, ఎస్.కోట-86.1 శాతంగా నమోదు కాగా విజయనగరంలో అత్యల్పంగా 70.8 శాతం నమోదయ్యింది. ఈ సారి ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారో కామెంట్ చేయండి.
శ్రీ క్రోధి నామ నూతన సంవత్సరం ఉగాది వేడుకలు దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. జాయింటు కలెక్టర్ ఎస్.ఎస్.శోబిక జ్యోతి ప్రజ్వలన చేసి ఉగాది వేడుకలను ప్రారంభించారు. శ్రీ క్రోధి నామ నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలకు అన్ని విధాలా మేలు జరగాలని, అన్ని కుటుంబాలు ఆయురారోగ్య, అష్టైశ్వర్యాలు కలగాలని జాయింటు కలెక్టర్ ఆకాక్షించారు.
సాలూరులో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని ఉగాది పర్వదినం సందర్భంగా బంగారు చీరతో అలంకరించారు. సుమారు 1500 గ్రాముల బంగారు తాపడంతో ప్రత్యేకంగా రూపొందించిన ఈ బంగారు చీరలో తల్లి ప్రత్యేక ఆకర్షణగా నిలిచి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాల నుంచి అధిక మొత్తంలో భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
Sorry, no posts matched your criteria.