Vizianagaram

News April 9, 2024

విజయనగరం నుంచి భద్రాచలానికి ప్రత్యేక బస్సులు

image

శ్రీరామనవమిని పురస్కరించుకుని భద్రాచలం సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవానికి హాజరయ్యే భక్తుల కోసం ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్టు విజయనగరం డిపో మేనేజరు జే.శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. ఈ సర్వీసు ఏప్రిల్ 16 సాయంత్రం 4.30 నుంచి బయలుదేరునని, టిక్కెట్లు కావలసినవారు WWW.APSRTCONLINE.IN ద్వారా అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకోవచ్చునని తెలిపారు.

News April 9, 2024

ఉగాది స్పెషల్.. పైడితల్లమ్మకు ప్రత్యేక అలంకరణ

image

శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది సందర్బంగా విజయనగరం ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లమ్మకు చదురుగుడిలో వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజాము నుంచి పంచామృతాభిషేకాలు, పూజలు నిర్వహించారు. నైవేద్యంగా బూరెలు, అరెసెలు, పండ్లు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు.

News April 9, 2024

విజయనగరం: సంగీత, నృత్య కళాశాలలో ప్రవేశాలు

image

విజయనగరంలోని మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలో సర్టిఫికెట్, డిప్లమో కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కేఏవీఎల్ఎన్ . శాస్త్రి బుధవారం తెలిపారు. భారతీయ సంస్కృతి, కళల పట్ల అవగాహన కలిగించి ఆకర్షితులను చేసే ఉద్దేశంతో సంగీత కళాశాలలో నాలుగేళ్ల సర్టిఫికెట్ కోర్సు, రెండేళ్ల డిప్లమో కోర్సులను నిర్వహిస్తున్నామన్నారు.

News April 9, 2024

విజయనగరంలో రూ.9.30 లక్షల వెండి సీజ్

image

విజయనగరం పట్టణంలోని గంట స్తంభం సమీపంలో సోమవారం ఎటువంటి పత్రాలు లేకుండా ఓ వ్యక్తి వద్ద ఉన్న 14.405 కిలోల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నామని 1వ పట్టణ సీఐ వెంకట్రావు తెలిపారు. వెండి వస్తువులకు ఎటువంటి పత్రాలు లేకపోవడంతో తదుపరి చర్యల నిమిత్తం తహశీల్దార్‌కు అప్పగించామని చెప్పారు. సీజ్ చేసిన వెండి వస్తువుల విలువ సుమారు రూ.9.30 లక్షలు ఉంటుందని తెలిపారు.

News April 9, 2024

ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి:కలెక్టర్

image

ఎన్నికల విధుల్లో వైఫల్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ హెచ్చరించారు. సోమవారం మన్యం జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణకు పూర్తి స్థాయి సంసిద్ధత ఉండాలన్నారు. వచ్చే పది రోజులు కీలకమని, ప్రతి అంశంపై శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై వచ్చే ప్రతి అంశాన్ని పరిశీలించాలన్నారు.

News April 8, 2024

నెల్లిమర్ల: పేదవానికి షాకిచ్చిన విద్యుత్ బిల్లు

image

నెల్లిమర్ల మండలం కొండగుంపాంలో పెన్షన్‌తో జీవనం సాగిస్తున్న సతివాడ రాములమ్మకి విద్యుత్ బిల్లు షాకిచ్చింది. సర్వీసు నెంబరు 759కి నెల బిల్లు రూ.44718 వచ్చింది. సోమవారం రీడింగ్ సిబ్బంది రాములమ్మ కొడుకు కాంతరావుకు బిల్లు అందజేశారు. దీంతో ఆయన బిల్లు చూసి ఆశ్చర్య పోయారు. వెంటనే సచివాలయానికి వెళ్లి బిల్లు కోసం తెలియజేయగా విద్యుత్ శాఖ కార్యాలయానికి వెళ్లాలని సలహా ఇచ్చారు.

News April 8, 2024

విజయనగరం: 209 మంది వాలంటీర్ల రాజీనామా

image

విజయనగరం జిల్లాలో వాలంటీర్ల రాజీనామాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 209 మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా సోమవారం భోగాపురం మండలంలో 18 మంది, కొత్తవలసలో 27 మంది, కొప్పెర్లలో11 మంది మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. వారి రిజైన్ లెటర్స్‌ని పంచాయతీ కార్యదర్శికి అందజేశారు.

News April 8, 2024

అక్ర‌మ న‌గ‌దు ర‌వాణపై నిఘా పెంచండి: కలెక్టర్

image

ఎన్నిక‌ల సంద‌ర్భంగా అక్ర‌మ న‌గ‌దు లావాదేవీలు, ర‌వాణా జ‌ర‌గ‌కుండా నిఘా పెంచాల‌ని వివిధ శాఖ‌ల జిల్లా అధికారుల‌ను, విజయనగరం జిల్లా ఎన్నిక‌ల అధికారి నాగ‌ల‌క్ష్మి ఆదేశించారు. జిల్లా స్థాయి విజిలెన్స్‌, ఇఎస్ఎంఎస్‌ (ఎల‌క్ష‌న్ సీజ‌ర్ మేనేజ్‌మెంట్ సిస్ట‌మ్‌) నోడ‌ల్ ఆఫీస‌ర్ల స‌మావేశాన్ని క‌లెక్ట‌ర్‌ త‌న ఛాంబ‌ర్‌లో సోమ‌వారం నిర్వ‌హించారు. సీజ‌ర్స్ పెంచి అక్ర‌మాల‌కు అడ్డుక‌ట్ట వేయాల‌ని సూచించారు.

News April 8, 2024

పార్వతీపురం: ఎన్నికల విధుల్లో వైఫల్యాలకు కఠిన చర్యలు

image

ఎన్నికల విధుల్లో వైఫల్యాలకు కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ హెచ్చరించారు. రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, మండల పరిషత్ అభివృద్ది అధికారులతో జిల్లా కలెక్టరు కార్యాలయంలో ఎన్నికలపై జిల్లా ఎన్నికల అధికారి శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు పూర్తి స్థాయి సంసిద్ధత ఉండాలన్నారు.

News April 8, 2024

తోటపల్లి కాలువలో మృతదేహం

image

గరుగుబిల్లి మండలం తోటపల్లి డ్యామ్ ఎడమ కాలువ వద్ద సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహన్ని గుర్తించినట్లు స్థానిక ఎస్ఐ తెలిపారు. మృతి చెందిన వ్యక్తి వయస్సు సుమారు 50 నుంచి 55 సంవత్సరాలు ఉంటుందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. మృతి చెందిన వ్యక్తి సమాచారం తెలిసిన వారు పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.