India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖ జూలో 24వ తేదీ అర్ధరాత్రి బెకన్ అనే మగ <<12921248>>జిరాఫీ<<>> మృతి చెందడంపై క్యూరేటర్ నందిని సలారియ వివరణ ఇచ్చారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం కార్డియో-పల్మనరీ ఫెయిల్యూర్ కారణంగా జిరాఫీ మృతి చెందిందన్నారు. సంవత్సర కాలంగా జిరాఫీకి చికిత్స అందిస్తున్నామన్నారు. చికిత్స కోసం జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైల్డ్ లైఫ్ వెటర్నరీ వైద్యులను నిపుణులను సంప్రదించినా లాభంలేకపోయిందన్నారు.
బొబ్బిలి MLAపై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు నమోదయ్యింది. అనుమతులు లేకుండా ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడుతో పాటు మరికొంత మంది వైసీపీ నాయకులపై ఎన్నికల అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. చిత్రకోట, బొడ్డవలస పంచాయతీలోని ఎంసీసీ కోడ్‌కు వ్యతిరేకంగా పార్టీ ప్రచారం చేస్తున్నారన్న అభియోగంపై ఏఆర్‌ఓ, RDO సాయి శ్రీ ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు S.I తెలిపారు.
1952 నాటి నుంచి 2019 వరకు ఎస్.కోట నియోజకవర్గంలో17 సార్లు జరిగిన సాధారణ ఎన్నికల్లో ఇద్దరు మహిళలు మాత్రమే గెలుపొందారు. 1999లో టీడీపీ నుంచి తొలిసారిగా శోభా హైమావతి కాంగ్రెస్ అభ్యర్థి గంగాధర స్వామి శెట్టిపై విజయం సాధించారు. టీడీపీ నుంచి కోళ్ల లలిత కుమారి 2009లో కాంగ్రెస్ అభ్యర్థి ఏ.జోగినాయుడు, 2014లో వైసీపీ అభ్యర్థి రొంగలి జగన్నాథంపై విజయం సాధించారు.
టీడీపీ మీద ఉన్న అభిమానన్ని ఓ వ్యక్తి కొత్తగా పంచుకున్నారు. బలిజపేట మండలానికి బసన్నారాయువలస గ్రామానికి కృష్ణారావు వివాహం మార్చి 24 ఆదివారం జరిగింది. టీడీపీ సూపర్ సిక్స్ పథకాల వివరాలను పెళ్లి కార్డుపై ముద్రించి బంధువులకు అందించారు. పథకాలతో పాటు చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ బొబ్బిలి, పార్వతీపురం తెదేపా అభ్యర్థుల చిత్రాలను ముద్రించారు. ప్రస్తుతం ఈ పత్రిక వైరల్‌గా మారింది.
ఎస్‌కోట నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. YCP ఎమ్మెల్యే అభ్యర్థిగా కడుబండి శ్రీనివాసరావు పోటీలో ఉండగా, TDP నుంచి కోళ్ల లలిత కుమారి బరిలో ఉన్నారు. ఇదిలా ఉంటే TDP నుండి టికెట్ ఆశించి భంగపడిన గొంపకృష్ణ ఆవేదన వ్యక్తం చేస్తూ అభిమానులు, నాయకులు ఆదేశిస్తే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ఆదివారం జరిగిన బహిరంగసభలో ప్రకటించడంతో ఎస్‌కోటలో త్రిముఖ పోటీ ఖాయమని స్థానికులు అంటున్నారు. దీనిపై మీ కామెంట్?
పొత్తులో భాగంగా విజయనగరం లోక్‌సభ సీటు తొలుత BJP ఆశించింది. నిన్న ఆ పార్టీ ఆరుగురు MP అభ్యర్థులను ప్రకటించి.. విజయనగరానికి బదులు రాజంపేటలో మాజీ CM కిరణ్ కుమార్‌ను బరిలో నిలిపింది. దీంతో విజయనగరం నుంచి TDP పోటీ ఖరారైనట్లే. ఇక్కడి నుంచి కిమిడి కళా వెంకట్రావు, కిమిడి నాగార్జున పేర్లను అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ఈ టికెట్ నర్సాపురం MP రఘురామరాజు ఆశిస్తున్నట్లు టాక్ నడుస్తోంది.
జియ్యమ్మవలస మండలంలోని వెంకటరాజుపురం, గవరమ్మపేట గ్రామాల మధ్య ఏనుగులు సంచరిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో అరటి, మొక్కజొన్న, వరి పంటలను నాశనం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఏనుగులతో పరిసర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీ అధికారులు సూచిస్తున్నారు.
TDP-జనసేన-BJP ఉమ్మడి అభ్యర్థిగా అరకు ఎంపీ స్థానానికి కొత్తపల్లి గీతను BJP అధిష్ఠానం ఖరారు చేసింది. 2014లో లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ తరఫున అరకు ఎంపీగా కొత్తపల్లి గీత గెలిచింది. తరువాత వైసీపీని వీడి బీజేపీలో చేరారు. అదే సందర్భంలో ఆమెపై పలు అవినీతి ఆరోపణలు రాగా.. కోర్టులో సదరు అభియోగాలపై గీతకు అనుకూలంగా తీర్పు వచ్చింది. కాగా.. వైసీపీ తరఫున అరకు ఎంపీ అభ్యర్థిగా చెట్టి తనూజ రాణి బరిలో ఉన్నారు.
బొండపల్లి మండలంలోని గ్రహపతి అగ్రహారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందినట్లు బొండపల్లి ఎస్.ఐ కె.లక్ష్మణరావు ఆదివారం సాయంత్రం విలేకరులకు తెలిపారు. గ్రామానికి చెందిన నమ్మి గౌరి నాయుడు బహిర్భూమికి రోడ్డుపై రాగా రెల్లిపేటకు చెందిన వ్యక్తి ద్విచక్ర వాహనంపై వస్తూ ఢీకొట్టాడు. 108 వాహనం వచ్చేసరికి గౌరినాయుడు మృతి చెందినట్లు తెలిపారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
విజయనగరం ఎంపీ, చీపురుపల్లి ఎమ్మెల్యే స్థానాల్లో టీడీపీ తరఫున ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తొలుత ఎంపీ టికెట్ బీజేపీకి వెళ్తుందనే ప్రచారం సాగింది. తాజాగా విజయనగరం సీటు టీడీపీకి కేటాయిస్తారని వార్తలు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆశావహుల్లో ఒకరైన మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్ ఇప్పటికే చంద్రబాబు వద్దకు వెళ్లినట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.