Vizianagaram

News May 13, 2024

ఓటు వేసిన విజయనగరం జిల్లా ఎస్పీ దీపిక

image

విజయనగరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక సోమవారం విజయనగరం పట్టణం తోటపాలెంలో గల ఎం.ఎస్.ఎన్. కళాశాల పోలింగు కేంద్రంలో సామాన్య ఓటర్లతో పాటు క్యూ లైనులో నిలబడి, తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ కూడ రాజ్యాంగబద్ధమైన తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు.

News May 13, 2024

మాక్ పోలింగ్‌ని పర్యవేక్షించిన కలెక్టర్

image

విజయనగరం కలెక్టర్ కార్యాలయంలోని ఎన్నికల కంట్రోల్ రూం నుంచి మాక్ పోలింగ్‌ను కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి పర్యవేక్షణ చేస్తున్నారు. ఉదయం 5-45 గంటలకే జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్‌ల సమక్షంలో ప్రారంభమైన మాక్ పోలింగ్ నిర్వహించామని అధికారులు తెలిపారు. ఎన్నికల సజావుగా సాగేందుకు అన్నీ ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.

News May 13, 2024

ఉమ్మడి విజయనగరం జిల్లాలో మాక్ పోలింగ్

image

విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలో మాక్ పోలింగ్ మొదలైంది. పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో అధికారులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పోలింగ్ సమయానికి 90 నిమిషాల ముందు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. కొన్ని చోట్ల ఏజెంట్లు రాకపోవడంతో మాక్ పోలింగ్‌ ఆలస్యమైంది. ఈ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కురుపాం, సాలూరు, పాలకొండలో గంట మందే పోలింగ్ ముగియనుంది.

News May 13, 2024

పోలింగ్‌ సాఫీగా జరిగేందుకు ఏర్పాట్లు పూర్తి: విజయనగరం కలెక్టర్

image

విజయనగరం జిల్లాలో సోమవారం జరగనున్న లోక్‌సభ, అసెంబ్లీ సాధారణ ఎన్నికల పోలింగ్‌ సాఫీగా జరిగేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి చెప్పారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాలకు పోలింగ్‌ సిబ్బంది ఆదివారం చేరుకున్నారని తెలిపారు. అన్ని మౌళిక వసతులు కల్పించినట్లు తెలిపారు.

News May 12, 2024

PDMS యాప్‌లో పోలింగ్ శాతం నమోదు: కలెక్టర్ నాగలక్ష్మి

image

సాధారణ ఎన్నికల పోలింగ్ సందర్భంగా జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతం సేకరించేందుకు, విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశాల మేరకు ప్రత్యక ఏర్పాట్లు చేశారు. పోల్ డే మేనేజ్ మెంట్ సిస్టం అనే యాప్ ద్వారా పోలింగ్ రోజు ప్రతి రెండు గంటలకు ఆయా నియోజకవర్గాల నుంచి పోలింగ్ శాతం నమోదు చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు.

News May 12, 2024

226 రూట్లు.. 385 బ‌స్సులు: కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి

image

ఎన్నిక‌ల ప్ర‌క్రియ కోసం సిబ్బందిని, సామ‌గ్రిని త‌ర‌లించడానికి విజయనగరం జిల్లా వ్యాప్తంగా 226 రూట్ల‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఈ రూట్ల‌లో 120 ఆర్టీసీ బ‌స్సులు, 265 మినీ బ‌స్సుల‌ను వినియోగిస్తున్నామన్నారు. ఇవి కాకుండా ఎన్నిక‌ల అధికారుల‌కు కార్లు, వ్యాన్‌లు త‌దిత‌ర‌ ఇత‌ర వాహ‌నాల‌ను స‌మ‌కూర్చారు. మొత్తం 225 మంది సెక్టార్ అధికారులు ఈ రూట్ల‌ను ప‌ర్య‌వేక్షించ‌నున్నట్ల తెలిపారు.

News May 12, 2024

రామభద్రపురం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

వ్యాన్ ఢీకొట్టి వ్యక్తి మృతి చెందిన ఘటన రామభద్రపురం మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై జ్ఞాన ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. ముచ్చర్లవలస గ్రామానికి చెందిన బొడ్డు జగన్ మోహన్ రావు(48) బైక్‌పై వస్తుండగా, ఆరికతోట సమీపంలో నేషనల్ హైవేపై వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో జగన్ మోహన్ రావు అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

News May 12, 2024

విజయనగరం: ఎలక్షన్@2024.. మూడు జిల్లాల ముచ్చట

image

విజయనగరం జిల్లాలో ఉన్న ఎస్.కోట నియోజకవర్గ ప్రజలు విశాఖ ఎంపీ అభ్యర్థికి ఓటు వేయాల్సి ఉండగా.. శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రజలు విజయనగరం ఎంపీ స్థానానికి ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. అటు అల్లూరి జిల్లాలో ఉన్న అరకు ఎంపీ అభ్యర్థికి పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ, పార్వతీపురం, కురుపాం, సాలూరు నియోజకవర్గ ఓటర్లు తమ ఓటును వేస్తారు.

News May 12, 2024

ఓటర్లకు విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి విజ్ఞప్తి

image

ఇన్ ఎడిబుల్ ఇంక్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అన్నారు. ఈ ఇంక్ ఎవరూ కొనుగోలు చేసేందుకు, సేకరించేందుకు అందుబాటులో లభించదని స్పష్టం చేశారు. దేశంలో కేవలం ఒక చోట మాత్రమే దీని ఉత్పత్తి జరుగుతోందని, ఎన్నికల కమిషన్ మినహా ఇతరులు ఎవరూ దీనిని పొందే అవకాశం లేదన్నారు. అపోహలకు గురికాకుండా ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

News May 12, 2024

విజయనగరం: ఎలక్షన్@2024.. పోలింగ్ శాతం పెరిగేనా..?

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలోని నియోజకవర్గాల వారీగా 2019లో నమోదైన పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. కురుపాం-77.7%, పార్వతీపురం- 76.9%, సాలూరు- 79.4%, బొబ్బిలి- 78.9%,చీపురుపల్లి- 83.3%,గజపతినగరం- 86.9%, నెల్లిమర్ల- 87.9%, విజయనగరం- 70.8%, శృంగవరపుకోట- 86.1 శాతం నమోదైంది. మరి ఈ సంవత్సరం ఓటర్ల సంఖ్య పెరిగిన నేపథ్యంలో మీ నియోజకవర్గంలో పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా.