India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయనగరం ఎంపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడుని విజయాన్ని ఆకాంక్షిస్తూ ప్రధాని మోదీ లేఖ రాశారని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఆ లేఖను కలిశెట్టి విడుదల చేశారు. జర్నలిస్టుగా విజయనగరం అభివృద్ధి, సమస్యలపై లోతైనా అవగాహన ఉండటం, క్షేత్ర స్థాయిలో ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో రాజకీయాల్లోకి ప్రవేశించడం అభినందనీయమని లేఖలో పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేస్తారన్న నమ్మకం ఉందని పేర్కొన్నారు.
జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు SP విక్రాంత్ పాటిల్ తెలిపారు. 1150 మంది సిబ్బంది,6 కంపెనీల కేంద్ర బలగాలను, 56 స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు,138 మంది సెక్టార్ అధికారులను నియమించామన్నారు. చెప్పారు. 6,100 మందిపై బైండోవర్ నమోదు చేశామన్న ఆయన..అల్లర్లు సృష్టించే వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఇతర ప్రాంతాలకు చెందిన వారు జిల్లా విడిచి వెళ్లాలని స్పష్టం చేశారు.
సీతానగరం మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన గవర ముసలినాయుడు (సాయి)(24) భూపాలపల్లిలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. రామగుండంలోని ఓ కంపెనీలో పనిచేస్తున్న సాయి..శనివారం తన స్నేహితులను దిగబెట్టడానికి వరంగల్ బస్టాండ్‌కు బైక్‌పై వెళ్లాడు. బస్సు కోసం ఎదురుచూస్తున్న సమయంలో వారిని టిప్పర్ ఢీకొట్టింది. సాయితో పాటు అతని స్నేహితుడు కూడా మరణించాడు. వీరు ఓటేసేందుకు వస్తున్నట్లు సమాచారం.
జిల్లాలో ఎన్నికల విధులకు హాజరవుతున్న సిబ్బందికి మూడవ రాండమైజేషన్ పూర్తి చేశామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ తెలిపారు. పార్లమెంటరీ నియోజకవర్గ సాధారణ పరిశీలకులుగా ప్రమోద్ కుమార్ మెహర్డ సమక్షంలో శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాండమైజేషన్ ప్రక్రియను చేపట్టారు. ఈ ప్రక్రియ అనంతరం సంబంధిత రిటర్నింగ్ అధికారులకు సీల్డు కవర్‌లో పంపించడం జరుగుతుందని ఆయన తెలిపారు.
ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బందిని కేటాయించారు. జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు హనీష్ చాబ్రా, తలాత్ పర్వేజ్ ఇక్బాల్ రోహెల్లా, సీతారామ్ జాట్ సమక్షంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నాగలక్ష్మి కలెక్టరేట్ ఎన్ఐసీ కేంద్రంలో శనివారం ఈ ప్రక్రియ నిర్వహించారు.
ఎన్నికల సంగ్రామంలో ప్రచార ఘట్టం నేటితో ముగిసింది. నాయకులు కొద్దిరోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల మద్దతును కూడగట్టుకున్నారు. ప్రచారంలో విమర్శలు, హామీలతో తమదైన రీతిలో ఓట్లు అభ్యర్థించారు. అభ్యర్థుల కుటుంబీకులు సైతం ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఓటర్లు ఎవరికి మొగ్గుచూపుతారో వేచి చూడాల్సి ఉంది. మరి మీ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చెయ్యండి.
ఎన్నికల నేపథ్యంలో రెండు రోజులు మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు కేంద్రాలు మూసివేయనున్నట్లు జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి ఎన్వీ రమణ తెలిపారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశాల మేరకు 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 13వ తేదీ పోలింగ్ ముగిసే వరకు మూతపడతాయన్నారు. అనధికార మద్యం విక్రయాలు చేసినా.. నిల్వలు చేసినా.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మరో 48 గంటల్లో ఈవీఎంలపై బటన్ నొక్కేందుకు ఓటరు సిద్ధమవుతుండగా..వారిని ఆకర్షించేందుకు అభ్యర్థులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే బూత్‌ల వారీగా ఓటర్ల జాబితాను సేకరించి రూ.1000 నుంచి 1500 ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర ప్రాంతాల వారికి ఆన్‌లైన్ పేమెంట్ చెయ్యగా.. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ఇస్తున్నారు. పట్టణాల్లో టోకెన్ సిస్టం పెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తుండంతో అధికారులు నిఘా పెంచారు.
జియ్యమ్మవలస మండలం వెంకటరాజుపురం గ్రామానికి చెందిన బంటు లక్ష్మి(70)బహిర్భూమికి వెళ్ళగా అకస్మాత్తుగా కుక్కలు గుంపు వచ్చి ఆమెపై దాడి చేశాయి. శరీరమంతా ముక్కలుగా కొరకటంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఈ గ్రామంలో కొద్ది రోజులుగా కుక్కలు చాలామందిని గాయపరుస్తున్నాయి. అయినా అధికారులు చర్యలు తీసుకోవడంలేదని గ్రామస్థులు విమర్శిస్తున్నారు.
ఓటింగుకు 48 గంటలు మాత్రమే ఉండడంతో ప్రచార కార్యక్రమాలు శనివారం సాయంత్రం 6 గంటలతో ముగియనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. ఈ సమయం తర్వాత అభ్యర్థులు, వారి పక్షాన ఎవరైనా ప్రచారం చేస్తే నిబంధనలకు విరుద్ధం అవుతుందన్నారు. సాయంత్రం తర్వాత నుంచి ర్యాలీలు, సభలు, సమావేశాలు విందులు, లౌడ్ స్పీకర్లను నిషేధం విధించినట్లు కలెక్టర్ చెప్పారు.
Sorry, no posts matched your criteria.