India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చీపురుపల్లి బహిరంగ సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స స్పందించారు. పట్టణంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ‘నీ ఇంట్లో నలుగురు లేరా? నువ్వు…నీ కొడుకు.. నీ కొడుకు తోడల్లుడు..నీ బావ లేరా? కుటుంబ రాజకీయాలు నీవి కావా? నీకు ఏంటి స్పెషల్? నువ్వు ఏమైనా దైవ సంభూతిడివా?’ అంటూ ధ్వజమెత్తారు. ‘ఓడిపోయిన లోకేశ్‌ను తీసుకువచ్చి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసింది నువ్వు కాదా?’ అని ప్రశ్నించారు.
ఎన్నికల్లో కీలక ఘట్టమైన ప్రచార పర్వం మరో 24 గంటల్లో ముగియనుంది. ఇన్ని రోజులు పార్టీల అభ్యర్థుల విమర్శలు, ఆరోపణలు, హామీలు నడుమ ప్రచార హోరు కొనసాగింది. అభ్యర్థుల తరఫున సినీ ప్రముఖులు, స్టార్ క్యాంపెయినర్ల రాకతో ఉమ్మడి విజయనగరం జిల్లా నిత్యం వార్తల్లో నిలిచింది. మరికొన్ని గంటల్లోనే ప్రచారం ముగియనున్న నేపథ్యంలో ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు. మరికొన్నిచోట్ల డబ్బుల ప్రలోభాలకు తెరలేసింది.
ఒక లైట్, ఒక ఫ్యాన్ వాడుతున్న ఇంటికి వేలల్లో కరెంట్ బిల్లు వచ్చిన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. రామభద్రపురం మండలం కొట్టక్కికి చెందిన ఇష్టం వెంకమ్మ అనే ఒంటరి మహిళ తన కుమారుడుతో కలిసి నివసిస్తున్నారు. శుక్రవారం విద్యుత్ సిబ్బంది వచ్చి రీడింగ్ తియ్యగా రూ.37,484 బిల్లు వచ్చింది. దీంతో 1092 ఫిర్యాదు చెయ్యగా సమస్య పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు.
ఎంసీసీ నిఘా బృందాలైన ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీలు, ఎక్స్పెండిచర్ బృందాలు వాహనాల తనిఖీలలో, నగదు, మద్యం, వస్తువుల పంపిణీలపై దృష్టి పెట్టాలని జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఆదేశించారు. రానున్న మూడు రోజుల్లో చురుకుగా పని చేయాలన్నారు. ఎంసీసీ బృందాలు పక్షపాత రహితంగా పని చేయాలనీ సూచించారు. గురువారం కలెక్టర్ నాగలక్ష్మి వెబెక్స్ ద్వారా సమావేశం నిర్వహించి పలు సూచనలు జారీ చేశారు.
వైసీపీ అవినీతి, అరాచక, దోపిడి ప్రభుత్వానికి మే 13న ప్రజలు ఉరి వెయ్యాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. గురువారం విజయనగరం జిల్లా చీపురుపల్లిలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ.. మేం అధికారంలోకి రాగానే బాదుడు లేని సంక్షేమం అందిస్తాం, పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
విజయనగరం జీఆర్పీ పరిధిలో గజపతినగరం, గరుడబిల్లి రైల్వే ట్రాక్ మధ్యలో గుర్తు తెలియని మృతదేహం విజయనగరం రైల్వే పోలీసులు గురువారం గుర్తించారు. మృతుడు వయస్సు సుమారు 60 నుంచి 65 సంవత్సరములు ఉంటుందని వారు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
చీపురుపల్లిలోని బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. పదవులన్నీ బొత్స కుటుంబానికే కావాలని ఎద్దేవా చేశారు. సోదరుడు అప్పలనరసయ్య గజపతినగరం MLA, మేనల్లుడు శ్రీను జడ్పీ ఛైర్మన్, మరో తమ్ముడు బడ్డుకొండ నెల్లిమర్ల MLA, అతనికి చీపురుపల్లి, భార్య విశాఖ ఎంపీ అభ్యర్థి అన్నారు. ఉత్తరాంధ్రలో సమర్థులు లేరా అని ప్రశ్నించారు. కుటుంబ సభ్యులకు సీట్లు ఇచ్చినందుకు ఉత్తరాంధ్రను దోచుకున్నా మాట్లాడట్లేదన్నారు.
జగన్ మందు బాబుల రక్తం తాగాలనుకున్నాడని కురుపాం సభలో చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ హయాంలో రూ.60 ఉన్న క్వార్టర్ బాటిల్ ఇప్పుడు రూ.200 అయ్యిందని ఆరోపించారు. నాసిరకం మందు అమ్ముతూ ప్రజల ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నారని విమర్శించారు. కురుపాం కిల్లీ కొట్టులో ఉన్న ఆన్‌లైన్ పేమెంట్.. మందుషాపులో ఎందుకు లేదని ప్రశ్నించారు. కురుపాంలో దోచే డబ్బులు తాడేపల్లికి పంపిస్తున్నారని విమర్శించారు.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యండ్ లూమ్ టెక్నాలజీలో డిప్లమో కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా చేనేత, జౌళి శాఖ అధికారి ఆర్.వి.మురళీ కృష్ణ తెలిపారు.
వెంకటగిరి, తిరుపతిలోని కాలేజీలకు జూన్1లోపు ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
టీడీపీతో రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున, విజయనగరం పార్లమెంట్ అభ్యర్థి కలిశెట్టి అప్పల నాయుడు, నెల్లిమర్ల అసెంబ్లీ అభ్యర్థి లోకం మాధవి అన్నారు. గురువారం నెల్లిమర్ల పట్టణంలో ఇంటింటికి వెళ్లి ఎన్నికలు ప్రచారం నిర్వహించారు. నెల్లిమర్ల అసెంబ్లీ NDA ఉమ్మడి కూటమి అభ్యర్థి మాధవిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.