Vizianagaram

News May 9, 2024

నేడు కురుపాం, చీపురుపల్లిలో చంద్రబాబు సభలు

image

చంద్రబాబు నేడు ఉమ్మడి విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9:25‌కు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి విమానంలో 10:35గం.కు విశాఖ చేరుకుంటారు. అక్కడ నుంచి హెలీకాప్టర్‌లో 11:30గంటలకు కురుపాం చేరుకుంటారు. అనంతరం రావాడ జంక్షన్‌‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. భోజనం అనంతరం హెలికాప్టర్‌లో చీపురుపల్లిలో జరిగే సభకు చేరుకుని ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. ఆ తర్వాత విశాఖ సభలో పాల్గొంటారు.

News May 9, 2024

నిజరూప దర్శనం మొదట ఆ కుటుంబ సభ్యులకే

image

రేపు జరిగే సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనాన్ని మొదటిగా అనువంశిక ధర్మకర్తల కుటుంబ సభ్యులైన విజయనగరం గజపతిరాజులకే కల్పిస్తారు. ఉదయం 3.30 గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు అనువంశిక ధర్మకర్తల కుటుంబ సభ్యులతో పాటు న్యాయమూర్తులు, పట్టు వస్త్రాలు సమర్పించే దేవాదాయ శాఖ అధికారులకు మాత్రమే అంతరాలయ దర్శనాలు కల్పిస్తారు. సాయంత్రం మూడు నాలుగు గంటల మధ్య సేవకులు, విభిన్న ప్రతిభావంతులకు అవకాశం కల్పిస్తారు.

News May 9, 2024

సింహాచలంలో రేపే సింహాద్రి అప్పన్న చందనోత్సవం

image

సింహాచలం ఆలయంలో ఈనెల 10వ తేదీన జరగనున్న అప్పన్న బాబు చందనోత్సవం కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు లక్ష మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. సాయంత్రం 6 తర్వాత సింహగిరి పైకి భక్తులకు అనుమతి లేదని అధికారులు తెలిపారు. రూ.300, రూ.1000, రూ.1500 టికెట్లు తీసుకున్నవారికి దర్శన సమయాల స్లాట్లు కేటాయించారు. ఎన్నికల నియమావళి అమలులో ఉండడంతో ఈసారి ప్రోటోకాల్ దర్శనాలు లేవు.

News May 9, 2024

ఎన్నికల ఏర్పాట్ల బాధ్యత సెక్టార్ అధికారులదే: కలెక్టర్ నాగలక్ష్మి

image

ఎన్నికల రోజున పోలింగ్ బూత్‌ల వద్ద ఏర్పాట్లన్నీ పక్కాగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఆదేశించారు. పోల్ డే మానేజ్మెంట్ సిస్టం ప్రకారంగా విధులన్ని నిర్వహించాలన్నారు. బుధవారం సెక్టార్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని పోలింగ్ స్టేషన్‌లలో ఎన్నికల సిబ్బందికి సరైన ఆహారం సమయానికి అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

News May 8, 2024

VZM: ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

image

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఐటిఐ కళాశాలల్లో ప్రవేశాలకు ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్, జిల్లా కన్వీనర్ టీవీ గిరి బుధవారం ఓ ప్రకటనలో కోరారు. iti.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా అభ్యర్థులు వచ్చే నెల 10వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. వెల్డర్, ప్లంబర్లకు 8వ తరగతి, మిగతా అన్ని ట్రేడ్ లకు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు.

News May 8, 2024

VZM: జిల్లా వ్యాప్తంగా 15.62 లక్షల మంది ఓటర్లు

image

విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల్లో మొత్తం 15,62,921 మంది ఓటర్లు ఉన్నారు. ఏప్రిల్ 25వ తేదీ నాటికి ఎన్నికల అధికారులు తాజాగా ప్రకటించిన గణాంకాల ప్రకారం… జిల్లాలో 7,70,805 మంది పురుష ఓటర్లు ఉండగా… 7,92,038 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. కాగా మరో 78 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. వీళ్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు మొత్తం 1897 పోలింగ్ స్టేషన్లను అధికారులు సిద్ధం చేశారు.

News May 8, 2024

మద్యం దుకాణాలు బంద్: కలెక్టర్ నాగలక్ష్మి

image

ఈ నెల 13న ఆంధ్ర ప్రదేశ్ లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి మద్యం దుకాణాలు బంద్ చేయాలని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఈనెల 11న సాయంత్రం 7నుంచి 13 సాయంత్రం 7 వరకు పూర్తిగా మూసివేయాలన్నారు. అదే విధంగా జూన్ 4న కౌంటింగ్ రోజు కూడా దుకాణాలను మూసి ఉంచాలని ఆదేశించారు.

News May 8, 2024

స్వీప్ కార్య‌క్ర‌మంలో భాగంగా బైక్ ర్యాలీ

image

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌తీఒక్క‌రూ ఓటు వేసి, జిల్లాలో ఓటింగ్ శాతాన్ని పెంచాల‌ని జిల్లా ఎన్నిక‌ల సాధార‌ణ ప‌రిశీల‌కులు త‌లాత్ ప‌ర్వేజ్ ఇక్బాల్ రోహిల్లా పిలుపునిచ్చారు. స్వీప్ కార్య‌క్ర‌మంలో భాగంగా బుధ‌వారం విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వ‌హించి, ఓటుహ‌క్కు వినియోగంపై అవగాహ‌న క‌ల్పించారు. క‌లెక్ట‌రేట్ వ‌ద్ద ప‌రిశీల‌కులు స్వ‌యంగా మోటార్ సైకిల్ నడిపి ర్యాలీలో పాల్గొన్నారు.

News May 8, 2024

VZM: చంద్రబాబు సభ ఏర్పాట్ల పరిశీలన

image

గురువారం చీపురుపల్లిలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో బహిరంగ సభ స్థలం వద్ద జరుగుతున్న ఏర్పాట్లును విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున బుధవారం పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో నాగార్జున వెంట కిమిడి సూరప నాయుడు, మొండి దివాకర్, తదితరులు పాల్గొన్నారు.

News May 8, 2024

రేపు విజయనగరం జిల్లాకు చంద్రబాబు

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా కురుపాం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించనున్నట్లు టీడీపీ నియోజకవర్గ నాయకులు తెలిపారు. ఉదయం 9 గంటలకు సాయిబాబా గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుని.. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో వచ్చి రావాడ జంక్షన్ వద్ద జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని వెల్లడించారు. అనంతరం చీపురుపల్లిలో జరిగే రోడ్ షోలో పాల్గొనున్నారు.