India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయనగరం జిల్లాలో ఆదివారం జరగనున్న 6వ తరగతి మోడల్ స్కూల్ ఎంట్రన్స్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేశామని డీఈఓ ప్రేమ్ కుమార్ శనివారం తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 14 సెంటర్లలో 3,669 మంది పరీక్షలు రాయనున్నారన్నారు. ఉదయం 10గం నుంచి 12 వరకు పరీక్ష ఉంటుందన్నారు. పరీక్షా కేంద్రనికి 30 నిమిషాల ముందే చేరుకోవాల్సి ఉందని తెలిపారు. https://cse.ap.gov.in/లో హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు.
వచ్చే నెల 11న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు రెండో అదనపు జిల్లా జడ్జి ఎస్.దామోదరరావు తెలిపారు. శనివారం కోర్ట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కోర్ట్ ప్రాంగణంలో జరిగే ఈ కార్యక్రమంలో కక్షిదారులు పాల్గొని.. తమ కేసులను రాజీ చేసుకోవచ్చన్నారు.
☞ అభ్యర్థి: బొత్స సత్యనారాయణ
☞ పార్టీ: వైసీపీ
☞ చరాస్తులు: రూ.3.78 కోట్లు
☞ బంగారం: 31 తులాలు
☞ స్థిరాస్తి: రూ.6.75 కోట్లు
☞ అప్పులు: రూ.4.24 కోట్లు
☞ భార్య పేరిట చరాస్తులు: రూ.4.75 కోట్లు
☞ భార్య పేరిట స్థిరాస్తి: రూ.4.46 కోట్లు
☞ భార్య పేరిట బంగారం: 325 తులాలు
➠ బొత్స సత్యనారాయణ శుక్రవారం నామినేషన్ దాఖలు చేయగా, అఫిడవిట్‌లో ఈ వివరాలను వెల్లండించారు.
☞ అభ్యర్థి: లోకం నాగమాధవి
☞పార్టీ: జనసేన
☞ విద్యార్హతలు: ఇంజినీరింగ్
☞ కేసులు: లేవు
☞ కుటుంబ ఆస్తి: 894.92 కోట్లు
☞ అప్పులు: లేవు
➠ మాధవి కుటుంబానికి రూ.800 కోట్లకు పైగా విలువైన సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉంది.
➠ శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన మధవి అఫిడవిట్‌లో ఈ వివరాలను వెల్లడించారు.
సింహాచలం ఆలయంలో సింహాద్రి అప్పన్న వార్షిక కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అప్పన్నవరుడిగా శ్రీదేవి భూదేవి వధువుగా దర్శనమిచ్చారు. పాంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని అనుసరించి కళ్యాణాన్ని జరిపించారు. ఎదురు సన్నాయి ఉత్సవాన్ని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఆలయ ఛైర్మన్ అశోక్ గజపతిరాజు పాల్గొన్నారు.
పూసపాటిరేగ మండలంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కందివలస సంత వద్ద శ్రీకాకుళం నుంచి వైజాగ్ వెళ్తున్న లారీ ఢీకొని రెల్లివలస గ్రామానికి చెందిన పతివాడ అప్పయ్యమ్మ (62) అక్కడక్కడ స్పాట్‌లో మృతి చెందింది. పూసపాటిరేగ ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విజయనగరం జిల్లాలో వ్యయ పరిశీలకులు సెల్ నంబర్లను జిల్లా యంత్రాంగం ప్రకటించింది.
➤ ప్రభాకర్ ప్రకాష్ రంజన్ (విజయనగరం పార్లమెంటు నియోజకవర్గం): 9030311714
➤ఆనంద్‌కుమార్ (రాజాం, బొబ్బిలి, చీపురుపల్లి, గజపతినగరం): 9959211714
➤ఆకాష్ దీప్ (నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపుకోట): 9963411714
ఉమ్మడి విజయనగరం జిల్లాలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. రెండో రోజు విజయనగరం ఎంపీ స్థానానికి 6, అసెంబ్లీ స్థానాలకు 31 నామినేషన్లు దాఖలయ్యాయి. విజయనగరం-4, గజపతినగరం-8, చీపురుపల్లి-3, ఎస్.కోట-4, నెల్లిమర్ల-6, బొబ్బిలి-6 నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల అధికారులు తెలిపారు. అటు మన్యం జిల్లాలో అరకు ఎంపీ స్థానానికి 4, కురుపాం-1, సాలూరు-2, పార్వతీపురం-2 నామినేషన్లు దాఖలయ్యాయి.
కడుపునొప్పి తాళలేక బాడంగి మండలం అనవరం గ్రామానికి చెందిన తూముల విజయకుమార్(23) గత మూడు సంవత్సరాల నుంచి కడుపునొప్పితో బాధపడుతున్నాడు. జీవితం విరక్తిచెంది గ్రామ సమీపంలో అరటితోట పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు మెరుగైన వైద్య చికిత్సకోసం విజయనగరం సర్వజన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మరణించాడు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై జయంతి కేసును దర్యాప్తు చేస్తున్నారు.
అరకు పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి నిశాంత్ కుమార్‌కు శుక్రవారం నలుగురు ఎంపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు పత్రాలను అందజేశారు. వీరిలో నిమ్మక జయరాజు, పాలక రంజిత్ కుమార్ ఇండిపెండెంట్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేయగా.. పాచిపెంట అప్పలనరస సీపీఐ(M) నుంచి అభ్యర్థి నామినేషన్ వేయగా, వైసీపీ అభ్యర్థి గుమ్మ తనూజా రాణి కూడా నామినేషన్ దాఖలు చేశారు.
Sorry, no posts matched your criteria.