India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, భవనాలపై ఉన్న పార్టీల రంగులను తొలగించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లు, ప్రవర్తన నియమావళి అమలు తదితర అంశాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీఈఓ ముఖేశ్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్‌లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

ఈనెల 31న విశాఖలో చెన్నై సూపర్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసందే. మ్యాచ్‌కు సంబంధించి ఈరోజు ఉ.10 గంటలకు ఆన్‌లైన్ టికెట్లను అందుబాటులో ఉంచారు. ఓపెన్ అయిన గంటలోపే వెయ్యి, రూ.2వేలు, రూ.3వేలు, రూ.4 వేల టికెట్లు సోల్డ్ అవుట్ అయిపోగా.. మ.12.30కి మొత్తం టికెట్లు అయిపోయాయి. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. ధోనీ క్రేజ్ వల్లే టికెట్లు త్వరగా అయిపోయాయని ఫ్యాన్స్ అంటున్నారు.

సదరం ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఏప్రిల్ 4 వ తేదీ నుంచి స్లాట్ బుకింగ్ లు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధిత ప్లాట్లు అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు అందరూ మీ దగ్గర లో ఉన్న అన్ని గ్రామ, వార్డు సచివాలయాలు లేదా మీ సేవా సెంటర్లకు వెళ్లి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. > SHARE IT

ఏప్రెల్ 14వ తేదీ లోగా కొత్తగా ఓటు నమోదు కోసం ధరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సూచించారు. ఇలా వచ్చిన దరఖాస్తులను 25వ తేదీలోగా పరిశీలించి, అర్హులైనవారికి ఓటుహక్కు కల్పించడం జరుగుతుందని తెలిపారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో తన ఛాంబర్‌లో బుధవారం కలెక్టర్ సమావేశమయ్యారు. ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులు, ఎన్నికలకు సంబంధించిన అంశాలపై చర్చించారు.

ఉమ్మడి విజయనరగం జిల్లాలో చీపురుపల్లి మినహా ఎన్డీఏ కూటమి మిగతా అభ్యర్థులు ప్రకటించింది. బొత్స సత్యనారాయణకు పోటీగా గంటా శ్రీనివాస్‌ను బరిలో దింపాలని టీడీపీ అధిష్ఠానం భావించినా.. ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో మీసాల గీత పేరును అధిష్ఠానం పరిశీలించింది. అంతేకాక విజయనగరం ఎంపీ అభ్యర్థి కోసం చేసిన ఐవీఆర్ఎస్ సర్వేలో కూడా గీత పేరును చేర్చింది. దీంతో చీపురుపల్లి అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.

ఈనెల 31న విశాఖలో జరిగే చెన్నై సూపర్‌కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ టికెట్ల అమ్మకాలు ఈరోజు ఉ.10 గంటల నుంచి పేటీఎం ఇన్‌సైడర్ వెబ్‌సైట్ ద్వారా ప్రారంభం కానున్నాయి. టికెట్ల ధరలు రూ.1,000, రూ.1,500, రూ.2వేలు, రూ.3వేలు, రూ.3,500, రూ.5వేలు, రూ.7,500గా నిర్ణయించారు. కేవలం ఆన్ లైన్ లో మాత్రమే టికెట్లు అమ్మకాలు జరుగుతాయి. రేపు CSK జట్టు, ఎల్లుండి ఢీల్లీ క్యాపిటల్స్ జట్టు విశాఖ రానున్నట్లు సమాచారం.

బాలల్లో క్రీడల పట్ల ఆసక్తిని పెంచేందుకు, సెలవులను సద్వినియోగం చేసుకునేలా ఏటా క్రీడాశాఖ వేసవి క్రీడా శిబిరాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది మే 1 నుంచి 31 వరకు శిబిరాలు ఉంటాయని ఆ శాఖ ఉమ్మడి జిల్లా అధికారి ఎస్.వెంకటేశ్వరరావు తెలిపారు. 8 నుంచి 14 ఏళ్ల లోపున్న బాలబాలికలు ఈనెల 30వ తేదీలోగా వివరాలు అందజేయాలని కోరారు. శిబిరాల నిర్వహణకు ప్రతిపాదనలు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు.

జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని బుధవారం నిర్వహించనున్నట్లు సీఈవో కె.రాజ్ కుమార్ తెలిపారు. విజయనగరంలోని జడ్పీ కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లా అధికారులంతా పూర్తి సమాచారంతో హాజరుకావాలని సూచించారు. సభ్యులు అడిగిన సమాచారం సిద్ధంగా ఉండేలా చూసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

విజయనగరం ఉడా కాలనీలో గుండెపోటుకు గురై ఉపాధ్యాయుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. కే.వెంకటరమణ అనే ఫిజిక్స్ టీచర్ మంగళవారం విజయనగరం బాలికల పాఠశాలకు పదో తరగతి పరీక్షల ఇన్విజిలేషన్‌కి వెళ్లేందుకు బయలుదేరుతుండగా గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే కుబుంబ సభ్యులు 108లో ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించారు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.

రానున్న మూడు నెలలలో మంచినీటి సరఫరాకు కావలసిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం నుంచి నియోజకవర్గ ప్రత్యేకాధికారులు, మున్సిపల్ కమిషనర్లు, మండల అభివృద్ది అధికారులు, మండల ఇంజినీరింగు అధికారులతో మంచినీటి సరఫరాపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
Sorry, no posts matched your criteria.