India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పంచాయితీరాజ్ ఇంజనీర్లు, ఉపాధిహామీ ఏపిఎంలు, APDలు తమ పనితీరును మెరుగుపర్చుకోకపోతే సస్పెషన్ వేటు వేస్తామని కలెక్టర్ డాక్టర్ అంబేడ్కర్ హెచ్చరించారు. కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లు హెచ్చిరికలకే పరిమితం అయ్యామని, ఇకనుంచి చర్యలు మొదలు పెడుతున్నామని ప్రకటించారు.
సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్‌గా రామారావును ఫుల్ అడిషనల్ చార్జ్ (FAC)గా నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన పార్వతీపురం మన్యం జిల్లాలో డా.వైఎస్ఆర్ హార్టీకల్చర్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ ఫారెన్ సర్వీసులో భాగంగా ఇక్కడకు వచ్చారు. ప్రస్తుతం జిల్లా విద్యాశాఖాధికారి యు. మాణిక్యం నాయుడు ఇంఛార్జిగా భాధ్యతలు నిర్వహించారు.
జిల్లా కోర్టు పరిధిలో స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ పోస్టు భర్తీ కోసం అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా జడ్జి సాయికళ్యాణ్ చక్రవర్తి బుధవారం తెలిపారు. ఎంపికైన వారికి నెలకు రూ.45వేలు పారితోషికం,రూ.5వేలు రవాణాభత్యం లభిస్తుందన్నారు. న్యాయవాద వృత్తిలో ఐదేళ్ల అనుభవం కలిగిన వారు అర్హులని, పూర్తి వివరాలకు పూల్ బాగ్‌లో ఉన్న జిల్లా కోర్టును సంప్రదించాలన్నారు.
రహదారి భద్రత పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. బుధవారం తన కార్యాలయంలో ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో వచ్చే నెల 15వ తేదీ వరకు రహదారి భద్రత వారోత్సవాలు నిర్వహించాలన్నారు. ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపడుతున్నామని గత ఏడాదిలో జిల్లాలో మొత్తం 60,392 మందిపై ఈ చలానాలు విధించామన్నారు.
జిల్లా అంతటా వాహనం నడిపేవారికి హెల్మెట్ల వినియోగం తప్పనిసరి చేయాలని జిల్లా కలెక్టర్ అబేండ్కర్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం జరిగింది. వచ్చే రెండు నెలల్లో పూర్తిగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. హెల్మెట్ల వినియోగం పై ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. జిల్లాను ప్రమాదాల రహిత జిల్లాగా నిలిపేందుకు కృషి చేయాలని తెలిపారు.
2021లో బొండపల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన పొక్సో కేసులో నిందితుడికి 3 ఏళ్ల జైలు, రూ.2వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిందని ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం తెలిపారు. బొండపల్లిలోని చంద్రయ్య శ్రీనివాస్ అనే వ్యక్తి బాలికపై అత్యాచార ప్రయత్నం చేయగా స్థానికులను చూసి పారిపోయాడన్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టామని, నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారైందన్నారు.
శృంగవరపుకోట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన గంజాయి కేసులో అరెస్ట్ అయిన శెట్టి ఉమామహేశ్వరరావు కు చెందిన ఆస్తులను సీజ్ చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం తెలిపారు. విశాఖలో నివాసం ఉంటున్న నిందితుడు 222 కిలోల గంజాయిని తరలిస్తుండగా బొడ్డవర చెక్ పోస్ట్ వద్ద పట్టుబడ్డాడన్నారు. గంజాయి వ్యాపారంలో సంపాదించిన రూ.1.97 కోట్ల ఆస్తులను గుర్తించి ఫ్రీజ్ చేశామన్నారు. ఇప్పటికే నోటీసులు కూడా అందజేశామన్నారు.
రెవెన్యూ సదస్సుల్లో, రీ సర్వే గ్రామ సభల్లో నమోదైన వినతులను త్వరగా పరిష్కరించాలని జేసీ సేతు మాధవన్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా PGRS,రెవిన్యూ, రీ సర్వే వినతులు, ఫ్రీ హోల్డ్ భూములు, POLR తదితర రెవెన్యూ అంశాల పై మండల వారీగా సమీక్షించారు. గత వారం రోజుల్లో రెవెన్యూ వినతుల ప్రోగ్రెస్ మెరుగైందని, రీ సర్వే వినతులు పరిష్కారంలో పురోగతి లేదని అన్నారు.
ఉమ్మడి VZM జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. అయితే టికెట్ ఆశించి భంగపడ్డ వారితోపాటు తమ వర్గానికి టెకెట్ ఇవ్వలేదన్న కారణంతో ఎన్నికల్లో పలువురు పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారన్న విమర్శలొచ్చాయి. వారిలో పార్వతీపురం, విజయనగరం, గజపతినగరం, సాలూరు, కురుపాం నియోజకవర్గాలకు చెందిన నేతలు, మాజీలు కూడా ఉన్నారు. నామినేటెడ్ పదవుల విషయంలో ఆ మాజీలకు అధిష్ఠానం మొండిచెయ్యి చూపిన సంగతి తెలిసిందే.
విజయనగరం 2వ పట్టణ పోలీస్ స్టేషన్‌లో గత ఏడాది సైబర్ కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడికి JFCM కోర్టు మెజిస్ట్రేట్ ఈనెల 31 వరకు రిమాండ్ విధించిందని CI శ్రీనివాసరావు తెలిపారు. నగరానికి చెందిన శ్రీనివాస్(బాధితుడు) నుంచి ప్రకాశం జిల్లాకు చెందిన నిందితుడు శ్రీనివాసులు లోను పేరిట ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.22లక్షలు కాజేశాడని బాధితుడి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టామన్నారు.
Sorry, no posts matched your criteria.