India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లా జ్యుడీషియల్ పరిధిలో సెకండ్ క్లాస్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌ల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా జడ్జి సాయి కళ్యాణ చక్రవర్తి తెలిపారు. బార్‌లో నాన్ ప్రాక్టీసింగ్ న్యాయవాదులుగా ఉంటూ 45 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు అర్హులని పేర్కొన్నారు. వారంలో ఐదు రోజులపాటు విధులు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు.
ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ఈసీ రద్దు చేసినట్లు కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. ఉప ఎన్నికకు ఈ నెల 4వ తేదీన నోటిఫికేషన్ వెలువడిందని వెల్లడించారు. ఈ స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఉన్న రఘురాజు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాలకు అనుగుణంగా నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకున్నదని తెలిపారు.
అసెంబ్లీలో కోళ్ల లలిత కుమారీకి కీలక పదవి దక్కింది. పలువురు ఎమ్మెల్యేలను ప్యానల్ స్పీకర్‌లుగా నియమించారు. ఈ జాబితాలో ఎస్.కోట ఎమ్మెల్యే ఉన్నారు. రెగ్యులర్ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అందుబాటులో లేనప్పుడు.. కోళ్ల లలిత కుమారీ కుర్చీలో కూర్చుని అసెంబ్లీని నడుపుతారు. కాగా కోళ్ల లలిత కుమారి మూడో సారి టీడీపీ నుంచి ఎస్.కోట ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీకి వెళ్లారు.
విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో మాసాంతర నేర సమీక్ష సమావేశాన్ని ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసుల నమోదు, దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాలన్నారు. 7 సంవత్సరాలకు పైబడి శిక్ష పడే అన్ని కేసుల్లో అరెస్టు కాబడిన నిందితుల వేలిముద్రలను లైవ్ స్కానర్లలో తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో బెల్టు షాపులు లేకుండా చూడాలని ఆదేశించారు.
దత్తిరాజేరు మండలంలోని బూర్జవలసలో ఓ కంటైనర్ భీభత్సం సృష్టించింది. బుధవారం రాత్రి వాహనం అదుపుతప్పి నేరుగా బూర్జవలస పోలీస్ స్టేషన్‌పైకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో స్టేషన్ గోడ ధ్వంసం కాగా.. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
కొప్పల వెలమ డైరెక్టర్లుగా పలువురిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నియోజకవర్గాల వారీగా వివరాలు..
☛ అక్కేన మధుసూదనరావు(కురుపాం)
☛ అల్లు విజయ్ కుమార్(గజపతినగరం)
☛ గొట్టాపు వెంకట నాయుడు(పార్వతీపురం)
☛ కొల్లి అప్పలనాయుడు(బొబ్బిలి)
☛ మిడతాన రవికుమార్(విజయనగరం)
☛ మాకిరెడ్డి శ్రీలక్ష్మి(ఎస్.కోట)
☛ ఎస్.కోటకు చెందిన మల్లా రామకృష్ణను గవర కార్పొరేషన్ డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది.
గిరిజన ప్రాంతాలలో డోలి మోతలు లేకుండా 2 వేల గ్రామాలకు రూ. 2,500 కోట్లతో రోడ్లు వేస్తున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశాలలో మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా ఫీడర్ అంబులెన్సులు తీసివేయడం వలన డోలి మోతలు పెరిగాయని అన్నారు. ప్రస్తుతం అంబులెన్సులు, ఫీడర్ అంబులెన్సులు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు.
ఈనెల 17 నుంచి మధ్యప్రదేశ్‌లో జరగనున్న జాతీయస్థాయి స్కూల్ గేమ్స్ బ్యాడ్మింటన్ అండర్-17 ఏపీ జట్టుకు కోచ్‌గా ధర్మవరం ZP హైస్కూల్లో PD డా.పొట్లూరు శ్రీరాములు వ్యవహరించనున్నారు. ఈయన గతంలో భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్ గ్రేడ్-1 అంపైర్‌గా, అలాగే 2010లో న్యూఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ క్రీడలకు టెక్నికల్ అఫీషియల్‌గా వ్యవహరించారు. పలువురు క్రీడాకారులు బుధవారం ఆయనకు అభినందనలు తెలిపారు.
పూసపాటి రేగ మండలానికి చెందినమైనపు హరీశ్ (19)పై పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. అదే గ్రామానికి చెందిన బాలికపై అత్యాచారయత్నం చేశాడు. అతడి నుంచి తప్పించుకున్న బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హరీశ్‌పై పోక్సో కేసు నమోదు చేశారు. మైనర్‌గా ఉన్నప్పుడే ఇతడు ఒక బాలికను అత్యాచారం చేసిన కేసులో జైలుకి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
డ్రగ్స్ నియంత్రణ సమాజానికి పెద్ద ఛాలెంజ్‌గా మారిందని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులకు మంగళవారం అవగాహన కల్పించారు. మానవ జీవితాలను మాదకద్రవ్యాలు ఏ విధంగా నాశనం చేస్తాయో వైద్య విద్యార్థులకు తెలియదని అన్నారు. అరెస్టులు కంటే అవగాహనతోనే నిర్మూలించవచ్చునని భావించి యువతలో చైతన్యం తీసుకువస్తున్నామని చెప్పారు. కఠిన శిక్షలు అమల్లో ఉన్నాయని వివరించారు.
Sorry, no posts matched your criteria.