India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారత నౌకాదళం మరో మైలురాయిని చేరుకోనుంది. పూర్తిగా అణు సామర్థ్యంతో కూడిన బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ కలిగిన జలాంతర్గామి ‘INS అరిఘాత్’ను భారత నౌకాదళం విశాఖపట్నం నేవల్ డాక్‌యార్డ్ షిప్ బిల్డింగ్ సెంటర్‌లో నిర్మించింది. ప్రధాని మోదీ సెప్టెంబరు తొలివారంలో దీన్ని జాతికి అంకితం చేయనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం విశాఖ రానున్నట్లు సమాచారం.
జిల్లా వ్యాప్తంగా ఈనెల 29 నుంచి 31 వరకూ అలాహజరత్ ఉత్సవాలను నిర్వహించనున్నట్టు జిల్లా శాఖ ముస్లింల ప్రతినిధి మహమ్మద్ గౌస్ తెలిపారు. ఇప్పటికే సున్నీ మసీదుల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారన్నారు. స్థానిక ఆబాద్ వీధిలో ఉన్న మదరసా ఆల్ జామియాతుల్ హబీబియా ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 31న ఉదయం 9 గంటలకు అలా హజరత్ ఊరేగింపు నిర్వహిస్తున్నామన్నారు.
ఉమ్మడి విజయనగరం జిల్లాలో జ్వరాలు విజృంభిస్తుండడంతో అధికారులపై జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు సీరియస్ అయ్యారు. జ్వరం రావడం నుంచి..మరణాల వరకు వెళ్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఉమ్మడి జిల్లాకు చెడ్డపేరు తీసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బట్లభద్రలో తల్లీకుమార్తెలు మరణించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. మందులు అందుబాటులో ఉంచి, రక్త పరీక్షలు వేగవంతం చేయాలని ఆదేశించారు.
తక్కువ నీటి వనరులతో వ్యవసాయం చేయుటకు తుంపర సేద్య పరికరాలను సబ్సిడీపై అందిస్తున్నట్లు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ITDA పరిధిలో గల గిరిజన సబ్ ప్లాన్ మండలాలలో తుంపర సేద్య రైతులకు 2024-25 సంవత్సరానికి గాను రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ITDA పరిధిలో 750 మందికి గాను రూ.53.79 లక్షలు నిధులు విడుదల చేశామన్నారు.
తమ ఫిర్యాదు మేరకు అధికారులు నిర్వహించిన ఈవీఎంల తనిఖీలు సంతృప్తికరంగా లేవని.. ఈ విషయంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈవీఎంలలో డేటా డిలీట్ చేశారని, మాక్ పోలింగ్ నిర్వహణకు తాము ఒప్పుకోలేదన్నారు. తాము లేవనెత్తిన సమస్యలకు పరిష్కారం లభించలేదని దీనిపై కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.
ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన కింద 18 రకాల కుల వృత్తులు, చేతి వృత్తులు, సాంప్రదాయ వృత్తులు చేసేవారికి రూ.2 లక్షల వరకు రుణాలు అందజేయనున్నట్లు కలెక్టర్ అంబేడ్కర్ మంగళవారం తన ఛాంబర్‌లో తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన విశ్వకర్మ ఐడీ కార్డు కలిగిన వారికి 5 రోజులు ప్రాథమిక శిక్షణ ఇచ్చి, అనంతరం రూ.15 వేలు టూల్ కిట్ ఇన్సెంటివ్‌గా మంజూరు చేస్తామన్నారు.
సీజనల్ వ్యాధులను అరికట్టి ప్రజల ఆరోగ్యానికి భద్రత కల్పించాలని జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కోరారు. విజయనగరం జిల్లాలో మలేరియా, డెంగ్యూ తదితర సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా తక్షణమే అన్ని రకాల చర్యలను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్థాయి సంఘ సమావేశాలు జడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం జరిగాయి.
ప్రభుత్వ హోమియో వైద్యశాల రాకోడు లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లో యోగా శిక్షకులుగా పనిచేసేందుకు ఆసక్తి కలిగిన స్త్రీ, పురుష అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వైద్యాధికారి డా. పి. సత్యేంద్ర కుమార్ తెలిపారు. యోగా శిక్షకులుగా పనిచేసేవారు ఎమ్మెస్సీ యోగా, పీజీ డిప్లొమో ఇన్ యోగా , డిప్లొమో ఇన్ యోగాలో అనుభవం ఉన్నవారు అర్హులన్నారు. వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
‘స్ఫూర్తి ప్రదాత విజయనగరం మహారాజా’ అనే టైటిల్‌తో డా.పీవీజీ రాజుపై విడుదలైన పుస్తకం ఆకట్టుకుంటోంది. కవర్ పేజీ చిత్రపటం నుంచి చివరి పేజీ వరకు పీవీజీ జీవితంలో కొన్ని ముఖ్యమైన ఘటనలు, విశేషాలను ఫొటోలతో సహా ఈ పుస్తకంలో పొందుపరిచారు. అశోక్ గజపతిరాజు ఈ పుస్తకానికి ముందుమాట రాశారు. ఈ తెలుగు అనువాద పుస్తకం సుమారు 8 వేల కాపీలను అచ్చు వేయించారు. సోమవారం సాయంత్రం కోటలో పుస్తకావిష్కరణ జరిగిన సంగతి తెలిసిందే.
ఉత్తరాంధ్రుల ఆరాధ్య దేవత.. విజయనగరం వాసులు కొంగు బంగారం పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామునే ఆలయ అర్చకులు పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు, విశేష పూజలు నిర్వహించి వివిధ రకాల పుష్పాలతో అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
Sorry, no posts matched your criteria.