India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీలో జరిగిన భారీ పేలుడుకు సంబంధించి సిబ్బందికి గంటన్నర ముందే ప్రమాద సంకేతాలు అందినట్లు తెలిసింది. బల్క్ డ్రగ్ తయారీలో ఉపయోగించే ఎంటీబీఈ రసాయనం లీక్ అవుతున్నా సిబ్బంది, కంపెనీ అధికారులు స్పందించకపోవడంతో ప్రమాదం జరిగినట్లు తనిఖీ అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. తక్షణం స్పందించి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగేది కాదని వారు నివేదికలో పేర్కొన్నారు.
పరవాడలోని సినర్జిన్ కంపెనీ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి సోమవారం ఉదయం మృతి చెందిన వంగర మండలం కోనంగిపాడుకు చెందిన కే.సూర్యనారాయణ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. నాలుగేళ్ళ క్రితం బలిజపేట మండలం బర్లికి చెందిన సునీతను వివాహం చేసుకున్నాడు. కుమారుడికి రెండేళ్లు కాగా, ఇటీవల జన్మించిన చిన్న కుమారుడికి పది రోజుల్లో నామకరణం చేయనున్నారు. ఇంతలోనే ప్రమాదం జరగడంతో బిడ్డను చూడకుండానే ప్రాణాలు కోల్పోయాడు.
జిల్లాలో ఉచిత ఇసుక సరఫరా విధానం ప్రారంభించిన జులై 8 నుంచి 26వ తేదీ వరకు మూడు ఇసుక డిపోల ద్వారా 39,972 మెట్రిక్ టన్నుల ఇసుక సరఫరా చేసినట్లు గనుల శాఖ ఉప సంచాలకులు సిహెచ్. సూర్యచంద్ర రావు తెలిపారు. సోమవారం ఒక్క రోజులో 30 బుకింగ్‌లు ద్వారా 449 మెట్రిక్ టన్నుల ఇసుక సరఫరా చేశారని పేర్కొన్నారు. నేటికీ జిల్లాలో 47,107 టన్నులు అందుబాటులో ఉందని వెల్లడించారు.
విద్యను పెంపొందించడం ద్వారా వెనుకబాటుతనాన్ని నిర్మూలించవచ్చని డాక్టర్ పీవీజీ.రాజు నిరూపించారని కేంద్రమంత్రి కే.రామ్మోహన్ నాయుడు అన్నారు. పీవీజీ.రాజు శతజయంతి ఉత్సవాలను సోమవారం కోటలో నిర్వహించిన జీవిత చరిత్ర పుస్తకావిష్కరణలో ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్రలో విద్యావకాశాలు పెంపొందించి వెనుకబాటుతనాన్ని పోగొట్టే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారని కొనియాడారు.
కొమరాడ మండలం వన్నాం గ్రామానికి చెందిన వాన శివుడు ఏనుగుల దాడిలో మృతి చెందాడు. సోమవారం వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన శివుడిని ఏనుగుల గుంపు తొక్కి చంపినట్లు సమీప రైతులు చెప్పారు. దీంతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు ఒంటరి ఏనుగు హరి వల్లే ఎక్కువగా ప్రాణ నష్టం జరిగిందని అధికారులు అంచనా వేసినా.. ఆ ఏనుగు లేకపోయినప్పటికీ మరొకరి ప్రాణాన్ని ఏనుగులు గుంపు బలి తీసుకుంది.
విజయనగరం సంస్థానాధీశులు పీవీజీ రాజు సోషలిస్ట్ భావాలు గల అభ్యుదయవాది. 1952 నుంచి 1984 వరకు రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించారు. 1952లో సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా, 1956లో ప్రజా సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా శాసనసభకు ఎన్నికయ్యారు. 1957లో విశాఖ లోక్ సభకు ఎన్నికయ్యారు. 1960 నుంచి 1964 వరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ, విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.
విజయనగరం మహారాజు డా.పీవీజీ రాజు రైతు బాంధవులుగా పేరొందారు. వారి పక్షాన పోరాడి జైలు జీవితం గడిపారు. 1949లో జామి మండలం అన్నమరాజుపేటలో కాలువ తవ్వకంలో శ్రమదానం చేశారు. కర్నూలు జిల్లా కలివెన్న గ్రామంలో ఈనాం సత్యాగ్రహంలో పాల్గొని 40 రోజులు జైలు శిక్ష గడిపారు. బిహార్‌లో జరిగిన రైతు ఉద్యమానికి పీవీజీ నాయకత్వం వహించి పూర్నియా జైలులో 45 రోజులు గడిపారు. నాగార్జున సాగర్ నిర్వాసితులకు అండగా నిలిచారు.
అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని ఆర్.కె.బీచ్ వద్ద నిర్వహించారు. ర్యాలీ నిర్వహణకు పోర్టు స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ వర్షం కారణంగా ట్రాక్ అంతా తడిసిపోయింది. దీంతో బురద కారణంగా అభ్యర్థులు ఇబ్బంది పడతారని భావించిన కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ సూచనతో అధికారులు ర్యాలీని బీచ్ రోడ్‌లో నిర్వహించారు. వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా అభ్యర్థులు ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
పరవాడ సినర్జిన్ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి విశాఖలో చికిత్స పొందుతున్న కెమిస్ట్ సూర్యనారాయణ(34) మృతి చెందాడు. మృతుడు విజయనగరం జిల్లా కోనంగిపాడుకు చెందిన వ్యక్తి. ఆరోజు సూర్యనారాయణ కెమికల్ మిక్స్ చేస్తుండగా రియాక్షన్ జరిగి ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో గాయపడిన ఝార్ఖండ్‌కు చెందిన కార్మికుడు రెండు రోజుల కిందట చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.
విజయనగరం సంస్థానాధీశులు డా.పీవీజీ రాజు అభినవ దానకర్ణుడని చెప్పుకుంటారు. సామాన్యులు సైతం ఉన్నత విద్య అభ్యసించాలన్న లక్ష్యంతో తన రాచరిక వైభవాన్ని విద్యా సంస్థలు కోసం దానం చేశారు. 1958లో మాన్సాస్ ట్రస్ట్ (మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ & సైన్సెస్) స్థాపించి, ఎన్నో విద్యా సంస్థలను ఏర్పాటు చేసి, విజయనగరాన్ని విశ్వవిద్యాలయంగా చేశారు. విద్యా సంస్థలు కోసం తన కోటని ధారాదత్తం చేశారు.
Sorry, no posts matched your criteria.