India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
G.O నం.117తో విద్యావ్యవస్థ నాశనం అయ్యిందని, ఆంగ్లమాద్యమంతో పాటు తెలుగును కూడా కొనసాగించాలని ఏపీటీఎఫ్ నాయకులు మంత్రిని కోరారు. టీచర్ల పనిసర్దుబాటు ప్రక్రియ కూడా లోపభూయిష్టంగా ఉందని తెలియజేశారు. మండల పరిధిలో అవసరం మేరకు మాత్రమే టీచర్లను సర్దుబాటు చేయాలనీ మంత్రిని తన నివాసంలో కలిసి వినతి పత్రం అందజేశారు. మంత్రి స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని చెప్పారు.
విజయనగరం సంస్థానాధీశులు, మాన్సస్ సంస్థ వ్యవస్థాపకులు దివంగత డా.పీవీజీ రాజు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆయన జీవిత చరిత్రకు సంబందించిన పుస్తకావిష్కరణ కార్యక్రమం కోటలో ఈరోజు సాయంత్రం 6 గంటలకు జరగనుంది. అశోక్ గజపతిరాజు, కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు, శాసనసభా స్పీకర్ అయ్యన్నపాత్రుడు, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పలువురు రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ MLC అభ్యర్థిగా APTF-57 తరఫున రెండోసారి పాకలపాటి రఘువర్మ పోటీ చేయనున్నారు. ఈ మేరకు విజయనగరంలో ఆదివారం జరిగిన కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. టీచర్లకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేసే వ్యక్తిని బరిలో ఉంచుతున్నట్లు కార్యవర్గం పేర్కొంది. త్వరలో ప్రచారం మొదలుపెడతామని వెల్లడించింది. సంఘం పరంగా ఆయన గెలుపునకు అంతా కృషి చేయాలని పిలుపునిచ్చింది.
జిల్లాలోని భారీ పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో భద్రతపై ఈ నెల 27న ఆయా పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశం నిర్వహిస్తామని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. ఇటీవల అనకాపల్లి జిల్లాలోని ఫార్మా పరిశ్రమల్లో జరిగిన ప్రమాదంలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో పరిశ్రమల యజమానులతో కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించేందుకు నిర్ణయించామన్నారు.
స్వయం సహాయక సంఘాల సభ్యులు లక్షాధికారులుగా ఎదగాలని, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లో జరిగిన ‘లఖ్ పతి దీదీ’ కార్యక్రమంలో మహిళా సంఘాలకు రూ.66.14 కోట్ల చెక్కును అందజేశారు. మహిళలను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడమే ఈ పథకం లక్ష్యమన్నారు.
కొత్తవలస మండలం కంటకాపల్లి కొత్తూరుకు చెందిన దుక్క రాధాకృష్ణ(18) కంటకాపల్లి జీడీ పిక్కల ఫ్యాక్టరీ సమీపంలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. రాధాకృష్ణ ఈనెల 9 నుంచి కనిపించట్లేదని తల్లిదండ్రులు తెలిపారు. బహిర్భూమికి వెళ్లిన గ్రామస్థులకు మృతదేహం కనబడడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్.ఐ షణ్ముఖరావు సమక్షంలో పోలీసులు విచారణ చేయగా రాధాకృష్ణ మృతదేహంగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బొబ్బిలి మండలంలోని దిబ్బగుడ్డివలస ఎల్సీ రైల్వే గేటు సమీపంలో రైలు ఢీ కొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే హెచ్సీ బి.ఈశ్వరరావు తెలిపారు. మృతుడికి సుమారు 50 సంవత్సరాల వయస్సు ఉంటుందన్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల వివరాలు తెలిస్తే సమాచారం ఇవ్వాలన్నారు.
హరికథ పితామహులు ఆదిభట్ల నారాయణదాసు మనుమరాలు కామేశ్వరమ్మ (88) శనివారం సాయంత్రం కన్నుమూశారు. ఈ రోజు ఉదయం ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతి పట్ల పలువురు సాహితీవేత్తలు, కళాకారులు, పట్టణ ప్రముఖులు సంతాపం తెలిపారు. హరికథాగానం అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచిన నారాయణదాసు వంశీకులు ఇప్పటికి కూడా విజయనగరంలో ఉండటం విశేషం.
రాష్ట్ర వ్యాప్తంగా 11 నగరాల్లో పచ్చదనం పెంపొందించే దిశగా ఆయా నగరాల్లో వనాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ జాబితాలో నెల్లిమర్లకు చోటు దక్కడంతో నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదీన కొండవెలగాడ రహదారిలో వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటనున్నారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం ప్రకటించడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆదివారం జిల్లాకు రానున్నారు. ఉదయం 10-00 గంటలకు విజయనగరం చేరుకుంటారని జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావుతో పాటు జిల్లా అధికారులు కేంద్ర సహాయ మంత్రిని మర్యాదపూర్వకంగా కలుస్తారని చెప్పారు.
Sorry, no posts matched your criteria.