India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆగష్టు 26న కృష్ణాష్టమి సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో ఉత్తర్వులు జారీ చేయడంతో విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతీ సోమవారం ప్రజల సమస్యల పరిష్కారానికి నిర్వహించే “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (గ్రీవెన్స్ సెల్) రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలో ఇప్పటికీ 48,469.5 మెట్రిక్ టన్నుల ఇసుక వినియోగదారులకు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉందని గనులశాఖ ఉప సంచాలకులు సి.హెచ్.సూర్యచంద్రావు తెలిపారు. శనివారం నాడు ఇసుక కోసం జిల్లాలో 59 ఆర్డర్‌లు చేయగా వారందరికీ 924.5 మెట్రిక్ టన్నుల ఇసుకను బొబ్బిలిలోని ఇసుక డిపో ద్వారా సరఫరా చేశామన్నారు. ఛార్జీల కింద ఒక్కో టన్నుపై రూ.605 మాత్రమే వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నామన్నారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నాయి. జియమ్మవలస మండలం బట్టలభద్ర గ్రామంలో డెంగ్యూ జ్వరంతో 24 గంటల వ్యవధిలో తల్లీకూతురు మృతి చెందడం కలకలం రేపింది. తల్లి మేరువ దుర్గమ్మ (40) కూతురు చైతన్య (20) డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ మృతి చెందారు. డెంగ్యూ జ్వరాల నియంత్రణకు అధికారులు చేపడుతున్న చర్యలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయంటూ ప్రజలు మండిపడుతున్నారు.
సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో ఈనెల 30వ తేదీన సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి తెలిపారు. ఉదయం 9 గంటలకు నిర్వహించే వరలక్ష్మి వ్రతం పూర్తిగా ఉచితమని పేర్కొన్నారు. భక్తులకు ఆ రోజు కొండ దిగువ నుంచి కొండపై వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు కుంకుమ, జాకెట్, ప్రసాదం ఉచితంగా అందిస్తామన్నారు. స్వామివారి దర్శనం కూడా ఉచితంగా కల్పిస్తామన్నారు.
పొలం నుంచి మిల్లర్‌కు వెళ్లే వరకు అవసరాలన్నింటినీ ఏర్పాటు చేసుకొని ధాన్యం సేకరణ సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. కొనుగోళ్లకు అవసరమగు వాహనాలు, సంచులు, హమాలీలు, తేమ యంత్రాలు, గోడౌన్ సామర్థ్యం, బ్యాంకు గ్యారంటీలు, తూనిక యంత్రాలు తదితర సామగ్రిని నెల రోజుల ముందే ఏర్పాటు చేసుకొని సిద్ధంగా ఉండాలన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ల పై సమావేశమయ్యారు.
శాసనమండలిలో వైసీపీ తరఫున ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు శాసనమండలి సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ ప్రకటన విడుదల చేశారు. కాగా బొత్స ఇటీవల విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం తెలిసిందే. పలు శాఖలకు మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది. వైఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలోను, జగన్ ప్రభుత్వంలోను ఆయన కీలక పాత్ర పోషించారు.
విజయనగరం జిల్లా గుర్ల మండల కేంద్రంలో గల విశాఖ గ్రామీణ బ్యాంక్ మేడ మీద గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. సమాచారం అందుకొని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని పరిశీలించారు. ప్యాంట్, చారలు షర్ట్ వేసుకున్న వ్యక్తి మూడు రోజుల క్రితం చనిపోయి ఉంటాడని, అది హత్యా, లేక ఆత్మహత్యా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. మృతుడు వివరాల కోసం ఆరా తీస్తున్నారు.
శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా కలెక్టరేట్‌లో ఈనెల 26వ తేదీన నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక(గ్రీవెన్స్ సెల్) రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రకటించారు. వివిధ సమస్యల కలెక్టరేట్‌కు వచ్చే ప్రజలు, అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
కృష్ణం వందే జగద్గురుం సినిమాతో మాటల రచయితగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సాయిమాధవ్ బొబ్బిలిలో పర్యటించారు. స్థానిక కోటలో ఎమ్మెల్యే బేబినాయనను మర్యాదపూర్వకంగా కలిశారు. బొబ్బిలి చరిత్రపై కథ రాసే క్రమంలో ఎమ్మెల్యేను కలిసి చరిత్ర వివరాలు తెలుసుకున్నారు. బొబ్బిలి చరిత్ర విషయంలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
త్వరలో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు అచ్యుతాపురం సెజ్‌లో జరిగిన ప్రమాదంలో కన్నుమూయడం అందరినీ కలచి వేస్తోంది. ఉమ్మడి విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం చలమవలసకు చెందిన పార్థసారథి(27) అచ్యుతాపురంలో పనిచేస్తున్నాడు. అతడికి ఇటీవలే పెళ్లి నిశ్చయమైంది. అక్టోబర్ 5న పెళ్లి వివాహ తేదీని ఖరారు చేశారు. ఇంతలోనే ఈ విషాదం జరగడంతో కుటుంబం సభ్యులు బోరున విలపించారు.
Sorry, no posts matched your criteria.