Vizianagaram

News March 4, 2025

VZM: 4వేల మంది మహిళలతో మహిళా దినోత్సవం

image

మార్చి 8న నిర్వ‌హించే మ‌హిళా దినోత్స‌వానికి భారీగా ఏర్పాట్లు చేయాల‌ని క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బీఆర్‌ అంబేడ్కర్ ఆదేశించారు. ఏర్పాట్ల‌పై కలెక్టరేట్‌లోని త‌న ఛాంబ‌ర్లో వివిధ శాఖ‌ల అధికారుల‌తో సోమ‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. ఐసీడీఎస్ ఆధ్వ‌ర్యంలో సుమారు 4 వేల మంది మ‌హిళ‌ల‌తో విజయనగరంలోని రాజీవ్ స్టేడియంలో మహిళా దినోత్స‌వ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల‌ని ఆదేశించారు.

News March 3, 2025

హత్యాచారయత్నం ఘటనలో నిందితుడికి పదేళ్ల జైలు: SP

image

బొండపల్లి పోలీస్ స్టేషన్‌లో 2020లో నమోదైన వరకట్న వేధింపుల కేసులో నిందితుడు తవిటయ్యకు పదేళ్ల జైలు శిక్ష, రూ.2,500 జరిమానాను కోర్టు విధించిందని ఎస్పీ వకుల్ జిందాల్ సోమవారం తెలిపారు. చంద్రంపేటకు చెందిన తవిటయ్య అదనపు కట్నం తేవాలని వేధిస్తుండేవాడని, ఈ క్రమంలో కన్నవారి ఇంటి వద్ద ఉన్న భార్య, ఇతర కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా పాకకు నిప్పు పెట్టి హత్యాయత్నానికి పాల్పడడంతో అప్పట్లో కేసు నమోదైందన్నారు.

News March 3, 2025

MLC కౌంటింగ్.. ఎలిమినేట్ అవుతున్న అభ్యర్థులు

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తక్కువ ఓట్లు పోలైన అభ్యర్థులు ఎలిమినేట్ అవుతున్నారు. 6వ రౌండ్ పూర్తయ్యేసరికి ఐదుగురు అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు. ఇంకా ఐదుగురు అభ్యర్థులు మిగిలి ఉన్నారు. ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన అభ్యర్థులలో పి.శివ ప్రసాద్, ఎస్‌ఎస్.పద్మావతి, డాక్టర్ కే.రాధాకృష్ణ, ఆర్.సత్యనారాయణ, డాక్టర్ ఎస్.శ్రీనివాసరావు ఉన్నారు. కాగా ‘గాదె’ ముందంజలో కొనసాగుతున్నారు.

News March 3, 2025

VZM: గెలుపు దిశగా గాదె.. దేనికి సంకేతం?

image

ఉపాధ్యాయ MLC ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి గాదె శ్రీనివాసులనాయుడు గెలుపు దిశగా పయనిస్తున్నారు. మాజీ MLC రఘువర్మకు కూటమి మద్దతు పలికింది. ఆ దిశగా అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రజా ప్రతినిధులు రఘువర్మను గెలిపించాలని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆయనను కాదని గాదెకే గురువులు పట్టం కట్టారనేది లెక్కింపులో స్పష్టమవుతుంది. సమస్యల పరిష్కారానికై ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారని పలువురు భావిస్తున్నారు.

News March 3, 2025

బొబ్బిలి రైల్వే స్టేషన్లో ప్రయాణికుల పడిగాపులు

image

బొబ్బిలి- డొంకినవలస మధ్యలో ఓ గూడ్స్ రైలు సాంకేతిక కారణాలతో సోమవారం నిలిచిపోయింది. ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో గూడ్స్ రైలు నిలిచిపోయినట్లు రైల్వే అధికారులు తెలిపారు. దీంతో రాయగడ- విజయనగరం మధ్య రైళ్లు స్తంభించాయి. విశాఖ-కొరాపుట్ పాసింజర్ ట్రైన్ బొబ్బిలి రైల్వే స్టేషన్లో గంటకు పైగా నిలిచిపోవడంతో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. విజయనగరం నుంచి మరో రైలింజన్‌ను తెప్పించే ఏర్పాట్లు చేశారు.

News March 3, 2025

VZM: ‘లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలి’

image

ఈనెల 8న జిల్లా వ్యాప్తంగా జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను చిట్స్,  ఫైనాన్స్ కంపెనీలు వినియోగించుకోవాలని 4వ అదనపు జిల్లా న్యాయమూర్తి అప్పలస్వామి సూచించారు. జిల్లా కోర్టు సముదాయంలో చిట్ ఫండ్ కంపెనీల ప్రతినిధులతో సోమవారం సమావేశం నిర్వహించారు. చిట్టీ కేసులకు సంబంధించి ఎక్కువ కేసులను రాజీ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజేష్ పాల్గొన్నారు.

News March 3, 2025

VZM: అధికారులతో కలెక్టర్ అంబేడ్కర్ సమీక్ష

image

విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ అంబేడ్కర్ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఈవోపీఆర్డీలతో సమీక్ష జరిపి ఆయా శాఖల పనితీరుపై ఆరా తీశారు. గ్రామాలు, పట్టణాల్లో తాగునీరు, ఉపాధి హామీ, ఎంఎస్ఎంఈ సర్వే, తదితర అంశాలపై చర్చించారు. వేసవిలో తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని ఆదేశించారు.

News March 3, 2025

మానస.. ఆత్మ స్థైర్యానికి సెల్యూట్..! 

image

చదవాలన్న సంకల్పం ముందు మానసిక అంగవైకల్యం తలవంచింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వి.ఎం.పేటకు చెందిన పెట్ల మానస ఇంటర్ పరీక్షలకు హాజరైంది. చిన్నప్పటి నుంచి మానసికస్థితి సరిగా లేకపోయినా తల్లిదండ్రుల సాయంతో చదువు కొనసాగిస్తోంది. ప్రస్తుతం HEC సెకండియర్ చదువుతున్న మానస.. తన తండ్రి దేముడు సాయంతో సోమవారం పరీక్షకు హాజరయ్యింది. సహాయకురాలి సాయంతో పరీక్ష రాసింది. ఆమె ఆత్మ స్థైర్యానికి సెల్యూట్ చేయాల్సిందే.

News March 3, 2025

VZM: నేటి నుంచి ఇంటర్ సెకిండియర్ పరీక్షలు

image

నేటి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. విజయనగరం జిల్లాలో 177 అన్ని యాజమాన్య కళాశాలల నుంచి 20,368 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 166 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు శనివారం ప్రారంభం అయ్యాయి. 

News March 3, 2025

చీపురుపల్లిలో యాక్సిడెంట్.. లైన్మెన్ మృతి

image

పాలవ్యాను ఢీకొని లైన్ మాన్ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సోమవారం వేకువజామున చోటుచేసుకుంది. పేరిపికి చెందిన కర్ణపు సత్యం(43) చీపురుపల్లి ఆర్ఈ‌సీఎస్‌లో లైన్మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అమ్మవారి జాతరలో విధుల్లో భాగంగా ఆంజనేయపురం వైపు వెళ్తుండగా.. చీపురుపల్లి టీడీపీ ఆఫీసు ఎదురుగా పాలవ్యాను ఢీకొట్టింది. తీవ్రగాయాలతో సత్యం అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.