India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నకిలీ IPS సూర్య ప్రకాష్ ఉన్నత చదువులే చదివాడు. స్థానికంగా బీటెక్ పూర్తి చేసిన ఈయన కర్ణాటక ఓపెన్ యూనివర్సిటీలో MBA చేశాడు. 2003లో ఇండియన్ ఆర్మీలో సిపాయిగా ఎంపికయ్యాడు. 2005లో ఉద్యోగం విడిచిపెట్టి 2016 వరకు కాంట్రాక్ట్ పనుల్లో తండ్రికి చేదోడువాదోడుగా ఉండేవాడు. కాగా పవన్ పర్యటనలో IPS అంటూ తిరుగుతూ దిగిన ఫొటోలను వాట్సప్ స్టేటస్ పెట్టుకోగా ఎంక్వైరీలో అసలు విషయం బయట పడిందని పోలీసులు తెలిపారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణాన్ని నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని 20 సూత్రాల కార్యక్రమం ఛైర్మన్ లంకా దినకర్ సూచించారు. కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో ఎయిర్ ఫోర్ట్ అంశాన్ని ప్రస్థావించారు. అవసరాలకు తగ్గట్టుగా స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు సిద్ధం చేయాలన్నారు.విమానాశ్రయం ద్వారా ఎగుమతులకు ఉన్న అవకాశాలపై ఇప్పటినుంచే దృష్టిపెట్టాలన్నారు.
వైద్యాధికారులు గ్రామాల్లో ఆరోగ్య పరిస్థితుల్ని తెలుసుకొని వాటికి తగ్గట్టుగా బాధ్యతగా పని చేయాలని కలెక్టర్ డా.బి.ఆర్.అంబేడ్కర్ తెలిపారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో వైద్యాధికారులతో సమీక్షించారు. గత మూడు నెలలుగా డయేరియా అంశం జిల్లాను పట్టి పీడిస్తోందని, ప్రజల సందేహాలను నివృత్తి చేసేలా వాస్తవాలను వెల్లడించి నమ్మకం కలిగించాలని తెలిపారు.
నూతన సంవత్సర వేడుకల ఈవెంట్స్‌కు పర్మిషన్ తప్పనిసరి అని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ బాబ్జీరావు తెలిపారు. నూతన సంవత్సరం సంక్రాంతి పండుగలో లిక్కర్‌తో పార్టీలు జరుపుకునే వారు ఎక్సైజ్ సీఐ పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలని అని ఆయన తెలిపారు. సీఐ సంప్రదించాలన్నారు. మరిన్ని వివరాలకు పార్వతీపురం జిల్లా ఎక్సైజ్ అధికారి మొబైల్ నంబర్ 9490642242 ను సంప్రదించాలన్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. మక్కువ మండలంలోని గిరి శిఖర గ్రామమైన బాగుజోల పర్యటనలో నకిలీ ఐపీఎస్ హడావుడి సృష్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నకిలీ ఐపీఎస్‌తో పలువురు పోలీసులు సైతం ఫొటోలు దిగడం చర్చీనీయాంశమైంది. కాగా ఆయన ఎవరనేది పోలీసులు ఆరా తీసే పనిలో ఉన్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై పోలీసులు అధికారికంగా స్పందించాల్సి ఉంది.
కరెంట్ ఛార్జీల పెంపును నిరసిస్తూ విజయనగరం జిల్లాలో నిన్న వైసీపీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. బొత్స సత్యనారాయణ నియోజకవర్గమైన చీపురుపల్లిలో సైతం భారీ ర్యాలీ జరిగింది. నిన్న విజయనగరం జిల్లాలోనే బొత్స ఉన్నారు. అయినప్పటికీ ఆయన ఏ ధర్నాలోనూ పాల్గొనలేదు. శాసనమండలి ప్రతిపక్ష నాయకుడిగా, వైసీపీలో కీలకంగా ఉన్న ఆయన ఆందోళనల్లో పాల్గొనలేదనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఉమ్మడి విజయనగరం జిల్లాలో కానిస్టేబుల్ పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థులకు VZM పోలీస్ పరేడ్ గ్రౌండులో పీఎంటీ, పీఈటీ పరీక్షలు డిసెంబరు 30 నుంచి జనవరి 22 వరకు నిర్వహిస్తున్నట్లుగా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. జిల్లాలో 9,152 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు అర్హత సాధించగా అందులో 1,584 మంది మహిళలు ఉండగా 7,568 మంది పురుషులు ఉన్నారు. ఉదయం 4 గంటలకు పోలీసు పరేడ్ గ్రౌండ్ వద్దకు హాజరు కావాలన్నారు.
పండగ రద్దీ దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖ నుంచి పార్వతీపురానికి ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ శుక్రవారం తెలిపారు. ఈ రైలు 08565/66 జనవరి 10 నుంచి 20 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. విశాఖలో ఉదయం 10 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.20 పార్వతీపురం చేరుతుందన్నారు. తిరుగు ప్రయాణంలో పార్వతీపురం నుంచి 12.45 బయలుదేరి సాయంత్రం 4కి విశాఖ చేరుతుందని తెలిపారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో సహస్ర దీపాలంకరణ సేవ కార్యక్రమం శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని మండపంలోని ఊయలలో స్వామివారి విగ్రహం వేంచేపుచేసి సుందరంగా అలంకరించారు. వెయ్యి దీపాలు వెలిగించారు. స్వామి వారికి అర్చకులు ప్రత్యేక పూజలు జరిపించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఒక సీసీ కెమెరా 20 మంది పోలీసులతో సమానమని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. విజయనగరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, జిల్లాలో ఇప్పటికీ 620 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 38 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
Sorry, no posts matched your criteria.