India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రేపటి నుంచి మార్చి 31 వరకు పార్వతీపురం పట్టణానికి మెము ట్రైన్ వేస్తున్నట్లు రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ- విజయనగరం – పలాస- విజయనగరం మెము రైలును పార్వతీపురం వరకు పొడిగించారు. విజయనగరంలో రాత్రి 7. 55 గంటలకు బయలుదేరి పార్వతీపురం రాత్రి పది గంటలకు చేరుకుంటుందని తెలిపారు. తిరిగి పార్వతీపురంలో ఉదయం నాలుగు గంటలకు బయలుదేరి విజయనగరం 6 గంటలకు చేరుకుంటుందన్నారు.
‘2024’..ఉమ్మడి విజయనగరం జిల్లా రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసింది. గత ఎన్నికల్లో 9స్థానాల్లోనూ YCPఅభ్యర్థులను గెలిపించిన ప్రజలు.. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు పట్టం కట్టారు. దీంతో YCP కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొనగా..TDP ఫాలోవర్లు ఆనందంలో మునిగిపోయారు. బొత్స, కోలగట్ల, శంబంగి, రాజన్నదొర లాంటి సీనియర్లు ఓడిపోగా.. బేబినాయన, మాధవి, జగదీశ్వరి, అతిది గజపతి, విజయచంద్ర మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు.
విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉమ్మడి జిల్లాలో నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో విద్యుత్ శాఖ కార్యాలయాల వద్ద ర్యాలీలు నిర్వహిస్తారు. విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తారు. ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలను కలుపుకుని వైసీపీ ఈ కార్యక్రమం చేపట్టనుంది.
సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు షెడ్యూల్డ్ కులాల సర్వే నివేదికను జిల్లా వ్యాప్తంగా ఉన్న 530 గ్రామ సచివాలయాలు, పట్టణ ప్రాంతాల్లోని 96 వార్డు సచివాలయాల్లో గురువారం ప్రదర్శించారు. దీనిపై ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే తెలపవచ్చని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. ఈ నెల 31వ వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి జనవరి 6వ తేదీలోగా ఆన్లైన్ చేస్తామన్నారు.
రాష్ట్రంలో 6,100 కానిస్టేబుల్ నోటిఫికేషన్‌కి సంబంధించి ప్రభుత్వం ప్రక్రియను వేగవంతం చేయడంతో కానిస్టేబుల్ అభ్యర్థులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. విజ్జీ, రాజీవ్, అయోధ్య, మైదానాలన్నీ అభ్యర్థులతో నిండిపోయాయి. వర్షంతో మైదానాలు బురదమయం కాగా ఖాకీ కొలువు కోసం యువత అవరోధాలను అధిగమించి ప్రాక్టీస్ ముమ్మరం చేస్తున్నారు. వీరికి ఈనెల 30వ తేదీ నుంచి జిల్లా పెరేడ్ గ్రౌండ్లో ఈవెంట్స్ జరగనున్నాయి.
సంక్రాంతి సీజన్ సందర్భంగా పలు రైళ్లకు అదనపు కోచ్‌లను జత చేస్తున్నట్లు వాల్తేరు డివిజన్ డిఆర్ఎం సందీప్ బుధవారం తెలిపారు. విశాఖ-గుణపూర్-విశాఖ పాసింజర్ స్పెషల్‌కు జనవరి ఒకటి నుంచి 31 వరకు ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌ను జత చేస్తున్నారన్నారు. భువనేశ్వర్-తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్‌కు జనవరి 4 నుంచి 25 వరకు, తిరుగూ ప్రయాణంలో జనవరి 5 నుంచి 26 వరకు ఒక థర్డ్ ఏసీ కోచ్‌ను జత చేస్తున్నట్లు తెలిపారు.
తుఫాన్ ప్రభావంతో పార్వతీపురం జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని పాఠశాలకు గురువారం సెలవు ప్రకటించినట్లు డీఈవో ఎన్.టీ.నాయుడు తెలిపారు. కలెక్టర్ ఆదేశాలు మేరకు డీవైఈవోలు, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులకు తెలియజేస్తున్నామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా క్లాసులు నిర్వహిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ఈనెల 22 నుంచి జరిగిన రాష్ట్ర స్థాయి జూనియర్ అంతర్ జిల్లాల బాల, బాలికల కబడ్డీ ఛాంపియన్‌షిప్ పోటీల్లో విజయనగరం బాల, బాలికల జట్లు ద్వితీయ స్థానం సాధించాయి. వివిధ జిల్లాలకు చెందిన జట్లతో హోరాహోరీగా తలపడి రన్నర్లుగా నిలిచారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు పలువురు అభినందనలు తెలిపారు.
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం 24 గంటల్లో బలహీన పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు బుధవారం తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యంతో పాటు నెల్లూరు జిల్లాలకు మరో 24 గంటల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.
యేసు క్రీస్తు జననం సందర్భంగా జిల్లాలో నిర్వహించే క్రిస్టమస్ వేడుకల్లో ఎటువంటి అల్లర్లు, మతపరమైన తగాదాలు జరగకుండా ప్రశాంతంగా ముగిశాయని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా చర్చిల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ ఎటువంటి అల్లర్లు జరగకుండా బందోబస్తు ఏర్పాట్లను సంబంధిత డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారన్నారు.
Sorry, no posts matched your criteria.