India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
➤ మార్చి 2న ఉదయం నేత్రోత్సవం, పాలధార ఉత్సవం, సాయంత్రం భామా కలాపం పేరిట భాగవతం ప్రదర్శన
➤ మార్చి 2న రాత్రి 7గంటలకు రాష్ట్ర స్థాయి డాన్స్ పోటీలు
➤ 3న సాయంత్రం క్లాసికల్ డాన్స్ ప్రోగ్రాం, ప్రముఖ సినీ గాయకులచే స్వరాభిషేకం, బాలు రైడర్స్ ఆధ్వర్యంలో డాన్స్ ఈవెంట్
➤ 4న రాత్రి ఢీ డ్యాన్సర్లతో మెగా డాన్స్ హంగామా, 11 గంటలకు భారీ మందుగుండు ప్రదర్శన, శ్రీరామాంజనేయ యుద్ధం, సత్యహరిశ్చంద్ర నాటకం
విజయనగరంలో ఓ యువకుడు పెళ్లి ఇష్టం లేదని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. CI శ్రీనివాస్ వివరాల ప్రకారం.. నెయ్యిల వీధికి చెందిన పి.సాయికి మార్చిలో వివాహం జరగాల్సి ఉంది. కాగా ఈనెల 24 ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అనంతరం తల్లికి ఫోన్ చేసి పెళ్లి ఇష్టం లేదని చెప్పి కాల్ కట్ చేశాడు. యువకుడి కోసం ఎంత గాలించినా ఆచూకీ లభించకపోవడంతో తల్లి చిట్టెమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వన్ టౌన్ CI కేసు దర్యాప్తు చేపట్టారు.
విశాఖలో విజయనగరం జిల్లా వాసి గురువారం మృతిచెందాడు. డాబా గార్డెన్ వద్ద గల నీలమ్మ వేప చెట్టు సమీపంలో మెడికల్ స్టోర్ వద్దకు వచ్చి మందులు తీసుకునే సమయంలో ఓ వ్యక్తి కుప్పకూపోయాడు. స్థానికులు 108కి సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది అతడు మృతిచెందినట్లు తెలిపారు. అతని వద్ద మందుల చీటీ మాత్రమే ఉండడంతో టూ టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టి మెరకముడిదాం మండలానికి చెందిన రమణ (60)గా గుర్తించారు.
మెరకముడిదాం మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది. ఈ ఎన్నికలలో 100% పోలింగ్ జరిగిందని అధికారులు తెలిపారు. మెరకముడిదం మండలంలో మొత్తం 55 ఓట్లు ఉండగా మెుత్తం 55 ఓట్లు నమోదైయాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగలేదని ఓటింగ్ ప్రశాంతంగా అయిందని అధికారులు తెలిపారు.
భోగాపురంలో చీటీల పేరుతో మోసం చేసిన కేసులో భార్యాభర్తలను అరెస్ట్ చేశారు. భోగాపురంలో ఉంటున్న భార్యాభర్తలు తులసీ, మురళీ చీటీలు నిర్వహించేవారు. చీటీ పూర్తయిన వారికి డబ్బులు చెల్లించకుండా పరారీలో ఉన్నారు. దీంతో రూ.30 కోట్ల వరకు నష్టపోయామంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా దార్యాప్తు చేపట్టారు. పోలీసులు ఈనెల 25న రాజమహేంద్రవరంలో వీరిని అదుపులోకి తీసుకొని బుధవారం విజయనగరం కోర్టులో హాజరుపరిచారు.
విజయనగరంలో ఓ విద్యార్థి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న లోకేశ్ స్థానిక బొడ్డువారి జంక్షన్‌లో ఫ్రెండ్స్‌తో ఉంటున్నాడు. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి అన్నయ్య గణేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు.
ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా విజయనగరం జిల్లాలో గల అన్ని యాజమాన్య పరిధిలోని ఉన్నత పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటిస్తున్నట్లు DEO యు.మాణిక్యం నాయుడు బుధవారం తెలిపారు. ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు తమ పరిధిలో గల అన్ని ఉన్నత పాఠశాలలు సెలవు ఇచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 29 పాఠశాలల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నట్లు ఆయన చెప్పారు.
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ ఆదేశాలకు అనుగుణంగా రెవెన్యూ అధికారులు ఎన్నికకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేశారు. జిల్లాలో మొత్తం 5,223 మంది ఉపాధ్యాయులు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 3,270 మంది పురుషులు కాగా, 1,953 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
విజయనగరం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి విశాఖలో దారుణ హత్య చేశాడు. రామతీర్థానికి చెందిన వై.శ్రీను, విశాఖలోని రామ్‌నగర్‌కు చెందిన ఆనంద్ ఇద్దరూ కలిసి సోమవారం రాత్రి వెంకోజిపాలెం వద్ద మద్యం తాగారు. ఈక్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగింది. భయపడి ఆనంద్ పారిపోగా.. శ్రీను వెంటపడి మరీ రాయితో కొట్టి చంపేశాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పెదమానాపురంలో 2023లో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి 20ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.4వేలు జరిమానా విధించినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. పెదమానాపురానికి చెందిన మారోతు వెంకటేశ్ (25) ఓ బాలికను పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి నాగమణి తీర్పు వెల్లడించినట్లుగా ఎస్పీ పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.